
తాగిన మత్తు కాస్త దిగడంతో మనోజ్ కిందకు వస్తాడు. నన్ను ఈ ఇంటికి ఎవరు తీసుకు వచ్చారు అని మీనాని అడుగుతాడు. మీ నాన్న, మీ తమ్ముడు అని అంటుంది మీనా. ఇంకెవ్వరూ లేరా అని మనోజ్ అడుగుతాడు. లేరు అని మీనా అంటుంది. మనోజ్ బయటకు వెళ్తుంటాడు. ఎక్కడికి అని మీనా అడిగితే.. అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని మనోజ్ అంటాడు. ఈ టైంలో ఈయనకు బిజినెస్ ఎందుకు గుర్తుకు వచ్చింది అని మీనా అనుకుంటుంది. ఇంతలో బాలు వస్తాడు. మనోజ్ బయటకు వెళ్లిన సంగతి చెబుతాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు కదా.. అని బాలు అంటే.. మీనా రొమాంటిక్‌గా ఫీల్ అవుతుంది. కానీ బాలు మాత్రం మనోజ్ రోహిణి గదిని వెతుకుదాం.. ఏదైనా ఆధారం దొరుకుతుందని అంటాడు. అలా చేయడం తప్పు అని అంటుంది మీనా. బొమ్మ పడితే వెతుకుదాం అని కాయిన్ టాస్ వేస్తాడు. బొమ్మ పడుతుంది.. రూంలో వెతుకుదాం పదా అని బాలు అంటాడు. రూంలోకి వెళ్లి వెతికే ముందే గుమ్మం వద్ద ఉన్న డోర్ వేసి వెళ్తాడు బాలు. ఇక రూంలో వెతుకుతుంటే వారికి ఓ డ్రెస్ కనిపిస్తుంది.మనోజ్, రోహిణిలపై అనుమానం.. ఈ డ్రెస్ ఇక్కడ దాచి పెట్టారు అంటే.. దీని వెనకాల కూడా ఏదో సీక్రెట్ ఉన్నట్టే అని బాలు అంటాడు. మర్చిపోయి పెట్టారా? అయినా.. రోహిణి బీరువాలో ఎందుకు ఉంది? అని మీనా అనుకుంటుంది. మీ అన్నయ్య కొని.. రోహిణి బీరువాలో పెట్టాడా? ఆ చింటుకి అయితే ఇది సరిగ్గా సరిపోతుంది కదండి అని మీనా అంటుంది. అవును అని బాలు అంటాడు. ఆ లింకులు అన్నీ ఇప్పుడు కలుస్తున్నాయి.. అని బాలు, మీనా అనుకుంటారు. ఇంతలో కింద కాలింగ్ బెల్ వినిపిస్తుంది. ఎవరో వచ్చినట్టున్నారు పదా అని బాలు, మీనా కిందకు వెళ్లిపోతారు.ఇదంతా నీ ట్రైనింగే కదరా ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ అని మనోజ్‌ని బాలు అడుగుతాడు. అవన్నీ నీకు చెప్పాలా? ఇది నా ఇల్లు.. నీకు ఎంత హక్కుందో నాక్కూడా అంతే హక్కుంది.. నన్ను అడగడానికి నువ్వు ఎవరు అని మనోజ్ అంటాడు. ఇప్పుడు ఇలానే అంటారు.. మీకు అవసరం ఉన్నప్పుడు.. మిమ్మల్ని ఆదుకున్నప్పుడు.. పోలీస్ స్టేషన్ నుంచి తీసుకు వచ్చినప్పుడు మాత్రం కనిపించదు కదా అని మీనా కడిగిపారేస్తుంది. ఇదంతా నీ ట్రైనింగే కదరా అని మనోజ్ అంటే.. నీకు అమ్మ ట్రైనింగ్ కదా అని బాలు అంటాడు. బయటకు వెళ్లి తినేసి వచ్చా అని మనోజ్ అంటాడు. ఇంట్లో చేస్తానంటే వద్దన్నాడు అండి అని మీనా చెబుతుంది.మనోజ్‌కి అండగా నిలిచింది.. అసలు ఈయన్ని పోలీస్ స్టేషన్లోనే వదిలేయాల్సింది.. అనవసరంగా బయటకు తీసుకు వచ్చారు అని మీనా అంటుంది. ఇక ఉదయాన్నే మళ్లీ హాల్లో కూర్చుని బాలు, మీనా.. రోహిణి, మనోజ్‌ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంతైనా సరే మనోజ్‌కి అండగా నిలిచింది.. ఎంతో సపోర్ట్ చేసింది.. రోహిణి వల్లే మనోజ్ ఈ స్థాయికి వచ్చాడు అని బాలు, మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ చాటుగా విన్న మనోజ్ కిందకు వచ్చి ఫైర్ అవుతాడు. తన వల్ల కాదు.. నా వల్లే.. నా తెలివి తేటల వల్లే.. నన్ను చేసుకోవడం రోహిణి అదృష్టం అంటూ మనోజ్ అంటాడు.