
బరువు నియంత్రణ, గుండె ఆరోగ్యం, కండరాల నిర్మాణం వంటి లక్ష్యాలను బట్టి ఈ రెండింటి పాత్ర మారుతుంది. అవకాడో ప్రధానంగా ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌ను అందించే పండు కాగా.. గుడ్డు ప్రోటీన్‌కు మంచి వనరు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఆరోగ్యకరమైన ఆహార విధానంలో గుడ్లు, అవకాడో వంటి ఆహారాలను భాగం చేసుకోవచ్చని సూచిస్తోంది. కాబట్టి ఈ రెండింటి మధ్య తేడాలను తెలుసుకుని ఆహారంలో సరైన విధంగా చేర్చుకోవడం ఉపయోగకరం.




