
వయసు పెరగడం సహజమైన ప్రక్రియే. కానీ, దాని తాలూకు ఛాయలు ముఖంలో కనిపంచకుండా చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉండాలనుకుంటాం. దానికోసం బయట దొరికే బ్యూటీ ఉత్పత్తుల్ని చాలానే వాడుతుంటాం. అయితే అవి ఇచ్చే మెరుపులు తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. వ యసు పెరగడం సహజమైన ప్రక్రియే. కానీ, దాని తాలూకు ఛాయలు ముఖంలో కనిపంచకుండా చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉండాలనుకుంటాం. దానికోసం బయట దొరికే బ్యూటీ ఉత్పత్తుల్ని చాలానే వాడుతుంటాం. అయితే అవి ఇచ్చే మెరుపులు తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. అందుకే యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించాలంటే రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాల్ని తప్పక చేర్చుకోవాలని చెబుతున్నారు. బెర్రీలు, దానిమ్మ... వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి కొలాజన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో చర్మం బిగుతుగా, యవ్వనంగా మారుతుంది. అవకాడో... ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో మెండుగా ఉంటాయి. ఇవి చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. ముఖంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. నట్స్, సీడ్స్‌... బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్‌లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్, ఆకుకూరలు... క్యారెట్‌లోని బీటా కెరోటిన్, పాలకూర, మెంతికూరల్లోని విటమిన్లు, ఖనిజాలు చర్మానికి సహజ కాంతిని ఇస్తాయి. అంతేకాదు, టొమాటోలో ఉండే లైకోపిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ యూవీ కిరణాల నుంచి చర్మానికి రక్షణ కవచంలా పని చేస్తుంది. వీటితోపాటు రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తప్పక తాగాలి. ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాలు మైదా, అధిక చక్కెరలు, నూనె వస్తువులను తగ్గించాలి. వీటితోపాటు సరిపడా నిద్ర, శారీరక కసరత్తులు చేస్తూ ఉంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings