
బి.డెస్‌లో ప్రవేశానికి నమోదు ప్రక్రియ ప్రారంభం
దేశంలోని ప్రముఖ డిజైన్ విద్యా సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (nid) 2027-28 విద్యా సంవత్సరానికి బి.డెస్కు మరియు 5.5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎమ్.డెస్కు

దేశంలోని ప్రముఖ డిజైన్ విద్యా సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (nid) 2027-28 విద్యా సంవత్సరానికి బి.డెస్కు మరియు 5.5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎమ్.డెస్కు

post office franchise: India Post offers franchise outlets with low ₹5,000 security deposit. Earn commissions on postal services like speed post, registered articles and money orders. Ideal for small entrepreneurs. ఇండియా పోస్ట్ ఫ్రాంచైజీ పథకంలో రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్‌తో సొంత పోస్టల్ సేవల కేంద్రం ప్రారంభించవచ్చు. కమిషన్ ఆధారంగా మంచి ఆదాయం సాధ్యం.

India vs Afghanistan, India opt to bowl in the 1st T20I against Afghanistan. Vaibhav Sooryavanshi missed out on the Playing 11, while star pacer Jasprit Bumrah made a comeback. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే తొలి టీ20లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేశాడు.

మంత్రి పదవి నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సురేఖను తొలగించకపోతే తాను తప్పుకొంటానని అధిష్ఠానాన్ని రేవంత్ బెదిరించారని ఆమె వ్యాఖ్యానించారు. లోక్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకముందే.. తన బర్తరఫ్‌ను ఆమె ధ్రువీకరించారు. ఈ సందర్భంగా టీవీ9తో మాట్లాడిన సురేఖ పలు కీలక విషయాలను వెల్లడించారు.తనను తొలగించే ముందు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తన వివరణ కూడా తీసుకోలేదని, రాజీనామా చేయాలని కూడా ఎవరూ చెప్పలేదన్నారు. అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. తనతో మాట్లాడి వివరణ తీసుకుని ఉండాల్సిందని అన్నారు.తనపై వేం నరేందర్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి కుట్ర చేశారని సురేఖ ఆరోపించారు. అయితే తదుపరి కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తాను తప్పు చేశాననే భావన లేదన్నారు.తన కుమార్తె కొండా సుస్మిత మాట్లాడిన మాటలను పొంగులేటి సుధాకర్‌రెడ్డి రాజకీయంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. సుస్మిత స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, ఆమె అభిప్రాయాలను తాము ఖండించాల్సిన అవసరం లేదన్నారు. ఆమెతో తాము మాట్లాడించలేదని స్పష్టం చేశారు.రేవంత్‌రెడ్డిని చాలామంది విమర్శిస్తున్నా.. తన విషయంలోనే ఎందుకు ఇంత తీవ్రంగా స్పందించారో సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని సురేఖ అన్నారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకున్నవారిలో తామే ముందున్నామని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత తాను ఎక్కువగా అభిమానించింది రేవంత్‌రెడ్డినేనని చెప్పారు.ప్రస్తుతం పార్టీ మారే ఆలోచన

పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన కేసులో గుంటూరు జిల్లా పోలీసుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడిన ధర్మాసనం, "గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, మూడు నెలలు గడిచినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో, ఆయన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. గతంలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను పోలీస్ స్టేషన్‌కు రాకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తూ, ఇలాంటి పోలీసులు ఉండటం ప్రభుత్వానికే సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేసింది.కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పనిచేయడం లేదని పేర్కొన్న కోర్టు, గురువారం నాటికల్లా బాలికను తమ ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పోలీసులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) సీరియస్ అయింది. బాలిక మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో పదో తరగతి విద్యార్థిని ఆచూకీ గుర్తించలేకపోయారంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏముందని అభిప్రాయపడింది. ఏదైమైనా గుంటూరు జిల్లా పోలీసులు చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. పోలీస్‌స్టేషన్‌కి రాకుండా ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్‌ను అడ్డుకున్నారని హైకోర్టు చురకలంటించింది. ఇలాంటి పోలీసులు ఉండటం ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఘాటుగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన కుమార్తె ట్యూషన్‌కు వెళ్లి కనిపించకుండా పోయిందని జూన్‌లో పట్టాభిపురం పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మూడు నెలలు అవుతున్న తన కుమార్తె ఆచూకీ గుర్తించడంలో పోలీసులు విఫలం అయ్యారని హైకోర్టులో ఆమె తండ్రి హెబీయస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై ఈరోజు (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు సరైన స్ఫూర్తితో వ్యవహరిస్తే.. బాలికను కనుగొనేందుకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించింది. రేపటి లోగా బాలికను కోర్టు ముందు హాజరుపరచాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించింది. పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్ ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తుక్కుగూడ నర్సుకేసును సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. హైదరాబాద్, సెప్టెంబర్02: ఇటీవలే తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ నర్సు హత్య కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై ఏడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు గల కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని జాతీయ మహిళా కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆమె సూచించారు. నిందితుడి పూర్వ నేరచరిత్రపై ఆరా తీయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిందితుడిపై తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. శంషాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసులో నిందితులకు విజయవాడ కోర్టు లో చుక్కెదురైంది. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు జంగం నాని, బాబూరావుతో పాటుగా సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న నాగరాజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. వీరంతా తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది.మరోవైపు సాయికృష్ణ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది. ఐజీపీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం నాగరాజు, ముగ్గురు పోలీస్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా వేర్వేరు జైళ్లల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.అయితే ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. లాకప్ డెత్ లాంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న నేపథ్యంలో.. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు దర్యాప్తు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని భావించిన కోర్టు.. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిందితులు
హైదరాబాద్ కంటోన్మెంట్లో ఆర్మీ ఆయుధాలు చోరీ.. తుపాకులు ఎత్తికెళ్లిన దొంగలు హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. ఆయుధాలు భద్రపరిచే రూం తాళం పగులగొట్టి 12 ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆర్మీ ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలోకి బయటి వ్యక్తుల ప్రవేశం పరిమితంగా ఉండటంతో లోపలి వ్యక్తుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజిగిరి పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

విజయవాడ గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. విజయవాడ: గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో అరెస్టయిన నలుగురు పోలీసు అధికారుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 సీఐ నాగరాజు, A3 హెడ్ కానిస్టేబుల్ జంగం నాని, A5 హెడ్ కానిస్టేబుల్ బాబురావు, A6 సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు సంబంధించిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం A1 సీఐ నాగరాజు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. A3 జంగం నాని ఏలూరు సబ్ జైలులో, A5 బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, A6 సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ మంజూరు చేయాలని నలుగురు నిందితులు కోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం వారి పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీంతో నలుగురూ ప్రస్తుతం జైల్లోనే కొనసాగనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తదుపరి విచారణపై ఉత్కంఠ నెలకొంది. గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడొద్దు: ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి

