
ఈ డిజిటల్ యుగంలో అమ్మాయిల ముందున్న అతిపెద్ద సమస్య ఫోన్. దాన్నుంచి బయటపడటానికీ, డిజిటల్ డీటాక్స్కీ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చినదే ఈ ‘మాంక్ మోడ్’ ఛాలెంజ్. ఈ డిజిటల్‌ యుగంలో అమ్మాయిల ముందున్న అతిపెద్ద సమస్య ఫోన్‌. దాన్నుంచి బయటపడటానికీ, డిజిటల్‌ డీటాక్స్‌కీ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చినదే ఈ ‘మాంక్‌ మోడ్‌’ ఛాలెంజ్‌. డిజిటల్‌ సైలెన్స్‌ని పాటించడం దీని ప్రధాన ఉద్దేశం. అంటే వారం రోజుల పాటు . ఏ రకమైన పోస్టులు, స్టేటస్‌లు పెట్టకూడదు. ఉదయం లేచిన వెంటనే ఫోన్‌ పట్టుకోకూడదు. అలానే, తొందరగా నిద్రపోవాలి, ఉదయాన్నే లేవాలి. జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, వీడియోగేమ్‌లకి చెక్‌ పెట్టేయాలి. ఉద్యోగం, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఫోన్‌ వినియోగం తగ్గించేయాలి. రోజుకు కనీసం 45-60 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి... ఇవన్నీ ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది అంటున్నారు నిపుణులు. ఏకాగ్రత పెరుగుతుంది, మీతో మీరు గడిపే సమయం ఎక్కువవుతుందని చెబుతున్నారు. పైగా, ప్రతికూల సమాచారానికి దూరంగా ఉంటారు. దీనివల్ల ఒత్తిడీ, ఆందోళనా తగ్గి మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. అంతేనా, స్వీయ నియంత్రణకు ఈ సవాలు మంచిదంటున్నారు. ఇప్పటికే ప్రయత్నించిన వాళ్లైతే దీన్ని కొనసాగించడానికీ ఇష్టపడుతున్నారట. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers This website follows the DNPA Code of Ethics . Privacy and cookie settings




