
Business Ideas: స్వచ్ఛమైన నాటుకోళ్ల పెంపకం ద్వారా ఆరు నెలల వ్యవధిలో రూ. 10 లక్షల వరకు లాభం సంపాదించే వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ విజయవంతం కావాలంటే సరైన అవగాహన, పెట్టుబడి, ప్రణాళిక అవసరం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు రూ. 1.7 లక్షల పెట్టుబడి అవసరమవుతుందని అనుభవం ఉన్న వ్యాపారులు చెబుతున్నారు. ఈ పెట్టుబడితో 1200 స్వచ్ఛమైన నాటుకోడి పిల్లలను కొనుగోలు చేయాలి. ఈ పిల్లలను ఒకేసారి కాకుండా, మూడు లేదా నాలుగు విడతలుగా తీసుకోవడం ఉత్తమం. ఇది నిర్వహణను సులభతరం చేస్తుంది. నాటుకోడి పిల్లలను ఆరు నెలల పాటు జాగ్రత్తగా పెంచాలి. ఈ కాలంలో వాటికి సరైన ఆహారం, నివాసం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.