టర్కీలోని ఇస్తాంబుల్ తీరం మార్మరా సముద్రంలో ఘోర నౌకా ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో టర్కీ పతాకంతో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక నౌకకు చెందిన 10 మంది సిబ్బందితో సంబంధాలు తెగిపోవడంతో వారి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు:నౌకల వివరాలు: కొకేలీ నుంచి అలియాగా వెళ్తున్న 'అల్సు' (Alsu) అనే కెమికల్ ట్యాంకర్, ఇస్కెందరున్ ఓడరేవు నుంచి కరాడెనిజ్ ఎరెగ్లీ వైపు వెళ్తున్న 'తుగ్బర్క్ ఇమామోగ్లు' (Tugberk Imamoglu) అనే బల్క్ క్యారియర్ నౌకలు సిలివ్రి తీరానికి 18 నాటికల్ మైళ్ల దూరంలో ఢీకొన్నాయి.కనిపించకుండా పోయిన సిబ్బంది: ప్రమాదం జరిగిన అనంతరం 'అల్సు' నౌకకు ఎటువంటి తీవ్ర నష్టం జరగనప్పటికీ, 'తుగ్బర్క్ ఇమామోగ్లు' నౌకతో పాటు అందులోని 10 మంది సిబ్బంది ఆచూకీ పూర్తిగా లభ్యం కాకుండా పోయింది. అధికారులు వారి మొబైల్ ఫోన్లకు కాల్స్ చేసినా ఎలాంటి సమాధానం రాలేదు.మునిగిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సముద్ర ఉపరితలంపై నౌకకు చెందిన లైఫ్-సేవింగ్ జాకెట్లు, పరికరాలు కొట్టుకొచ్చినట్లు గుర్తించారు. ప్రమాద స్థలి వద్దకు 14 రెస్క్యూ నౌకలు, కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లను పంపి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Nepal Floods: నేపాల్‌లో సృష్టించిన వరదల వల్ల ఆ దేశం చెప్పుకోలంతగా అల్లకల్లోలమైంది. నేపాల్‌లో సంభవించిన వరదలు ఆ దేశాన్ని కోలుకోలేకుండా చేశాయి. వరదల ధాటికి ఊర్లకు ఊర్లకు కొట్టుకుపోయాయి. మరోవైపు పెద్ద పెద్ద భవనాలు సైతం పేక మేడల్లా కళ్ల ముందు కూలి పోయాయి. అప్పటి వరకు హాయిగా సంతోషంగా ఉన్న వారి జీవితాలు ఒక్కసారిగా తల్లకిందులు అయ్యాయి. ఇంట్లో చెట్టుకొరకు.. పుట్టకొకరు అన్నట్టు తయారైంది పరిస్థితి. కొంత మంది కుటుంబ సభ్యులను కోల్పోయి ఎందుకు బతికున్నామా అంటూ రోదిస్తున్న సన్నివేశాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తాజాగా నేపాల్ పోలీసులు వెల్లడంచిన సమాచారం ప్రకారం.. రసువాలో 45, నువాకోట్‌లో 155, ధాడింగ్‌లో 59, చిత్వాన్‌లో 348, గోర్ఖాలో 66, తనహున్లో 38, తూర్పు నవల్పరాసిలో 217 మరియు పశ్చిమ నవల్పరాసిలో 190 మృతదేహాలను వెలికితీశారు. ఆయా మృతదేహాల నుంచి డీఎన్ఏ శాంపిల్ సేకరించి వాటి ఫోటోలను తీసి భద్రపరుస్తున్నారు. ఆ తర్వాత కళ్లిన మృతదేహాలను దహనం కాకుండా సామూహికంగా ఖననం చేస్తున్నారు. భారత్‌లో కూడా తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు నేపాల్ పోలీసులు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాలలో కేవలం 95 మందిని మాత్రమే గుర్తించి, వారి ఫ్యామిలీస్‌కు అప్పగించడం జరిగింది. వరదల్లో మృతి చెందిన వారి మృతదేహాలను (గుర్తింపు లభించని వారితో సహా) చట్టపరంగా , శాస్త్రీయ పద్ధతుల ద్వారా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అంతకుముందు తన సామాజిక మాధ్యమాల్లో

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మిస్‌వరల్డ్ అందాల పోటీల గ్రాండ్ ఫినాలో సెప్టెంబర్ 5, 2026న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల భామ ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్పైనే అందరి ఆశాలు, ఆకాంక్షలు. ఈ బ్యూటీ కేవలం అందగత్తె మాత్రం కాదు తనలో నటి కూడా ఉందంటూ వెండితెరపై మెరిసింది కూడా. ఆమె సంజీవ్ సింగ్ పర్మార్ నిర్మించి, దర్శకత్వం వహించిన బ్రిజ్ భాషా చలనచిత్రం 'చంబల్ పార్'లో నటించింది. నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా సందర్భంగా అరాలూయెన్ సెంటర్లో ఈ చిత్రం ప్రీమియర్ ప్రదర్శన జరుపుకుంది. ఇది త్వరలో భారత్‌లో కూడా విడుదలకానుంది. అందాల పోటీల్లో పాల్గొనేవారు కేవలం గ్లామర్‌కే పరిమితం కాదని, అభినయంలో కూడా సత్తా చాటగలరని చూపించడమే తన ధ్యేయమని అంటోంది నికితా. ఆ విషయంలో తనకు ప్రియాంక చోప్రా ఆదర్శం అని చెబుతోంది. ఎందుకుంటే ఆమె బరేలి నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎలాంటి గాడ్‌ఫాదర్స్ అండ దండ లేకుండా అంచలంచెలుగా ఎదిగి తనదైన ముద్ర వేసిందని అన్నారామె. ఇక నికితా కూడా త్వరలో కన్నడ చిత్రసీమలో అరంగేట్రం చేయనున్నారు. అంతేగాదు ఆమెకు కథలు చెప్పడంలో కూడా మంచి నైపుణ్యం ఉంది. ఆమె ఇటీవలే కృష్ణ లీల' అనే పేరుతో 250 పేజీల రచన చేసినట్లు సమాచారం ఇక మిస్ ఇండియా ఆర్గనైజేషన్ సైతం నికితాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. ఫెమినా మిస్ ఇండియా వేదిక నుంచి అత్యున్నత ప్రపంచ వేదిక వరకు నికితాపోర్వాల్ తన మిస్ వరల్డ్ ప్రయాణంలో ప్రతి అడుగులో భారతదేశ స్ఫూర్తిని, బలాన్ని, కథను ముందుకు తీసుకువెళ్లారు. ఈ 75వ మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ వేదికపై లక్షలాది ఆశలు, ఆశీస్సులు, అభినందనలను స్వదేశం నుంచి వియత్నాం వరకు ఆమెతోపాటు వస్తాయని పేర్కొంది. కాగా నిఖితా పోర్వాల్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి

మన భూగోళంపై ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో మండిపోతున్నాయి. ఇన్నాళ్లూ మనం అనుకున్న ప్రమాద ఘంటికలు దాదాపు దగ్గరపడ్డాయి. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే భూమి సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి (యుఎన్ఈపీ) సరికొత్త నివేదిక ద్వారా అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. పారిస్ ఒప్పందం పెట్టుకున్న లక్ష్యం దాటిపోతుండటం ఖాయమని తేలిన నేపథ్యంలో.. ఇకపై ఉష్ణోగ్రతల పెంపుదల వ్యవధిని ఎంత తగ్గించగలమనే దానిపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని పిలుపునిచ్చింది. లక్ష్యం దాటినా సరే.. ధైర్యం కోల్పోకుండా ఉష్ణోగ్రతలను మళ్లీ తగ్గించే దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు దాటిపోయే కాలాన్ని వీలైనంత తక్కువగా, చిన్నదిగా మార్చడమే ఇప్పుడు మన ముందున్న ఏకైక మార్గమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తేల్చిచెప్పారు. ఈ వేసవిలో నమోదైన దారుణమైన ఎండలు, భయంకరంగా వ్యాపించిన అడవుల కార్చిచ్చు, ఆకస్మిక వరదలే భవిష్యత్తులో భూమి ఎంత దారుణంగా మారబోతోందో చెప్పే నమూనా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 1.5 డిగ్రీలు దాటడమంటే ప్రపంచం అక్కడితో అంతమైపోతుందని కాదని, అయితే ప్రతి అర డిగ్రీ పెరుగుదల మానవాళిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐరాస స్పష్టం చేసింది.వాతావరణంలో ముంచుకొస్తున్న విపత్తులుఒకవేళ ఉష్ణోగ్రత పెరుగుదల 1.8 డిగ్రీలకు చేరుకుంటే మాత్రం కోలుకోలేని నష్టాలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తుపానులు, కరువులు తీవ్రతరం కావడం, ఆహారం-తాగునీటి కొరత ఏర్పడటం, మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరగడం వంటివి తీర ప్రాంత ప్రజలను శరణార్థులుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచంలో అత్యంత వినాశకరమైన రీతిలో అమెజాన్ అడవులు దెబ్బతినడం, సముద్ర ప్రవాహాలు మారిపోవడం వంటి సంచలన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.విశ్వంలో మరో రెండు కొత్త గ్రహాలు.. శాస్త్రవేత్తల మైండ్ బ్లాకింగ్ న్యూస్!బొగ్గు, పెట్రోల్ వినియోగానికి చెక్.. కార్బన్ నిర్మూలన తప్పనిసరి!భూమి ఉష్ణోగ్రతను మళ్లీ సాధారణ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tummidihatti: ప్రాణహిత నదిపై ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి సహకరించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కోరింది తెలంగాణ సర్కార్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య తొలివిడత చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ చైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షత వహించగా.. తెలంగాణ తరపున నీటిపారుదల సలహాదారు ఆదిత్యనాధ్ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, మహారాష్ట్ర నుంచి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అయితే సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో జరిగిన తొలి విడత చర్చలు అర్థవంతంగా ముగిసాయని తెలంగాణ అధికారులు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత, చేవేళ్ల సుజల స్రవంత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ 148 మీటర్ల ఎత్తులో మాత్రమే బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. అయితే ఈ ఎఫ్ఆర్ఎల్ ఉత్తర తెలంగాణ నీటి అవసరాలకు సరిపోదని సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఒక లేఖ రాసింది. అదే సమయంలోప్రధానమంత్రి మోదీకి, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసిని తెలంగాణ ప్రభుత్వం.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో.. ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీకి సంబంధించి కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో.. తెలంగాణ 152 మీటర్ల పూర్తి వరద మట్టం (FRL)తో తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదనపైనే విస్త్రుతంగా చర్చ జరిగింది. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ వల్ల మహారాష్ట్రలో మునిగిపోయే ప్రాంతాలు, ప్రాణహిత

