
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో అక్రమ లేఅవుట్లు జోరుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి 11 జిల్లాలకు విస్తరించింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ లేఅవుట్ వేయాలన్నా హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోవాలి.
© 2026 nimisham.in

హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధిలో అక్రమ లేఅవుట్లు జోరుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధి 11 జిల్లాలకు విస్తరించింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ లేఅవుట్ వేయాలన్నా హెచ్ఎండీఏ అనుమతులు తీసుకోవాలి.
హెచ్‌ఎండీఏ పరిధిలో యథేచ్ఛగా దందా రూ. కోట్ల ఆదాయానికి గండి శంషాబాద్‌ సమీపంలో వెలసిన అక్రమ లేఅవుట్లను ధ్వంసం చేస్తున్న సిబ్బంది ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో అక్రమ లేఅవుట్లు జోరుగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధి 11 జిల్లాలకు విస్తరించింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ లేఅవుట్‌ వేయాలన్నా హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకోవాలి. కానీ చాలా ప్రాంతాల్లో అనుమతి లేకుండానే లేఅవుట్లు వెలుస్తున్నాయి. జీవో 111లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఫాం ల్యాండ్‌ పేరుతో కుంటలుగా విభజించి విక్రయిస్తున్నారు. శంషాబాద్‌ ప్రాంతంలో ఓటుపల్లి, తొండపల్లి, శంకర్‌పల్లి, చిన్న గోల్కొండ, రాళ్లగూడ, పెద్దగోల్కొండ, సంఘీగూడ తదితర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. యాదాద్రి, ఘట్‌కేసర్, మేడ్చల్‌ ఇలా నగరానికి శివారు ప్రాంతాల్లో కొందరు ఐదు, పది ఎకరాల్లో ఈ అక్రమ లేఅవుట్లు వేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఇలాంటి వాటిపై హెచ్‌ఎండీఏ నిఘా పెట్టి చర్యలు తీసుకునేది. తర్వాత కాలంలో తగిన సిబ్బంది లేక పట్టించుకునే నాథుడే కరవయ్యారు. మరోవైపు అనుమతుల ద్వారా హెచ్‌ఎండీఏకు ఫీజుల రూపంలో సమకూరాల్సిన రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ లేఅవుట్లలో నోటీసులు జారీ చేయకుండానే నిర్మాణాలు, రోడ్లు కూల్చేసే అధికారం హెచ్‌ఎండీఏకు ఉంటుంది. ఇక్కడ నిర్మించే ఇళ్లకు విద్యుత్తు, తాగునీరు, ఇతర వసతులను కల్పించరు. ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ అయినా ఇంటి నిర్మాణానికి హెచ్‌ఎండీఏ లేదా స్థానిక పురపాలక సంఘం నుంచి అనుమతులు దొరకవు. ప్లాట్‌ కొనే ముందు హెచ్‌ఎండీఏ అధికారిక పోర్టల్‌లో సదరు లేఅవుట్‌ ప్లాన్‌ నంబరు ఉందో లేదో చూసుకోవాలి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.






