
మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని కవల్టెక్ ధంగర్వాడ గ్రామానికి చెందిన బడిలో పనిచేసే 55 ఏళ్ల ఉపాధ్యాయుడు జీవన్ మిథారి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన బడిలో చదువుతున్న ఒకే ఒక్క విద్యార్థి కోసం ప్రతిరోజూ 5 కిలో మీటర్లు అడవి దారిలో ట్రెక్కింగ్ చేస్తూ బడికి వెళ్తున్నారు. మారుమూల ప్రాంతంలో సరైన రోడ్లు, విద్యుత్ లేకపోయినా, క్రూర మృగాల భయం ఉన్నా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతున్నారు. బడిలో మూడో తరగతి చదువుతున్న స్వరా అనే పాప కోసం ఆయన చూపుతున్న ఈ అంకితభావం అందరినీ ఆకట్టుకుంటోంది.




