
మేదరమెట్ల: కొరిశపాడు మండలం ప్రాసంగులపాడు గ్రామంలో రూ.1.77 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భూదాతలను సత్కరించి, పీహెచ్‌సీని పరిశీలించారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అనంతరం రూ.30 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనం, రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, రూ.33.70 లక్షల జేజేఎం నిధులతో ఇంటింటికీ మంచినీటి కుళాయి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