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్‌పై తాజా దాడులకు దిగింది. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన లక్ష్యాలపై విరుచుకుపడింది. ఒమన్ గల్ఫ్‌లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడమే దీనికి కారణం. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్.. ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికాకు చెందిన బేస్ క్యాంప్ లపై బాంబుల వర్షాన్ని కురిపించింది.ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు చల్లారినట్టే కనిపించిన ఈ యుద్ధం.. మళ్లీ మొదటికొచ్చినట్టయింది. మున్ముందు మరింత తీవ్రంగా దాడులు చేపడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించడం.. అక్కడి తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. ఈ దాడులను అటు అమెరికా, ఇటు ఇరాన్.. ఆత్మరక్షణలో భాగమని చెప్పుకొన్నాయి.ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనిపై తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్ పెట్టింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ సైనికులపైనా ఐఆర్జీసీ దాడుల ప్రయత్నాలకు ప్రతీకారానికి దిగామని తెలిపింది.ఇకపై తిరుమలలో ఎయిర్ పోర్ట్ తరహా స్మార్ట్ లగేజీ సిస్టమ్: జీఎంఆర్ ఎంట్రీఇరాన్లోని ఖేష్మ్ ఐలాండ్, జాస్క్, సిరిక్ రీజియన్, జిరోఫ్ట్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. అంతే ఘాటుగా స్పందించింది. తన భూభాగం నుంచి అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీన్ని ధృవీకరించింది. జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామని ప్రకటించింది.బంగారం ధరల పతనానికి సడన్ బ్రేక్- షార్ప్ రీబౌండ్అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్క్యూ-4

మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: మంగళవారం రాత్రి అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. ఇందుకు సంబంధించి ఇరాన్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇరాక్, జోర్డాన్‌పై ఇరాన్ ప్రత్యేక సైనిక దళం ఐఆర్జీసీ దాడి చేసింది. కువైత్, బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి. సిరిక్ ప్రాంతంలో అమెరికా దాడి వల్ల ఓ పెళ్లింట విషాదం సంభవించిందని ఇరాన్ మీడియా పేర్కొంది. ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందారని, 50 మంది గాయపడ్డారని తెలిపింది. తమపై దాడులకు తెగబడుతున్న అమెరికా చివరకు పశ్చాత్తాపం చెందక తప్పదని ఇరాన్ సైనిక దళం ఐఆర్జీసీ హెచ్చరించింది. హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకలపై ఇరాన్ దాడి చేసే ప్రయత్నం చేయడంతోనే తాము దాడులు చేయాల్సి వచ్చిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకూ దాడులు కొనసాగాయని పేర్కొంది. ఇక తమ భూభాగం వైపు వస్తున్న 13 బాలిస్టిక్ మిసైల్స్‌ను మార్గమధ్యంలోనే ధ్వంసం చేశామని జోర్డాన్ మిలిటరీ పేర్కొంది. మరో మూడు మిసైల్స్ నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోయాయని తెలిపింది. ఇరాన్ దాడుల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పింది. బుధవారం ఉదయం ఇరాన్ ప్రయోగించిన పలు మిసైల్స్‌ను అడ్డుకున్నామని మరో ప్రకటనలో కువైట్ తెలిపింది. బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలిసింది. అమెరికా దాడుల్లో చిన్నారి మరణించినట్టు ఇరాన్ మీడియాలో వార్తలు రావడంపై యూఎస్ సెంట్కామ్ ప్రతినిధి స్పందించారు. ఇరాన్ దళాల లాగా తాము సామాన్య పౌరులను ఏనాడు టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. 2027 సెప్టెంబర్‌కు వందశాతం అక్షరాస్యత లక్ష్యమని ఉద్ఘాటించారు. ఏడాదిలో 25 లక్షల మంది అక్షరాస్యులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఏపీని అభినందించిందని అన్నారు. రాష్ట్ర అక్షరాస్యత 72.6శాతం నుంచి 82.1శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. 2027 మార్చిలో మరో 25 లక్షలు.. సెప్టెంబర్‌కు మరో 27 లక్షల మందికి అక్షరాస్యత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూళ్లలో చేర్చాలి.. 11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అక్షరాస్యత ఉద్యమం కొనసాగుతోందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూల్లో చేర్పించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఇంకా 1,64,821 మంది బడిబయట పిల్లలు ఉన్నారని.. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ ఏడాది 33 వేల మంది బడిబయట పిల్లలను స్కూల్లో విద్యాశాఖ చేర్చిందని వివరించారు. లీప్ యాప్ ద్వారా మిగిలిన పిల్లల వివరాలు ప్రధానోపాధ్యాయులకు అందించాలని నిర్ణయించామని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు 98.97శాతం.. విద్యార్థుల హాజరు 85.41శాతం ఉందని వివరించారు. మూడు రోజులు వరుసగా గైర్హాజరైతే తల్లిదండ్రులను

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana SIR: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు సాగిన సర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ, ఫిర్యాదులు తదితర అంశాలపై ప్రకటన విడుదల చేసింది. సర్‌కు సంబంధించి ప్రత్యేక ప్రచారం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను 17.08.2026న ఆయా ఈఆర్ఓ కార్యాలయాల్లో ప్రచురించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాతో పాటు ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాలను సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ( అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ముఖ్య వివరాలు, గడువులు క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు: ఆగస్టు 17 నుంచి ఈనెల 16వ తేదీ వరకు నోటీసుల జారీ, పరిష్కారం: 17.08.2026 నుండి 15.10.2026 వరకు ప్రత్యేక ప్రచార (స్పెషల్ క్యాంపెయిన్) తేదీలు - మొదటి విడత: ఈనెల 5 నుంచి 6వ తేదీ వరకు - రెండో విడత: ఈనెల 12వ తేదీ నుంచి 13 వరకు ప్రస్తుత పురోగతి మొత్తం 92,88,112 నోటీసులు రూపొందించగా 31,74,952 నోటీసులు అందాయి. 1,94,737 నోటీసులపై విచారణ పూర్తయింది. మిగిలిన నోటీసులను 119 మంది ఈఆర్ఓలు, 1,973 మంది ఏఈఆర్ఓల ద్వారా గడువులోగా విచారించనున్నారు. మొత్తం క్లెయిమ్‌లు, అభ్యంతరాలు: 9,07,292 - ఫారం-6 (కొత్త ఓటరు): 3,94,517 - ఫారం-6ఏ (ప్రవాస భారతీయులు): 6,346 - ఫారం-7 (పేర్ల తొలగింపు): 48,752

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువును రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెంచింది. ఈ నెల 10 వరకు సర్ గడువు ఉంటుందని తెలిపింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు పరస్పరం డ్రోన్లు, మిసైల్స్ తో దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. డ్రోన్లు, మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. సెప్టెంబర్ 1 న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక భారతీయుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా దాడులు చేపట్టిందని అన్నారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇక ఆగస్టు 31 సోమవారం కూడా ఉక్రెయిన్ లోని ఒడెసా నగరంపై రష్యా దాడులు చేసింది. ఏరియల్ బాంబ్స్, డ్రోన్ లతో విరుచుకుపడింది. దాంతో నగరంలోని వేలాది కుటుంబాలు విద్యుత్ లేకుండా అంధకారంలోనే గడిపాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. ఇక తాజాగా జరిగిన దాడిలో 12 మంది మృతి చెందారని.. వారిలో ఒకరు భారతీయుడని అన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన కీవ్, ఒడేసా, ఖేర్సన్, డొనెట్స్క్, జపోరిజియా, ఖార్కివ్, చెర్నిహివ్, జైటోమిర్, సుమీ అలాగే డినిప్రోలపై రష్యా చేపట్టిన దాడుల్లో డజన్ల కొద్దీ తీవ్రంగా గాయపడినట్లు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. కీవ్ నగరంలోని రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అలాగే ఈ దాడులకు బోరీస్పిల్ ప్రాంతంలోని ఐదంతుస్తుల భవనం కుప్పకూలింది. నలుగురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. ఇక 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం అని అధికారులు తెలిపారు. కీవ్ నగరంలో 350 మందితో కూడిన రెస్క్యూ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని అన్నారు

