
చైనాలో సాంకేతిక అద్భుతంగా రూపొందిన G6 నాగ్చు-ల్హాసా ఎక్స్ప్రెస్వే ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. టిబెట్ ఎత్తైన పీఠభూమిపై నిర్మించిన ఈ హైవే సముద్ర మట్టానికి సుమారు 4,500 మీటర్ల (14,800 అడుగులు) ఎత్తులో ఉంది. G6 నాగ్చు-ల్హాసా హైవే నాగ్చు మరియు ల్హాసా మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించింది. ఒకప్పుడు 6 గంటల సమయం పట్టే ప్రయాణం, ఇప్పుడు కేవలం 3 గంటలకే పూర్తవుతుంది. తీవ్రమైన చలి కారణంగా పాత రోడ్లు మంచుతో మూసుకుపోయేవి. కానీ, ఈ కొత్త ఎక్స్ప్రెస్వే ఏడాది పొడవునా రవాణాను సులభతరం చేస్తుంది.