బుద్ది మార్చుకోని రోహిణి.. ఇంట్లో అందరి కంటే ఎక్కువ బ్రాడ్ మైండ్ ఉంది నీకే అంటూ శ్రుతికి ఫోన్ చేసి ఐస్ చేయాలని చూస్తుంది రోహిణి. నా వర్షెన్ ఎవ్వరూ వినడం లేదు.. నా మీద రూమర్లు స్ప్రెడ్ చేస్తున్నారు.. ఆ ఇంట్లో వాళ్లదే తప్పు అని రోహిణి చెబుతుంటుంది. సరే నేను ఇంటికి వెళ్తున్నాను.. మళ్లీ ఫోన్ చేస్తా అని కట్ చేస్తుంది శ్రుతి. చూశావా రవి.. చేసిందంతా చేసి.. మళ్లీ మనదే తప్పు అంటోంది.. నా సపోర్ట్ కోసం ఫోన్ చేసింది.. నేను చేయను అని ఇన్ డైరెక్ట్‌గా చెప్పేసి కట్ చేశా అని శ్రుతి అంటుంది. ఛ.. శ్రుతి నాకు సపోర్ట్ చేస్తుందని అనుకున్నా.. కానీ అలా కనిపించడం లేదే అని ఫోన్ పెట్టేసిన తర్వాత రోహిణి అనుకుంటుంది.మనోజ్‌ని తిట్టిన సుశీల.. ఇంతలో ఇంట్లోకి సుశీల వస్తుంది. బాలు, మీనాలు సుశీలను పలకరిస్తారు. మనోజ్ రావడంతోనే.. ఎవడ్రా నువ్వు.. కొత్తగా ఈ తాగుడు అలవాటు ఏంటి.. అయినా నీ భార్యను అలా కొట్టి పంపిస్తుంటే.. నువ్వు ఆపొద్దా?.. నీకు బాధ్యత లేదా? అయినా ఇన్ని రోజులు నిన్ను భరించింది అంటే ఆమె మహా సాధ్వినే.. నీ భార్యకి ఫోన్ చేసి రమ్మను.. అని మనోజ్‌ని తిడుతుంది సుశీల. సత్యం.. నువ్వేంట్రా.. నీ భార్యని నువ్వు పిలవవా? అని తిడుతుంది సుశీల. ఇంతలో రవి, శ్రుతి వచ్చి.. బామ్మ అందరినీ సెట్ చేస్తుంది అని అనుకుంటారు.ఫోన్ లిఫ్ట్ చేయని రోహిణి.. మనోజే నాకు ఫోన్ చేస్తాడు.. అని విద్యతో నమ్మకంగా చెబుతుంది రోహిణి. దేవుడా మనోజ్ నాకు ఫోన్ చేసేలా చూడు అని మనసులో ప్రార్థించుకుంటూ ఉంటుంది రోహిణి. ఏంటి దేవుడ్ని ప్రార్థిస్తున్నావా? అని విద్య అంటుంది. ఇంతలో మనోజ్ నుంచి కాల్ వస్తుంది. కానీ రోహిణి మాత్రం లిఫ్ట్ చేయదు. మనోజ్ ఎన్ని సార్లు చేసినా రోహిణి సైలెంట్‌గానే ఉంటుంది. ఇదే ప్రేమ.. ఒక్క సారికే లిఫ్ట్ చేస్తే తక్కువ అయిపోతాను.. నా గురించి ఆలోచించాలి.. నా మీద ప్రేమ, బాధ్యత పెరగాలి అని రోహిణి అంటుంది. ఇది ప్రేమ కాదు.. శాడిజం, సైకోయిజం అంటారు.. అని విద్య అంటుంది.రోహిణి రాకముందే ప్రభావతిని పిలిస్తే ఇక మనోజ్ కిందకు వస్తాడు. సుశీల అడగడంతో రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తాడు. మళ్లీ ఫోన్ చేయరా అని మనోజ్‌ని తిడుతుంది. నా ఫోన్లోంచి చేస్తావా? అని బాలు అంటే.. నేను బిజినెస్ మెన్ని, నా ఫోన్ ఎప్పుడూ రీచార్జ్ చేసే ఉంటుంది అని మనోజ్ అంటాడు. నీ దాంట్లోంచి చేస్తే లిఫ్ట్ చేయడం లేదు.. ఈ సారి స్విచ్ఛాఫ్ చేస్తుందేమో అని బాలు అంటాడు. మనోజ్ చేస్తేనే బాగుంటుందండి మీనా చెబుతుంది. మరి నీ సంగతేంటి సత్యం.. ప్రభావతిని పిలవవా? అని అంటుంది సుశీల. రోహిణి రాకముందే ప్రభావతిని పిలిస్తే అదో గొడవ అవుతుందని సత్యం అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్: మనీషా కోసం జల్లెడ పడుతున్న టిట్లా.. ఆశ్రయం ఇచ్చిన మాధవ.. గ్రామ దేవత వివరాలు తెలుసుకున్న చక్రి


