
టీటీడీకి రిలయన్స్ సంస్థ భారీ విరాళాన్ని అందించింది. రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సుల్లో తొలి విడతగా 15 బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. మరో 10 బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పాటు 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ను కూడా రిలయన్స్ అందించనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 16న సీఎం చంద్రబాబు ఈ బస్సులను ప్రారంభించనున్నారు.
Found this helpful?
Share this story with your network
