నేడు చాలా మంది వాడే నూనె పరిమాణం చూస్తున్నారు తప్పితే దాని రకాన్ని గుర్తించట్లేదు. మనం తీసుకునే వెన్న, పామాయిల్ వంటి సంతృప్త కొవ్వుల కంటే మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీయాసిడ్స్ తీసుకుంటే లిపిడ్ ప్రొఫైల్స్ గణనీయంగా పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం మార్గరిన్, పాల కొవ్వులో కొంతభాగాన్ని గుండెకి మేలు చేసే నూనెలతో రీప్లేస్ చేస్తే గుండె సంబంధ సమస్యలతో వచ్చే మరణాల ప్రమాదం తగ్గిందని తేలింది. ఎందుకంటే, సంతృప్త కొవ్వులని తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా, ధమనులు హెల్దీగా మారాలన్నా, హై బ్లడ్ ప్రెజర్ , గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు వంటల్లో నూనెల్ని తగ్గించడం మంచిదని సలహా ఇస్తున్నారు. నూనెలు ఎంత తగ్గించి వంట చేస్తే అంత మంచిది. నూనె తగ్గితే రుచి ఉండదు అనే ఆలోచనని తీసేసి తక్కువ నూనెతో రుచిగా ఎలా వండాలో తెలుసుకుని తీరాలి. మనం రోజుకి ఎంత నూనె వాడుతున్నాం. ఓ మనిషికి నెలలో ఎంత నూనె వాడాలనేది తెలుసుకుని తీరాలి. కేవలం వంటల్లోనే నూనె తగ్గిస్తే సరిపోదు. మనకి తెలియకుండా తీసుకునే ప్రతీ పదార్థంలోనూ నూనె ఉంటుంది. ప్యాకేజ్డ్ ఫుడ్, స్నాక్స్, రెస్టారెంట్ మీల్స్‌లో మనకి తెలియని పదార్థాలు, కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ కూడా మన గుండెకి గుబులు పుట్టించేవే. డాల్డా, పామాయిల్, శాచురేటెడ్ ఫ్యాట్స్‌ని తగ్గించి గుండెకి మేలు చేసే రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, పల్లీ నూనె, ఆవనూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌ని తీసుకోవాలి. సాధారణంగా మనం నెలలో ఎంత నూనె వాడుతున్నామనేది ఇంట్లో ఉండే మనుషులని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో ఆరోగ్య పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్య అవసరాలని బట్టి ఈ పరిమాణం మారుతూ ఉంటుంది. అంతేకానీ, అందరికీ ఒకే తీరుగా కొలిచి చెప్పలేం. ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితిని బట్టి నూనె పరిమాణం పెరగడం, తగ్గడం జరుగుతుంది. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఫ్యామిలీ డాక్టర్ని కలిస్తే మిమ్మల్ని పరీక్షించి మీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చెబుతారు. అయితే, సాధారణంగా అయితే రోజుకి 4 టీస్పూన్ల నూనె మాత్రం సరిపోతుంది. ఈ లెక్క ప్రకారం నెలకి 500 నుంచి 600 మిల్లీ లీటర్ల నూనె చాలు. నలుగురు ఉన్న ఇంట్లో మొత్తం 2 లీటర్ల నూనెకి మించి వాడొద్దు. కానీ, మనం 2 లీటర్ల నూనెని వారంలో అయిపోగొట్టేస్తున్నాం. ఇది భయపడాల్సిన విషయమే. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అలాగే వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.