కంటిని ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు, మినరల్స్ గురించి ఇక్కడ వివరించాం. ఈ ఆహారాలు తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి.
విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ ఎ రేచీకటిని తగ్గించి, కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే కంటిలోని రక్తనాళాలు ఆరోగ్యంగా మారుతాయి. విటమిన్ సి ఫుడ్ తింటే కంటి శుక్లాల రిస్క్ తగ్గుతుంది. విటమిన్ ఇ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. విటమిన్ ఇ రిచ్ ఆహారాలు తినడం వల్ల వయసుతో పాటు వచ్చే మ్యాకులర్ డీ జెనరేటివ్ సమస్య తగ్గుతుంది. విటమిన్ బి2 దీన్ని రైబోప్లావిన్ అంటారు. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. విటమిన్ బి2 ఫుడ్ తంటే కంటి శుక్లాల రిస్క్ తగ్గుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల పొడి కన్నుల సమస్య తగ్గుతుంది. విటమిన్ బి1 ఉన్న ఆహారాలు తినడం వల్ల కంటి నరాల పనితీరు మెరుగుపడుతుంది. గ్లాకోమా రిస్క్ తగ్గుతుంది. కాలేయం నుంచి కంటికి విటమిన్ ఎ చేరడానికి జింక్ అవసరం. జింక్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. సెలీనియం అనేది విటమిన్ ఇతో కలిసి పని చేసి కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ అందిస్తుంది. ల్యూటిన్, జియాంక్సితిన్ అనేది రెటీనాలో ఉండే శక్తివంతమైన కెరోటినాయిడ్స్. ఇవి బ్లూ లైట్ నుంచి కళ్లను రక్షిస్తాయి. ల్యూటిన్, జియాంక్సితిన్ ఉన్న ఆహారాలు తింటే కంటి సమస్యలు తగ్గుతాయి.



