
Apprenitce | ఐటీఐ చదివినవారికి కొచ్చిన్ షిప్‌యార్డ్ అవకాశం కల్పించింది. పలు విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలు అందిస్తున్నాం.
© 2026 nimisham.in

Apprenitce | ఐటీఐ చదివినవారికి కొచ్చిన్ షిప్‌యార్డ్ అవకాశం కల్పించింది. పలు విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివరాలు అందిస్తున్నాం.
Apprenitce | కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) 210 అప్రెంటిస్షిప్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐటీఐ ట్రేడ్, టెక్నీషియన్, ఒకేషనల్ అప్రెంటిస్ ఖాళీలను పలు విభాగాల్లో నింపనుంది. అర్హులు, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సంస్థ షెడ్యూల్ ఎ కేటగిరీ-1 మినీరత్న కంపెనీ. ఖాళీల వివరాలు ఎలక్రీషియన్- 31 ఫిట్టర్- 23 వెల్డర్- 31 మెషినిస్ట్- 5 ఎలక్ట్రానిక్ మెకానిక్- 9 ఇన్స్ట్రుమెంట్ మెకానిక్- 8 డ్రాఫ్ట్స్‌మ్యాన్ (Mech)- 4 డ్రాఫ్ట్స్‌మ్యాన్ (Civil)- 2 పెయింటర్ (General, Marine)- 5 మెకానిక్ మోటార్ వెహికల్- 7 షీట్‌మెటల్ వర్కర్- 23 వుడ్‌వర్క్ టెక్నీషియన్/కార్పెంటర్- 12 మెకానికల్ డీజిల్- 7 పైప్ ఫిట్టర్/ప్లంబర్- 23 రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ కండిషనింగ్- 1 మెరీన్ ఫిట్టర్- 14 అర్హతలు పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (VHSE)లో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు కనీసం 18 ఏండ్లు నిండి ఉండాలి. శారీరక ప్రమాణాలు అప్రెంటిసెస్ యాక్ట్-1961, అప్రెంటిస్‌షిప్ రూల్స్-1992 ప్రకారం ఉండాలి. ఎంపిక షార్ట్‌లిస్టింగ్ చేసి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి స్టైపెండ్ నెలకు రూ. 11,000 ఇస్తారు. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 8. ఇతర వివరాలకు www.cochinshipyard.in, https://apprenticeshipindia.gov.inలలో చూడండి.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.