శామీర్‌పేట, సెప్టెంబర్ 1 : ఆర్టీసీ ట్రాన్స్‌స్పోర్ట్ అకాడమీ ఐటీఐలో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ అపర్ణ కళ్యాణి మంగళవారం ప్రకటనలో కోరారు. టీజీఎస్ ఆర్టీసీ హకీంపేంట ట్రాన్స్‌స్పోర్ట్ అకాడమీ ఐటీఐలో డీజిల్ మెకానిక్(1 సంవత్సరం), మోటాల్ మెకానిక్(2 సంవత్సరాలు) కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7 దరఖాస్తులకు చివరి తేది అని పూర్తి వివరాల కోసం 9391072283 నెంబర్‌కు సంప్రదించాలని సూచించారు. Beetroot Supplements | మార్కెట్లో అందుబాటులో ఉన్న బీట్ రూట్ సప్లిమెంట్లు.. ఇవి శరీరానికి ఏ మేర మేలు చేస్తాయి, వీటిని తీసుకోవ్చా..? BCCI | బుమ్రా వచ్చేశాడు.. మళ్లీ భారత టీ20 స్క్వాడ్‌లో ఆ ముగ్గరు..! ENE Repeat | గెట్ రెడీ ఫర్ సీక్వెల్.. తరుణ్ భాస్కర్ ENE Repeat టీం క్రేజీ వీడియో

నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఘోర విపత్తు నేపథ్యంలో, ఇస్రో-నాసా సంయుక్తంగా రూపొందించిన 'నైసర్' ఉపగ్రహం పనితీరుపై వచ్చిన విమర్శలు నిరాధారమని తేలింది. విపత్తును ముందుగా హెచ్చరించడంలో ఈ శక్తిమంతమైన శాటిలైట్ విఫలమైందన్న ఆరోపణలను తాజా విశ్లేషణలు పటాపంచలు చేశాయి. విపత్తు సంభవించడానికి కొన్ని వారాల ముందే నైసర్ స్పష్టమైన హెచ్చరిక సంకేతాలను పంపిందని వెల్లడైంది.చైనాలోని చాంగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థి జెన్షియాంగ్ లియు, నైసర్ చిత్రాలను విశ్లేషించి ఈ కీలక విషయాలను వెల్లడించాడు. విపత్తు సంభవించడానికి కొన్ని వారాల ముందే ప్రమాదకర ప్రాంతంలోని పర్వత వాలులో భారీ మార్పులు చోటుచేసుకున్నట్లు అతడు గుర్తించాడు. అక్కడి మంచు, రాతి పొరలు తీవ్ర ఒత్తిడికి గురై, ఆ ప్రాంతం ఏకంగా కొన్ని మీటర్ల మేర పక్కకు జరిగినట్లు తేలింది. ఈ కదలికలు ఒకేచోట కేంద్రీకృతం కావడం, రాబోయే కొండచరియల విపత్తుకు స్పష్టమైన సంకేతమని లియు తన విశ్లేషణలో పేర్కొన్నాడు.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సంయుక్తంగా ఈ 'నైసర్' (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. ప్రకృతి వైపరీత్యాలను ముందే గుర్తించి, హెచ్చరికలు జారీ చేసే లక్ష్యంతో దీన్ని గత ఏడాదే ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన భూ పరిశీలన ఉపగ్రహాల్లో ఒకటి. మేఘాలు, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పగలు, రాత్రి తేడా లేకుండా స్పష్టమైన చిత్రాలను తీయగల రెండు సింథటిక్ అపెర్చర్ రాడార్లను (ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్) కలిగి ఉన్న తొలి శాటిలైట్ ఇదే.ఈ వివరాల

తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. న్యూఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల మధ్య సమావేశం ముగిసింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా బ్యారేజీ ఎత్తు, సాంకేతిక అంశాలు, అంతర్రాష్ట్ర సమస్యలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమీక్షించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్లకు పెంచేలా ఆ రాష్ట్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించినట్లు తెలిసింది. బ్యారేజీ ఎత్తు పెంపుతో తెలంగాణకు కలిగే ప్రయోజనాలను అధికారులు మహారాష్ట్ర దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. 152 మీటర్ల ప్రతిపాదనకు అంగీకారం కుదరని పరిస్థితుల్లో కనీసం 150 మీటర్ల ఎత్తుకైనా అంగీకరించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. తెలంగాణ ప్రతిపాదనలను ఆ రాష్ట్ర అధికారులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు తదుపరి దశలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తదుపరి భేటీలో బ్యారేజీ ఎత్తుపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట ఎంపీ ల్యాడ్స్ నిధులపై అసత్య ప్రచారం చేయొద్దు: బండి సంజయ్

తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. లోతుకుంట భూవివాదం, కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి జారీ చేసిన కఠిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ సంచలన స్టే విధించింది. సెప్టెంబర్ 1న వెలువడిన ఈ ఉత్తర్వులతో రంగనాథ్ ప్రస్తుతానికి తన పదవిలో కొనసాగే అవకాశం స్పష్టంగా ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటివరకు సింగిల్ బెంచ్ ఆదేశాలను అమలు చేయకపోగా, ఇప్పుడు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేతో ఆయన స్థానం మరింత పటిష్టంగా మారింది. ఈ వివాదం మెదక్-మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటలోని 40 ఎకరాల భూమి చుట్టూ ప్రారంభమైంది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ క్లెయిమ్ చేస్తున్న ఈ స్థలంలోకి హైడ్రా అధికారులు వెళ్లి తాత్కాలిక నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కంపెనీ, కోర్టు ఇచ్చిన అండర్‌టేకింగ్‌ను అధికారులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంటెంప్ట్ పిటిషన్లు దాఖలు చేసింది. గతంలో వివాదాస్పద స్థలానికి రక్షణగా సైన్యాన్ని కూడా కాపలాగా ఉంచే స్థాయికి ఈ గొడవ చేరింది. దీంతో జూలై 27న విచారణ చేపట్టిన జస్టిస్ అనిల్ కుమార్ జుకంటి సింగిల్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగనాథ్‌పై ఏడాదిన్నర వ్యవధిలో 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆయన సమర్పించిన క్షమాపణ అఫిడవిట్ సంతృప్తికరంగా లేదంటూ, సీఎస్ వెంటనే రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించి వేరొకరిని నియమించాలని సంచలన ఆదేశాలు ఇచ్చింది. అయితే, తాము పిటిషనర్ భూమిలోకి వెళ్లలేదని, ప్రభుత్వ స్థలాన్నే రక్షిస్తున్నామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఫలితంగా ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు పూర్తి స్థాయిలో బహిరంగ మద్దతుగా నిలిచారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా చట్టబద్ధంగానే పనిచేస్తోందని, కోర్టులను గౌరవిస్తూనే కబ్జాదారులపై పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు
హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తొలగించి.. సమర్థుడైన అధికారిని నియమించాలంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన కేసులో విచారణ సందర్భంగా.. ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని.. మరో అధికారిని నియమించాలంటూ ఉత్తర్వులను.. ఆయన డివిజన్ బెంచ్ ముందు తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో తదుపరి విచారణ పూర్తయ్యే వరకు రంగనాథ్ హైడ్రా కమిషనర్‌గా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రంగనాథ్ అప్పీల్ దాఖలు చేశారు. ఆయన తరఫున హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్ శక్దర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించి ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ భూమిలో హైడ్రా చేపట్టిన కూల్చివేతలను సవాల్ చేస్తూ శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించిన పిటిషన్ విచారణ సందర్భంగా సింగిల్ బెంచ్ రంగనాథ్ వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ కీలక ఆదేశాలు జారీచేసింది.కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించే అధికారి చట్టబద్ధ పాలనకు ఇబ్బందులు కలిగించేఅవకాశం ఉందని సింగిల్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. ఆ కేసు విచారణ సందర్భంగా రంగనాథ్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల సంఖ్యపైనా సింగిల్ బెంచ్ ప్రస్తావించింది. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వేలాది కోర్టు ధిక్కరణ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను సవరించేందుకు కొత్త పే కమిషన్లు ఏర్పాటవుతుంటాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ పే కమిషన్‌కు, రాబోతున్న 8వ పే కమిషన్‌కు మధ్య ప్రధాన తేడాలు ఏమిటి? ఫిట్మెంట్ ఫ్యాక్టర్, కనీస వేతనం, డీఏ, , ఇంటి అద్దె భత్యం, పింఛన్ విధానాలలో ఎలాంటి మార్పులు రానున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 7వ పే కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, అది 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. కమిషన్ 21 నెలల్లో తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఇక 8వ పే కమిషన్‌ను 2025 నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికంగా ఏర్పాటు చేశారు. 8వ పే కమిషన్ ఏర్పాటైన తేదీ నుంచి 18 నెలల్లోగా, అంటే 2027 మే నాటికి తన తుది రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. 7వ పే కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ నాయకత్వం వహించారు. 8వ పే కమిషన్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. 7వ పే కమిషన్ అమలుకు రెఫరెన్స్ తేదీగా 2016 జనవరి 1ని నిర్ణయించారు. అదేవిధంగా, 8వ పే కమిషన్ ద్వారా జరిగే జీతాల సవరణకు కూడా రెఫరెన్స్ తేదీగా 2026 జనవరి 1ని నిర్ణయించారు. జీతాల పెంపును నిర్ణయించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. 7వ పే కమిషన్‌లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. 8వ పే కమిషన్‌లో ఇది ఇంకా ఖరారు కాలేదు. అయితే నిపుణుల అంచనాల ప్రకారం ఇది 1.92 నుంచి 2.86 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2.28 నుంచి 2.46 వరకు ఉండే అవకాశం ఉంది. 7వ పే కమిషన్‌లో కనీస బేసిక్ పే రూ.7,000 నుంచి రూ.18,000కు పెరిగింది. 8వ పే కమిషన్‌లో ఖరారయ్యే ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను
Nepal Floods Missing Indians 2026 : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో చెలరేగిన వినాశకర ప్రళయం అంతులేని శోకాన్ని మిగుల్చింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వెయ్యి దాటగా.. 4,471 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన వారిలో కైలాస మానససరోవర యాత్రకు వెళ్లిన 275 మంది భారత పౌరులతో పాటు మరొక 128 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. రోజురోజుకూ నదుల్లో మృతదేహాలు కొట్టుకొస్తుండటంతో నేపాల్ శవాగారాలన్నీ నిండిపోయి, మృతదేహాలను భద్రపరచడం, గుర్తించడం అధికారులకు అత్యంత సంక్లిష్టంగా మారింది. గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేపాల్ ప్రభుత్వం బాధితుల వివరాలతో పవర్ పాయింట్ స్లైడ్షోలను కూడా సిద్ధం చేసింది.మృతదేహాల అప్పగింతకు 9 అంచెల ప్రక్రియ..ఈ విపత్కర పరిస్థితిలో మృతుల కుటుంబాలకు సహాయం అందించేందుకు ఖాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. నేపాల్ ప్రభుత్వం వెబ్సైట్లో విడుదల చేస్తున్న ఫోటోలు, వివరాల ద్వారా మృతదేహాలను గుర్తించిన పక్షంలో.. భౌతికకాయాలను స్వదేశానికి తరలించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తామని ఎంబసీ తెలిపింది. దీనికోసం నేపాల్ ప్రభుత్వం రూపొందించిన 9 అంచెల నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మృతదేహ అవశేషాల డాక్యుమెంటేషన్, లభ్యమైన ఫోటోలు, వివరాలను నమోదు చేయాలి. అలాగే పోస్టుమార్టం నిర్వహణ, మరణానికి గల కారణాల నిర్ధారణ, అధికారికంగా వ్యక్తి గుర్తింపు, వేలిముద్రలు, డీఎన్ఏ, ఫోరెన్సిక్ శాంపిళ్ల సేకరణ, మృతుడి పాస్‌పోర్ట్ లేదా ఐడీ వెరిఫికేషన్, ఎంబసీ లేదా కాన్సులర్ సమన్వయ ప్రక్రియ పూర్తి, హ్యాండోవర్ మెమో, రసీదుల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.అయితే వీటిని గుర్తించడానికి బాధితుల మొదటి శ్రేణి బంధువుల డీఎన్ఏ పోలిక తప్పనిసరి. బంధువులు తమ డిఎన్ఏ ప్రొఫైళ్లను dnacodis@nepalpolice.gov.np కి ఇమెయిల్ చేయవచ్చని లేదా నేరుగా రక్త నమూనాలను అందించవచ్చని సూచించారు. భారత ఎంబసీ సాయం కోసం కూడా ఈ వివరాలను eoikathmandufloodsupport@gmail.com కి కాపీ

హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేశారు. తనను కమిషనర్ బాధ్యతల నుంచి బదిలీ చేయాలన్న సూచనతో పాటు తీర్పులో చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన అప్పీల్లో ప్రస్తావించినట్లు సమాచారం.వివాదాస్పద ఆస్తి విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైడ్రా కమిషనర్ ఉల్లంఘించారని సింగిల్ జడ్జి ధర్మాసనం అభిప్రాయపడింది. యంత్రాలు, సిబ్బందితో సదరు భూమిలోకి వెళ్లడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. పరిపాలనలో చట్టపరమైన చర్యలకు మాత్రమే ప్రాధాన్యం ఉండాలని స్పష్టం చేసింది.ఒకే భూవివాదానికి సంబంధించి మూడుసార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. హైడ్రాపై 60కి పైగా పిటిషన్లు పెండింగ్‌లో ఉండటాన్ని కూడా ప్రస్తావించింది.సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘టాటా మోహన్‌రావు’ కేసు తీర్పును సింగిల్ జడ్జి ప్రస్తావించారు. శిక్షించడం కంటే క్షమించడంలోనే ఔన్నత్యం ఉందన్న భావనను గుర్తుచేశారు. ఈ కేసులో రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ విచారణను ముగించారు. అదే సమయంలో ఆయనను కమిషనర్ బాధ్యతల నుంచి బదిలీ చేసి మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.ఈ తీర్పు వెలువడి నెల రోజులు గడిచిన తర్వాత రంగనాథ్ అప్పీల్‌కు వెళ్లారు. బదిలీ సూచనతో పాటు సింగిల్ జడ్జి చేసిన వ్యాఖ్యలపై న్యాయపరమైన అంశాలను ఆయన లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఈ అప్పీల్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Eshwar Sai Missing: ఫోక్ డాన్సర్ 'భాసింగ బలాలు' ఫేమ్ ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని తోటి కళాకారిణి మాధురి రాథోడ్ ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆయన పరారయ్యారు. వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి, మాధురి కలిసి ఉండగా, భార్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఆయన తప్పించుకున్నారు. అతని కోసం పోలీసులు రెండు బృందాలుగా గాలిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అతని ఆచూకీ కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తును వేగవంతం చేశారు. గత నెల 22న మాధురి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తనపై, తన కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేశారని పేర్కొన్నారు. అప్పటి నుండి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు సమాచారం. మాధురి, ఈశ్వర్ సాయికి చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే, వేములవాడలోని ఒక హోటల్లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య, వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రేమ పేరుతో తనను వంచించి మోసం చేశారని మాధురి ఫిర్యాదు చేశారు. దీంతో నార్సింగి పోలీసులు సెక్షన్ 69 BNS ప్రకారం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, హోటల్ నుండి పరారైన ఈశ్వర్ సాయి ఇప్పటి వరకు ఎవరికీ అందుబాటులో లేడని పోలీసులు చెబుతున్నారు. ఈశ్వర్ సాయిని వెంటనే

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Nepal Floods update: నేపాల్ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు 903 మంది ప్రాణాలు కోల్పోగా....2,500 మందికిపైగా గల్లంతయ్యారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. వారిలో దాదాపు 500 మంది విదేశీయులున్నారు. ఈ వరదల్లో కొన్ని గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అధికార లెక్కల్లోని దాదాపు 25 వేల నుంచి 30 మంది చనిపోయినట్టు అనధికార సమాచారం. ముఖ్యంగా హిమాలయాల్లోని హిమానీనదం శిథిలాలు, బండరాళ్లతో చైనా-నేపాల్ సరిహద్దులో ఏర్పడిన సరస్సు కారణంగా ఇంకా వరద ముప్పు పొంచే ఉంది. దాని వల్ల బోటెకోషి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఈ వరద ముప్పుపై చైనా ఇస్తోన్న సమాచారం ఆధారంగా దిగువ ప్రాంత ప్రజలను నేపాల్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. కొట్టుకుపోయిన బ్రిడ్జి.. వరద హెచ్చరికల మెసేజ్‌లతో దిగువ ప్రాంత ప్రజల ఫోన్లు దద్దరిల్లాయి. ఇప్పటికే ఆత్మీయులను కోల్పోయి, నిలువనీడలేకుండా మిగిలిన వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఈ అలర్ట్స్ మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు, త్రిశూలీ నదికి దాదాపు మూడు గంటల పాటు వరద పోటెత్తడంతో 130 మీటర్ల పొడవైన ఘ్యాల్చౌక్-చరౌడీ సస్పెన్షన్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. త్రిశూైలి -3ఏ జల విద్యుత్ ప్రాజెక్ట్‌లో చిక్కుకుపోయిన కార్మికులు,.. వరద ప్రభావిత నువాకోట్‌లోని ఎగువ త్రిశూలి–3ఏ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నేపాల్ సైనిక ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాసువా, నువాకోట్ జిల్లాల్లోని తొమ్మిది జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 537 మంది కార్మికులు

