చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించడం మంచిది. ఇవి చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తాయి.
© 2026 nimisham.in
చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించడం మంచిది. ఇవి చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కల్పిస్తాయి.
వేపాకుల్లో నింబిడిన్, అజాడిరాచ్తిన అనే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చుండ్రును తొలగించడంలో సహాయపడతాయి. దీనికోసం వేపాకులను పేస్ట్ చేసి తలకు రాసుకోండి. అరగంట ఆగి తలస్నానం చేయండి. అలాగే తలస్నానికి వేపాకులు మరిగించి నీళ్లు వాడితే మరీ మంచిది. మెంతుల్లోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనికోసం మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం పేస్ట్ చేయండి. దీనిని తలకు రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. చుండ్రును తొలగించేందుకు పెరుగు చాలా బాగా సహాయపడుతుంది. దీనికోసం పెరుగులో కొద్దిగా తేనె కలిపి తలకు రాసుకోండి. అరగంట తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. నిమ్మరసం, కొబ్బరి నూనెలోని పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయపడటమే కాకుండా చుండ్రును తొలగిస్తాయి. దీనికోసం కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి వేడి చేసి గోరువెచ్చగా ఉన్నపుడు తలకు రాసుకోండి. 20 నిమిషాలు ఉంచి తలస్నానం చేస్తే మంచిది. అలోవెరాలో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చుండ్రు, తలలో దురద తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం తాజా అలోవెరాను తలకు అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. చుండ్రును తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఆలివ్ ఆయిల్ వాడొచ్చు. దీికోసం ఆలివ్ ఆయిల్ వేడి చేసి గోరువెచ్చగా ఉన్నపుడు తలకు రాసి మర్దన చేయండి. గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. టీ ట్రీ ఆయిల్లోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను బయటపడేస్తాయి. దీనికోసం కొబ్బరి నూనెలో కొద్దిగా టీ ట్రీ ఆయిల్ కలిపి తలకు రాసుకోండి. గంట ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. త్రిఫలలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చుండ్రును ఈజీగా తొలగిస్తాయి. దీనికోసం నీళ్లలో త్రిఫల వేసి బాగా మరిగించి ఈ నీళ్లతో తలను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మంజిష్ట హెర్బల్ పేస్ట్ మార్కెట్లో లభిస్తుంది. దీనిని తలకు రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.




