
మక్తల్ పట్టణం: మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌ పట్టణంలోని మూడో వార్డులో రూ.2.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నూతన బీటీ రోడ్డు కం బ్రిడ్జి పనులను మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, రోడ్లు, డ్రైనేజీలు, బ్రిడ్జిల వంటి అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. మక్తల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరాయంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాకిటి మానస హనుమంతు,పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ పట్టణం: పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 229 మంది లబ్ధిదారులకు రూ.88.97 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఖరీదైన వైద్య చికిత్సల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





