
భద్రాద్రి: లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల తండాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందుతున్న వసతి, తాగునీరు, పారిశుద్ధ్యం, భోజనం తదితర సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ నాణ్యమైన పౌష్టికాహారం అందేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం విషయంలో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ వెంట లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ శిరీష, ఎంపీడీవో సుచిత్ర, తదితరులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.