Vaibhav Sooryavanshi Misses Youngest Century Record: భారత దేశవాళీ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచీ తన ఆటతో ఆకట్టుకుంటున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి దులీప్ ట్రోఫీ 2024లో చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి శతకం సాధించే అవకాశాన్ని ఈ చిచ్చరపిడుగు మరోసారి త్రుటిలో చేజార్చుకున్నాడు. ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నీ దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరపున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటై తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడటంతో, 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఈ మ్యాచ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణ. బెంగళూరు వేదికగా ఆదివారం సెంట్రల్ జోన్‌తో మొదలైన ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈస్ట్ జోన్‌కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ అదరిపోయే ఆరంభం ఇచ్చారు. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదే జోరును కొనసాగిస్తూ, తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీకి చేరువయ్యాడు. అభిమానులందరూ అతడు శతకం పూర్తి చేయాలని ఆతృతగా ఎదురుచూస్తుండగా, 92 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హర్ష్ దుబే బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతి గాల్లోకి లేవగా, డీప్ మిడ్ వికెట్ వద్ద
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు, విశ్లేషణలు, స్పెషల్ స్టోరీలు రాస్తున్నారు. సినిమాల గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. సోషల్ మీడియా పోస్టులను ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. రాజశేఖర్ జేఎన్టీయూ-హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ-ప్యాక్ నుంచి ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ పొందారు. తుపాకీ న్యూస్, ఏబీపీ దేశం, ఇండియా హెరాల్డ్ డాట్ కామ్ లాంటి మీడియా సంస్థల్లో సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు. 2019 ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

Rajahmundry: రివర్‌ఫ్రంట్‌లో మహనీయుల విగ్రహాల తొలగింపు లేదు రాజమండ్రి: గోదావరి గట్టున నిర్మాణ దశలో ఉన్న రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనుల నేపథ్యంలో అక్కడ ఉన్న వివిధ మహనీయుల విగ్రహాల విషయంలో ఎలాంటి అపోహలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు. విగ్రహాల నిర్వాహకులు, సంబంధిత ప్రతినిధులతో నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వారు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి పనులతో ప్రస్తుతం ఉన్న విగ్రహాలకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, అధికారులు హామీ ఇచ్చారు. ప్రాజెక్టు తుది రూపకల్పనలో భాగంగా విగ్రహాలను తొలగించడం కాదని, అవసరమైన చోట యూనిఫామ్ రీలోకేషన్, సమాన దూరం, ఒకే అలైన్మెంట్, సమానమైన ప్లాట్‌ఫామ్ డిజైన్‌తో క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం మాత్రమే ఉద్దేశమని వివరించారు. రివర్ఫ్రంట్లోకి ప్రవేశించే వారు, నడిచే ప్రజలు, బయట నుంచి చూసే సందర్శకులు అందరికీ విగ్రహాలు ఒకే తరహా డిజైన్‌లో కనిపించేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని విగ్రహాలు ఒకే లైన్లో ఉండగా, మరికొన్ని విభిన్న ప్రదేశాల్లో లేదా ఎత్తుపల్లాల్లో ఉండటంతో మొత్తం రివర్‌ఫ్రంట్ అందం, సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. అందువల్ల సిమెట్రికల్ డిజైన్, సమాన విరామాలు, యూనిఫామ్ అలైన్మెంట్ ద్వారా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ఆలోచనను నిర్వాహకుల ముందుంచారు. విగ్రహాల రూపం, పేర్లు, గుర్తింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే, కమిషనర్ స్పష్టం చేశారు. ఒక్క పేరు కూడా తప్పిపోకుండా, ఎలాంటి పొరపాటు జరగకుండా ప్రతి విగ్రహానికి సంబంధించిన వివరాలను నిర్వాహకుల సమక్షంలోనే పరిశీలించి, వారి ఆమోదం అనంతరం తుది రూపకల్పనలో పొందుపరుస్తామని తెలిపారు. మహనీయుల పేర్లు, విగ్రహాల గుర్తింపు విషయంలో ఎలాంటి చిన్న తప్పిదానికీ అవకాశం ఇవ్వబోమని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని విగ్రహాలకు సాధ్యమైనంత వరకు ఒకే

బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు సెప్టెంబర్ 30 వరకు సమయం పెంపు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు అత్యంత కీలకం BC Dedicated Commission: ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక-ఆర్థిక పరిస్థితులపై కీలక అధ్యయనం చేస్తున్న బీసీ డెడికేటెడ్ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కమిషన్ (BC Dedicated Commission)పరిమితి గడువును పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగింపు ద్వారా కమిషన్ తన సమగ్ర విచారణను, నివేదిక తయారీ ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు మరింత సమయం లభించినట్లయింది. Cheyutha Pension: ‘చేయూత పెన్షన్ల’ లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్.. దరఖాస్తు గడువు పెంపు రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయనం: బీసీ సంక్షేమ శాఖ ఈ గడువు పెంపునకు సంబంధించి అధికారికంగా 'జీవో ఎంఎస్ నంబర్ -11'ను విడుదల చేసింది. నూతన ఉత్తర్వుల ప్రకారం కమిషన్ కాలపరిమితిని ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో కొనసాగుతున్న ఈ కమిషన్, రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతో పాటు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లలో బీసీల ప్రాతినిధ్యంపై క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం జరుపుతోంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లకు ఈ నివేదికే కీలకం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం, సమగ్ర రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఈ కమిషన్ అందించే సిఫార్సులే అత్యంత కీలకం కానున్నాయి. వివిధ ప్రాంతాల్లో సేకరించిన సమాచారం, రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా కమిషన్ సమర్పించే నివేదికను బట్టే ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన, రాజకీయ నిర్ణయాలు తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకున్న గడువు పొడిగింపు నిర్ణయం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది

హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్లో ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన నేపథ్యంలో 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్ శనివారం ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటినీ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తామని హెచ్చరించారు.కేవలం 50 గజాల స్వల్ప విస్తీర్ణంలో నిబంధనలకు విరుద్ధంగా ఏడంతస్తుల భవనాన్ని నిర్మించడమే కాకుండా, దానిపై అదనంగా పెంట్‌హౌస్‌ను కూడా నిర్మించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బిల్డర్ సాజిద్ నిర్మించే భవనాలన్నీ అత్యంత నాసిరకంగా ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నట్లు కమిషనర్ ఈ సందర్భంగా వెల్లడించారు.అంజయ్య నగర్ ప్రాంతంలో ఇటువంటి అక్రమ నిర్మాణాలు అనేకం ఉన్నాయని, కనీసం సెట్బ్యాక్లు కూడా పాటించకుండా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారని రంగనాథ్ పేర్కొన్నారు. నాలాలను ఆక్రమించి ఇష్టారాజ్యంగా కట్టడాలు చేపట్టారని, వీటిలో అధిక శాతం ప్రస్తుతం హాస్టళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న ఆయా భవనాలను యజమానులు వెంటనే ఖాళీ చేయాలని ఆయన ఆదేశించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన అన్ని భవనాలను కూల్చివేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోపల తాను స్వయంగా పండించిన తాజా ఆకుకూరలను కోసి, తోటి వ్యోమగామి జెస్సికా మీర్‌తో కలిసి రుచికరమైన వంటకం తయారు చేసుకున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడు మరియు ఇతర సుదూర గ్రహాలపైకి చేపట్టే దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో తాజా ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయాలో ఈ ప్రయోగం ద్వారా నిరూపించారు. నాసాకు చెందిన ‘వెజ్జీ’ ప్లాంట్ గ్రోత్ చాంబర్లో ఈ కూరగాయలను దాదాపు నెల రోజుల పాటు శ్రమించి సాగుచేశారు. ఈ ప్రయోగంలో కేల్, వసాబి ఆవాల ఆకుకూరలను సేకరించి పరీక్షించినట్లు మీనన్ తెలిపారు. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తికి మొక్కలు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పంటల పెంపకంలో మార్గనిర్దేశం చేసిన నాసా వెజ్జీ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ది మార్షియన్’లో అంగారక గ్రహంపై బంగాళాదుంపలు పండించే మార్క్ వాట్నీ పాత్రను గుర్తుచేస్తూ, ఈ ప్రయోగాన్ని చూసి ఆయన కూడా ఎంతో గర్వపడతారని చమత్కరించారు. ఈ తరహా పరిశోధనలు కేవలం వ్యోమగాములకు పౌష్టికాహారాన్ని, మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా, భవిష్యత్తులో భూమి నుండి అంతరిక్షానికి రవాణా చేయాల్సిన ఆహార భారాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తాయి. రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వెన్నులో వణుకే! యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం! LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త! లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్! అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
హైదరాబాద్ గచ్చిబౌలిలోనిఅంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు చాలా ఉన్నాయన్న రంగనాథ్.. నిబంధనలు పాటించకుండా నిర్మించిన భవనాలు, నాలాను ఆక్రమించి కట్టిన వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు . శనివారం కుప్పకూలిన ఏడు అంతస్తుల భవనాన్ని.. సాజిద్ అనే బిల్డర్ కట్టినట్లు రంగనాథ్ తెలిపారు. సాజిద్ కట్టిన భవనాలు అన్నీ ఇదే తరహాలో ఉంటున్నట్లు స్థానికులు చెప్తున్నారని.. కొద్దిరోజుల్లో వాటిని కూల్చేస్తామని తెలిపారు.50 గజాల స్థలంలో ఏడు అంతస్తుల భవనం నిర్మించడమే కాకుండా పైన పెంట్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నారని రంగనాథ్ తెలిపారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు ఇంకా ఉన్నాయని.. చాలావాటికి సెట్బ్యాక్లు లేవని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని కూల్చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు అంజయ్య నగర్‌లోని భవనాలు హాస్టల్స్ కోసం ఉపయోగిస్తున్నారన్న రంగనాథ్.. వాటిని ఖాళీ చేయాలని యజమానులకు సూచించారు. నాలాను ఆక్రమించి భవనాలు కట్టారని.. అంజయ్య నగర్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.మరోవైపు గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేశ్ కారే (34), మోపత్ (42) అనే ఇద్దరు టైల్స్ కార్మికులు చనిపోయారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కూలిన భవనం శిథిలాలు పక్కనే ఉన్న మరో అపార్ట్‌మెంట్‌పై పడ్డాయి. దీంతో అపార్టుమెంటులో నివశిస్తున్న ఇద్దరు వృద్ధులకు గాయాలయ్యాయి. అపార్ట్మెంట్ గోడలు కూడా ధ్వంసమయ్యాయి. భవనం నిర్మించిన సాజిద్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.మరోవైపు సాజిద్ బిల్డింగులు అన్నింటిని పరిశీలిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన స్పష్టం

