
చిలగడదుంపల్లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. చిలగడదుంపలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుందని క్లీవ్‌లాండ్ క్లీనిక్ తెలిపింది. గుమ్మడికాయలో ఎక్కువ మోతాదులో బీటా కెరోటిన్ లభిస్తుంది. ఇది కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఒక కప్పు వండిన క్యారెట్లో 13,000 మైక్రోగ్రాముల బీటా కెరోటిన్ ఉంటుంది. క్యారెట్ తింటే కంటి చూపు మెరుగుపడుతుంది. వండిన బటర్నట్ స్క్వాష్‌లో కూడా బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. బటర్నట్ స్క్వాష్ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. పాలకూరలో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. పాలకూర తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి. వండిన ఒక కప్పు కాలేలో 2,040 మైక్రోగ్రాముల బీటా-కెరోటిన్ లభిస్తుంది. కాలే తింటే ఓవరాల్ హెల్త్ మెరుగుపడుతుంది. రెడ్‌బెల్ పెప్పర్లో 1,660 మైక్రోగ్రాముల బీటా కెరోటిన్ లభిస్తుంది. రెడ్‌బెల్ పెప్పర్ తినడం వల్ల చర్మం మెరుస్తుంది. ఒక అరకప్పు ఆఫ్రికాట్లలో 1,690 మైక్రోగ్రాముల బీటా కెరోటిన్ లభిస్తుంది. ఆఫ్రికాట్స్ తినడం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. చర్మం మెరుస్తుంది. మామిడిపండ్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. మామిడి తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది.