
మేష రాశి వారికి ఈరోజు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు చేసే పనులకు అధిక ప్రాధాన్యత లభించొచ్చు. బుధాదిత్య యోగం ప్రభావంతో వ్యాపారులు మెరుగైన లాభాలు పొందొచ్చు. మీకు అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం లభించొచ్చు. మరోవైపు ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మీరు నిరాశ చెందుతారు. ఇతరులకు సాయం చేయడంలో మీరు మనశ్శాంతిని పొందుతారు కాబట్టి, దానధర్మాలతో గడుపుతారు. పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి. వృషభ రాశి నుంచి చంద్రుడు సప్తమ స్థానంలో , సూర్యుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ గ్రహాల ప్రభావంతో మీరు చేసే పనుల్లో కొత్త అవకాశాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడొచ్చు. సమాజంలో మీకు కీర్తి, ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. మీ పిల్లలకు సంబంధించిన విషయాలపై కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పరిహారం : ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి. మిథున రాశి వారికి ఈరోజు అనేక శుభ యోగాల కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నింట్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు తాము చేసే పనిలో కొత్త బాధ్యతలు లేదా ముఖ్యమైన ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు భారీ లాభాలొచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు భారీ లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ సంతోషం, శ్రేయస్సు పెరగొచ్చు. పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. కర్కాటక రాశి వారికి ఈరోజు గురు గ్రహం అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీకు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు లభించి, మీ ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. మీ వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. తొందరపాటు మరియు భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు పశ్చాత్తాపానికి కారణం కావొచ్చు. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు దేవాలయాలను సందర్శించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పరిహారం : ఈరోజు విష్ణుమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. సింహ రాశి వారికి ఈరోజు రాజకీయ రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ పిల్లల పట్ల బాధ్యతలు కూడా నెరవేరుతాయి. పోటీ పరీక్షల్లో మీరు రాణించే అవకాశం ఉంది. మీ పెండింగ్ పనులు కూడా పూర్తవ్వొచ్చు. మరోవైపు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు కంటి సమస్యలు, జీర్ణక్రియ ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూ నైవేద్యంగా సమర్పించి పూజలు చేయాలి. కన్య రాశి వారికి ఈరోజు గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో శుభ ఫలితాలు రానున్నాయి. అంతేకాదు ఇదే రాశిలో బుధుడితో కలిసి శుభ యోగం ఏర్పరచడంతో మీ ఆత్మవిశ్వాసం పెరగనుంది. మీ మాటతీరు పెరగొచ్చు. మీరు గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లభించొచ్చు. మీకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ పని పట్ల ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది. పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి. తులా రాశి వారికి ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీకు కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. మీ మాటతీరుతో ప్రత్యేక గౌరవాన్ని పొందుతారు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా, వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభించొచ్చు. మీరు చేసే ప్రయాణాలు ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటాయి. పరిహారం : ఈరోజు లక్ష్మీనారాయణుడిని పూజించాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించడంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మంచి మార్గాలు లభించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో భారీ లాభాలు రావొచ్చు. ఈ కాలంలో మీరు చేసే పనుల వల్ల ఎక్కువ లాభాలు పొందే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపించొచ్చు. పరిహారం : ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి. ధనస్సు రాశి వారికి బుధాదిత్య యోగం ప్రభావంతో అనేక రంగాల్లో అదృష్టం కలిసొచ్చే అవకాశం ఉంది. గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించడంతో మీరు చేసే పనుల్లో ప్రత్యేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించొచ్చు. మీరు చేసే పనుల్లో మెరుగైన ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి మంచి అవకాశాన్ని పొందుతారు. పరిహారం : ఈరోజు శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో దానధర్మాలు చేయాలి. మకర రాశి వారికి ఈరోజు విష్ణుమూర్తి అనుగ్రహం, బుధాదిత్య యోగం ప్రభావంతో విశేష ఫలితాలు రానున్నాయి. మీరు చేసే ప్రయాణం వల్ల విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ కష్టానికి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొనేందుకు మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. పరిహారం : ఈరోజు గణేష్ మంత్రాలను పఠించాలి. కుంభ రాశి వారికి ఈరోజు శని దేవుడు, రాహువు ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో కొంత ఒత్తిడి పెరగొచ్చు. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు అన్ని విషయాలను పరిశీలించాలి. మరోవైపు మీ భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. పరిహారం : ఈరోజు గణేష్ చాలీసా పఠించాలి. మీన రాశి వారికి ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు దగ్గర లేదా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారులకు గొప్ప పురోగతి లభించొచ్చు. విద్యార్థులకు మానసిక, మేధోపరమైన భారాల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. సాయంత్రం మీరు కొంత విలువైన సమాచారాన్ని పొందొచ్చు. తల్లిదండ్రుల సలహాలు, ఆశీస్సులు సహాయపడతాయి. పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News




