
ఒంటరిగా ఉన్న రాధ మీద అటాక్ ప్లాన్ చేస్తాడు భవానీ శంకర్. ఇలా లైవ్‌లో మర్డర్ చూసి చాలా రోజులు అయిందని భవానీ శంకర్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇంతలో రాధ పక్కన విక్రమ్ వచ్చి కూర్చుంటాడు. దీంతో రౌడీలు సైలెంట్ అవుతారు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అని భవానీ శంకర్ అనుకుంటాడు. ఇక రాధను కూల్ చేసేందుకు ఐస్ క్రీం కూడా తెస్తాడు. కానీ రాధ మాత్రం మారాం చేస్తుంది. నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్తావా? అని అలుగుతుంది. రాధను కూల్ చేసి ఆ ఐస్ క్రీం తినిపించాలని విక్రమ్ అనుకుంటాడు.ఇక అప్పుడే ఫోన్ చేసిన దమయంతికి భవానీ శంకర్ లైవ్ రన్నింగ్ కామెంటరీ చేస్తాడు. రాధ చిన్నగా నవ్వింది.. విక్రమ్ గట్టిగా నవ్వాడు.. ఇద్దరూ కలిసి పకపకా నవ్వుకుంటున్నారు.. రాధకి విక్రమ్ ఐస్ క్రీం తినిపిస్తున్నాడు అని చెప్తాడు భవానీ శంకర్. వదిలేసినోడు మళ్లీ ఎందుకు వచ్చాడు అని దమయంతి అనుకుంటుంది. ఏమో అమ్మా.. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగానే ఉన్నట్టుంది. నువ్వులేక నేనులేను అనే రేంజ్లో ప్రేమ ఉంది.. ఏడేడు జన్మల బంధం అన్నట్టుగా ఉందని భవానీ శంకర్ అంటాడు.ఇంకో వైపు సునంద మాత్రం వారసుడు రావాలని పూజ చేయించాలని చూస్తుంది. రాధ, విక్రమ్ ఇంకా గుడ్ న్యూస్ చెప్పడం లేదని, ఏమైనా దోషాలున్నాయేమో అని పంతుల్ని అడుగుతుంది సునంద. అప్పుడు ఏదో వ్రతం ఉందని రాధ చెప్పింది కదా అని నంద గోపాల్ గుర్తు చేస్తాడు. నాకు తెలిసి అది అబద్దం అండి, అందుకే ఇలా పంతుల్ని అడిగాను.. పూజకి ముహూర్తం కూడా పెట్టించాను అని సునంద అంటుంది. ఇంకో వైపు రాధ తన పుట్టింట్టో విక్రమ్‌ను ఏడ్పిస్తుంటుంది. తినడానికి కూర్చో పెట్టి.. పద్మావతి పక్కకు వెళ్లిన ప్రతీ సారి విక్రమ్‌ని గిల్లుతూ, గిచ్చుతూ ఏడ్పిస్తుంటుంది రాధ.ఇంకో వైపు ఖాళీ తింటూ ఎంజాయ్ చేస్తున్న సుందరి మీద ప్రియ అసహనం వ్యక్తం చేస్తుంది. ఈ దొంగ చిట్టి వేస్ట్ మామ్.. దాన్ని పంపించు.. అదేం చేయడం లేదు.. బావని, రాధను విడగొట్టడం లేదు అని అంటుంది ప్రియ. ఇంతలో సుందరి వచ్చి.. నన్ను పట్టుకుని అంత మాట అంటావా.. పైకి కమెడియన్లా కనిపించినా కూడా లోపల విలన్‌ను.. స్టేజ్ మీద నా నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్ని కరిగించా.. మీ బావ మనసు కరిగించలేనా? .. అని అంటుంది. చివరకు ఇచ్చే ట్విస్ట్ మీకు మైండ్ బ్లాక్ అవుతుంది అని అంటుంది సుందరి. వాళ్లిద్దరినీ విడగొట్టి.. విక్రమ్‌ని పెళ్లి చేసుకుని పర్మినెంట్ చిట్టిగా ఉండిపోతా అని సుందరి తన మనసులో తాను అనుకుంటుంది.ఇంకో వైపు విక్రమ్‌తో రాధ గిల్లికజ్జాలు పెట్టుకుని.. నేను ఇంటికి రాను.. మీరే వెళ్లండని అంటుంది. దీంతో రాధను పుట్టింట్లోనే వదిలేసి వెళ్తాడు విక్రమ్. దొంగ చిట్టి సంగతి తేల్చాలి.. అందుకే మీతో ఇలా గిల్లికజ్జాలు ఆడి పంపించాను.. అని రాధ అంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
Recommended for you
Found this helpful?
Share this story with your network









