
బ్రోకలీలో సల్ఫేరాఫేన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. బ్రోకలీ తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రా బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌ను తగ్గిస్తుంది. టమాటాలు తింటే కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తుంది. వెల్లుల్లి తింటే కడుపు, పెద్దపేగు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. పాలకూర, తోటకూర ఆకుకూరల్లో కెరోటినాయిడ్స్, ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరానికి రక్షణ అందిస్తాయి. ఆకుకూరలు తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. గ్రీన్ టీలో కెటాచిన్లు అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధిని నిర్మూలిస్తాయి. దీంతో క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. వాల్నట్స్, బాదం వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. పసుపు తింటే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.