
ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశం మెచ్చిన అందాల పోటీలు, టాప్ 20లో చోటు.. సాధారణంగా ఎవరైనా ఈ స్థాయిలో సక్సెస్ సాధిస్తే మోడలింగ్ లేదా సినిమా రంగం వైపు అడుగులు వేస్తారు. కానీ ఆమె మాత్రం పోటీలు ముగిసిన కొద్ది రోజులకే మళ్లీ ఫార్మల్స్ ధరించి, ల్యాప్‌టాప్ పట్టుకుని ఆఫీస్‌కు వెళ్లారు. ఇటీవల జైపుర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా (Miss Universe India Finale) పోటీల్లో 52 మంది ఫైనలిస్టులతో పోటీపడి.. మధ్యప్రదేశ్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఉమంగా కమావత్‌ (Umanga Kumawat) టాప్20లో స్థానం దక్కించుకున్నారు. ఆ వెలుగుల ప్రపంచం నుంచి బయటకు రాగానే ఆమె మళ్లీ ఉద్యోగంలో చేరారు. బెంగళూరులోని తన ఆఫీసులో విధులకు హాజరయ్యారు. ఆమె ప్రస్తుతం గూగుల్ క్లౌడ్ ఇంజినీర్‌(Google Cloud Engineer)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్లామర్‌ను కేవలం ఒక అభిరుచిగానే ఉంచుకుంటూ.. తన కెరీర్‌నే ప్రాధాన్యతగా ఎంచుకున్న ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రాం వేదికగా పంచుకున్న వీడియా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో ఉదయం లేచినప్పటి నుంచి.. రాత్రి పడుకునే వరకూ తన ప్రయాణం ఎలా సాగుతుందో వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





