
అటుకులు, పల్లీలు, మొలకలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో, పచ్చి బఠానీ, పసుపు, చక్కెర, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, నూనె ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయండి. నూనె వేడి అయ్యాక పల్లీలు వేసి వేయించుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసి వేయించండి. ఇందులోనే పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ తరుగు, కరివేపాకు కూడా వేసి రంగు మారే వరకు వేయించండి. తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేయించుకోండి. తర్వాత ఇందులో టొమాటో ముక్కలు, పచ్చి బఠానీలు, సరిపడా ఉప్పు, పసుపు వేసి మూతపెట్టి 5 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న అటుకులు వేసి నెమ్మదిగా టాస్ చేయండి. తర్వాత కొద్దిగా చక్కెర వేయండి. తర్వాత కడాయి అంచుల గుండా కొన్ని నీళ్లు పోసి మూతపెట్టి 3 నిమిషాలు మగ్గించండి. తర్వాత మూత తీసి నిమ్మరసం, కొత్తమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే.. రుచికరమైన మొలకల పోహా రెడీ అయినట్లే. వేడి వేడిగా తింటే రుచి చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా.



