
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గణేశుడు వర్షాలను కూడా వెంటబెట్టుకొచ్చాడన్నట్లుగా ఆకాశానికి చిల్లుపడినట్లు వానలు దంచి కొడుతున్నాయి. ఈ అకాల వర్షాలు కొన్ని చోట్ల ఎండిపోతున్న పత్తి, వరి పంటలకు ఊరటనిచ్చాయి. అయితే, మరికొన్ని ప్రాంతాల్లో నగరాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా, వినాయక చవితి వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెలంగాణలోని మహబూబాబాద్‌లో అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో నాన్‌స్టాప్ వర్షానికి రోడ్లు నదులను తలపించడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమీర్‌పేట్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాలకు పిడుగుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో పిడుగుపాటుకు నలుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు! తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది? బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే! వైభవ్ లాంటి ఒక్క బ్యాటర్‌నైనా తయారు చేశారా? పాకిస్థాన్‌కు వసీం అక్రమ్ చురకలు వలలో చిక్కిన 23 కేజీల “పండుగప్ప”.. వేలంలో కళ్లుచెదిరే రేటు!