
కన్నడ దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌కు భారత ప్రభుత్వం అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ఆయన ఈ గౌరవప్రదమైన పురస్కారాన్ని అందుకోనున్నారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించిన అనంత్ నాగ్.. 'KGF', 'భీష్మ', చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 2025లో పద్మభూషణ్ అందుకున్న ఆయనకు ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





