ధమనులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్‌ తింటే ధమనుల సమస్యలు తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్ కూడా లభిస్తుంది. అవకాడో తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అవకాడో తినడం వల్ల ధమనులు ఆరోగ్యంగా మారుతాయని హెల్త్లైన్ తెలిపింది. బీన్స్లో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బీన్స్ తింటే బీపీ, షుగర్ తగ్గుతుంది. ధమనులు ఆరోగ్యంగా మారుతాయి. బెర్రీస్లో ఫైబర్తో పాటుగా, ఆంథోసైనిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. ధమనుల వాపును తగ్గిస్తాయి. బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయల్లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. బ్రోకలీ, క్యాబేజీ వంటివి తింటే ధమనుల్లో కాల్షియం పేరుకుపోదు. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే రక్తపోటు కంట్రోల్ అవుతుంది. ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. వెల్లుల్లి తింటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి. పాలకూర, ఇతర ఆకుకూరల్లో పొటాషియం, నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలకూర తింటే ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి. వాల్నట్స్, పిస్తా వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ను కరిగిస్తాయి. ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. ఓట్స్ తింటే ధమనులు ఆరోగ్యంగా ఉంటాయి.