రుద్రంపూర్, ఆగస్టు 22 : సింగరేణి కాలరీస్ సంస్థలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్ల అమలు, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలపై జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్‌సిటీలోని ట్రైడెంట్ హోటల్లో కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ అధ్యక్షతన సింగరేణి ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసోసియేషన్ ప్రతినిధులు కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులపై పక్షపాత వైఖరితో ఛార్జ్షీట్లు, సస్పెన్షన్లు, కంపల్సరీ రిటైర్మెంట్లు వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. విజిలెన్స్ విచారణల సమయంలో వేధింపులు, ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించుకుంటున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలోని పాఠశాలలు, ఉమెన్స్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్హాక్, తాత్కాలిక బోధన, బోధనేతర పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఉన్నప్పటికీ మూడేళ్లుగా ఎనిమిది సర్వేయర్ బ్యాక్లాగ్ పోస్టులతో పాటు హిందీ పండిట్ పోస్టులను భర్తీ చేయలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ (పా) ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని ప్రతినిధులు కోరారు. ఉద్యోగుల సమస్యలు, ప్రమోషన్లకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతినిధులు.. సింగరేణి యాజమాన్యంతో చర్చించి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ I కమిటీ వైస్ ప్రెసిడెంట్ బడికల కృష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ దామెర ప్రవీణ్ కుమార్, కేంద్ర కార్యదర్శి మామిడిపల్లి మధు కృష్ణ, ఎస్ టి పి పి వైస్ ప్రెసిడెంట్ పులి సురేష్ పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం తరఫున సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్ , డైరెక్టర్ (పా)

కర్ణాటక కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ అదృశ్యం కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖలో ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఆగస్టు 20 నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. కుటుంబ సభ్యులు, తోటి అధికారులు ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.గంగ్వార్ ఢిల్లీ వెళ్లేందుకు విమాన టికెట్ బుక్ చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన చివరిసారిగా గుర్తించినట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి పోలీసు ఫిర్యాదు అందలేదు.ఈ ఘటనపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ, సదరు ఐఏఎస్ అధికారి ఆచూకీ లభించడం లేదన్న సమాచారం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ధ్రువీకరించారు. ఆయనతో అన్ని రకాల కమ్యూనికేషన్లు నిలిచిపోయాయని, విమానాశ్రయం నుంచి అందిన ఆధారాలను బట్టి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.జ్ఞానేంద్ర కుమార్ 2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్సీ) పరీక్షల కంట్రోలర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కేపీఎస్సీలో ఆయన పనిచేసిన కాలంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలే ఆయన అదృశ్యానికి కారణమని కొన్ని మీడియా కథనాలు వెలువడుతున్నప్పటికీ, అధికారులు మాత్రం ఈ వార్తలను ఇంకా ధ్రువీకరించలేదు

ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధించాలన్న యూఎస్సీఐఆర్ఎఫ్ తీరును భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయతా లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై ఆంక్షలు విధించాలన్న అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్(USCIRF)ను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ సంస్థ పక్షపాతంతో కూడుకున్నదని, దానికి ఎలాంటి విశ్వసనీయతా లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. అది నిర్దిష్ట ఎజెండాతో ప్రచారం చేసే సంస్థ అని, దాని వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరంలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. 'యూఎస్సీఐఆర్ఎఫ్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది. ఇలాంటి సంస్థలకు మనం దూరంగా ఉండాలి. వీటికి విశ్వసనీయత ఉండదు, సొంత ఎజెండాలు మాత్రమే ఉంటాయి. ఆ సంస్థ భారత బహుళ వ్యవస్థ వాస్తవికతను స్వీకరిస్తుందని గానీ, దాని విభిన్న వర్గాల సామరస్య సహజీవనాన్ని గుర్తిస్తుందని గానీ మేం ఆశించడం లేదు' అని జైస్వాల్ పేర్కొన్నారు. యూఎస్సీఐఆర్ఎఫ్ ప్యానెల్ ఛైర్మన్ ఆసిఫ్ మహమూద్ ఇటీవల ఆర్ఎస్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సభ్యులపై ఆంక్షలు విధించాలని, అందులోని నాయకులకు ఎలాంటి దౌత్యపరమైన మర్యాదలు, హై-లెవెల్ సమావేశాలకు అనుమతి ఇవ్వకూడదని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ నెల 29న అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ సభ్యుడని, ఆ సంస్థ ఓ గొడుగు కింద పనిచేస్తోందని విమర్శించారు. దాని అనుబంధ సంస్థలు మైనారిటీలపై దాడి చేస్తున్నాయని కూడా ఆయన ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ తిప్పికొట్టింది. మోహన్ భాగవత్ విదేశీ పర్యటనల నేపథ్యంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదంది. భారత్‌లో మత స్వేచ్ఛపై తప్పుడు నివేదికలు ఇవ్వడానికి బదులుగా, అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ప్రవాస భారతీయుల భద్రతపై దృష్టి సారించాలని మరోసారి

భారత్, పాక్ దేశాల మధ్య మరోసారి దౌత్యపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ ప్రాంగణంలోని కొన్ని నిర్మాణాలను పాకిస్థాన్ అధికారులు అన్యాయంగా ధ్వంసం చేశారు. ఇలాంటి చర్యలు చేపట్టవద్దని భారత్ ముందుగానే విజ్ఞప్తి చేసినప్పటికీ.. పాక్ దానిని పట్టించుకోలేదు. దీనికి ప్రతీకారంగా ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ బయట వీధిలో నిర్మించిన కొన్ని తాత్కాలిక నిర్మాణాలను భారత అధికారులు తొలగించారు. ఈ చర్యపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. తాము సమానమైన రీతిలోనే సమాధానం ఇచ్చామని.. ఎంత మేర నష్టం జరిగిందో అంతకు తగ్గట్టే బదులిచ్చామని ఆయన స్పష్టం చేశారు.భారత్‌కు రానున్న బంగ్లా ప్రధాని?.. షేక్ హసీనా అంశంపై బిగ్ ట్విస్ట్!భారత్ కౌంటర్ పాకిస్థాన్ చర్యకు తగిన రీతిలోనే భారత్ జవాబుగా బదులిచ్చిందని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయం బయట ఉన్న అక్రమ తాత్కాలిక నిర్మాణాలను తొలగించడం అత్యవసరమైన చర్య అంటూ ఆయన వివరించారు. ఇరు దేశాల దౌత్య కార్యాలయాల విషయంలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడం ఇది మొదటిసారేమీ కాదు. దౌత్య నిబంధనలను ఉల్లంఘిస్తే అంతే తీవ్రంగా బదులిస్తామని భారత్ ఈ చర్య ద్వారా స్పష్టమైన సందేశాన్ని పంపింది.యెమెన్ తీరంలో నావికా సంక్షోభంయెమెన్ తీరంలో సముద్రపు దొంగలు(పైరేట్స్) హైజాక్ చేసిన రెండు నౌకల ఉదంతంపై కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ రెండు నౌకల్లో మొత్తం 22 మంది భారతీయ నావికులు ఉన్నారని.. ఒక నౌకలో 16 మంది, మరో నౌకలో 6 మంది భారతీయులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ 22 మంది నావికులూ క్షేమంగానే ఉన్నారని రణధీర్ జైస్వాల్ తెలిపారు. నావికుల రక్షణ, సంక్షేమం కోసం సంబంధిత అంతర్జాతీయ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు.అప్పటిదాకా భారత్ ఎంత మాత్రమూ సురక్షితం కాదు: తేల్చి చెప్పిన అమిత్ షా నావికుల రక్షణకు ముమ్మర యత్నాలు యెమన్, సోమాలియా మధ్య ఉన్న

ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. యూకే, అమెరికా పర్యటనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంతకాలం క్రితమే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అయితే రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు అనుమతి లభించగా.. అమెరికా పర్యటనకు మాత్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు. అమెరికాలో పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం కార్యాలయం షెడ్యూల్ రూపొందించింది. ప్రముఖ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు, తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుపై చర్చలు జరపాలని ప్రభుత్వం భావించింది. చివరికి అనుమతి రాకపోవడంతో సీఎం అమెరికా వెళ్లే కార్యక్రమం రద్దయింది. అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటనను రాజకీయ కోణంలో అడ్డుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడం, రాష్ట్ర యువతకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం తన పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. విద్య, నైపుణ్యాలు, శిక్షణ రంగాల్లో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తన విదేశీ పర్యటన ద్వారా తెలంగాణతో పాటు దేశానికీ ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయినప్పటికీ అధికారుల బృందాన్ని మాత్రం అమెరికాకు పంపాలని సీఎం నిర్ణయించారు. ముందుగా రూపొందించిన కార్యక్రమాలను కొనసాగించాలని, ప్రతిపాదిత ఒప్పందాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలపై చర్చలు జరపాలని సూచించారు. తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందేలా ఎంవోయూలు కుదుర్చుకోవాలని ఆదేశించారు

ఉద్యోగుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ కమిషనరేట్ పరిధిలో వందల్లో పోస్టుల ఖాళీ పోలీసుల కొలువుల సాధనకు సన్నద్ధమవుతున్న యువత బెల్లంపల్లి(మంచిర్యాల): పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా తాజాగా ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం వేల సంఖ్యలో ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. పలువురు కోచింగ్ సెంటర్లకు వెళ్తుండడంతో సందడి మొదలైంది. కమిషనరేట్ పరిధిలో వందల పోస్టులు ఖాళీలు... కమిషనరేట్ పరిధిలో వందల సంఖ్యలో పోలీసు కొ లువులు ఖాళీ ఉన్నాయి. జిల్లాలో ప్రతి సంవత్సరం పో లీసు ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. స్థానికత(లోకల్ కేడర్) ప్రకారం ఖాళీల వివరాలను సంబంధిత శాఖలు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుకు ఇప్పటికే పంపించినట్లు అధికారులు ప్రకటిం చారు దీంతో స్థానిక కేడర్ ఆధారంగా పోస్టుల పంపిణీ జరుగనున్న నేపథ్యంలో జిల్లాకు కూడ గణనీయమైన పోస్టులు వచ్చే అవకాశం ఉందని నిరుద్యోగులు భావిస్తు న్నారు. జిల్లాలో ప్రతి నియామకంలో పోలీసు ఉద్యోగాలకు వేలాది మంది పోటీ పడుతుంటారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మొత్తం 1875 మంది పోలీసులకు గాను 1334 మంది విధులు నిర్వహి స్తున్నారు. 541 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సివిల్ కానిస్టేబుల్స్‌కు సంబంధించి 1325 పోస్టులకు గా ను 819 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 506 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఏఆర్ కానిస్టే బుళ్లు 563కు గాను 485 మంది విధులు నిర్వహిస్తు న్నా రు. 78 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరుగుపందెం, పరీక్షలో నెగ్గితేనే... పోలీసు ఉద్యోగం సాధించాలంటే పరుగుపందెంతో పాటు పరీక్షలో సైతం ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. పురుషులైతే రన్నింగ్ 1600మీటర్లు(7.15నిమిషాల్లోపు), లాంగ్‌జంప్ నాలుగుమీటర్లు, షాట్‌ఫుట్ 6మీటర్లు, మ హిళలు పరుగుపందెంలో 800 మీటర్లు (5.20నిమి షాలు), లాంగ్‌జంప్ 2.5మీటర్లు, షాట్‌ఫుట్ 4 మీటర్ల

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలిసే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు. స్పోర్ట్స్ డెస్క్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి 'ముత్యాలమ్మ' (IND-AP-E8-MO-135) బోటులో ఆగస్టు 3న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఒడిశాలోని పారాదీప్ తీరం వద్ద ఒక పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చే వరకు అన్ని మార్గాల్లోనూ సెర్చ్ ఆపరేషన్ ఆపే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ గాలింపు చర్యల కోసం ఏకంగా 5 నౌకలు, 2 డోర్నియర్ విమానాలు, ఒక ప్రత్యేక హెలికాప్టర్‌ను రంగంలోకి దించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన బోటు వివరాలను మయన్మార్, పోర్ట్‌బ్లెయిర్, బంగ్లాదేశ్ కోస్ట్‌గార్డ్ అధికారులకు కూడా పంపించామని, సరిహద్దు తీరప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులతో ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ నెల 24 తర్వాత కొత్త అధికారి బాధ్యతలు చేపట్టినప్పటికీ గాలింపు చర్యలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం వారి రక్షణకు అన్ని విధాలుగా కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు.. అమరావతిలో SBI సిబ్బంది నివాస గృహ సముదాయానికి కీలక ముందడుగు
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం బిగ్ షాక్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రం షాకిచ్చింది. రేవంత్ అమెరికా పర్యటనకి అనుమతులు నిరాకరిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.ఈనెల 20 నుంచి 29 వరకు బ్రిటన్, అమెరికా దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎంఓ కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్ర విదేశాంగ శాఖ లండన్ పర్యటనకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో సీఎం రేవంత్ లండన్ చేరుకున్నారు. ఆదివారం లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్ వెళ్లాల్సి ఉండగా.. చివరి నిమిషం వరకు కేంద్రం నుంచి అనుమతులు రాకపోగా, తాజాగా పర్యటనకు నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో రేవంత్ అమెరికా పర్యటన రద్దైంది. లండన్ షెడ్యూల్ ముగించుకుని ఈ నెల 23న ఆయన హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఈ వార్తకు సంబంధించిన

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ఈ అంశంపై ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా సమావేశమై చర్చించారు. అనంతరం కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను టార్గెట్ చేస్తూ కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆమె వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా సురేఖకు వ్యతిరేకంగా గళం విప్పారు.సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో మాట్లాడారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఇప్పటివరకు ఖండించకపోవడాన్ని ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలపై బాధ్యత వహించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సీఎంను వ్యతిరేకించే వారికి పార్టీలో ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. మీ భాష ఎప్పుడూ పార్టీకి నష్టం కలిగించేలా ఉందని కొండా ఫ్యామిలీని ఉద్దేశించి అన్నారు.సుస్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని సురేఖ చెప్పడంపైనా ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇచ్చిన వివరణ తమకు ఆమోదయోగ్యంగా లేదని తేల్చారు. సీఎం రేవంత్ ఎంతో కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించినప్పుడు ఖండించడం కనీస బాధ్యత అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చాలనే ప్రతిపక్షాల కుట్రలకు బలం చేకూర్చుతున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్చలు తీసుకోవాలని

హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్‌లో 1,816 మంది అధికంగా మహిళలు హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇప్పుడు తన స్థానాన్ని చేజార్చుకునేలా కనిపిస్తోంది. సుమారు నాలుగు లక్షలకు పై చిలుకు ఉన్న ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. సుమారు 44.19 శాతం ఓట్లు జాబితా నుంచి కనుమరుగు కావడంతో వాటిలో కొన్ని ఓట్లైనా తిరిగి రాబట్టుకునేలా కార్యచరణ చేసుకునేందుకు రాజకీయ శిబిరాలు ప్రయత్నాలు ఆరంభించాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ జాబితాను ఇటీవల ప్రచురించింది. దీని ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1.79 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. అత్యధిక ఓట్లు తొలగించబడిన నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ మూడోస్థానంలో నిలిచింది. పేరుకు జూబ్లీహిల్స్ అయినప్పటికీ నియోజకవర్గంలో బస్తీలు అత్యధికంగా ఉన్నాయి. మాస్ ఓటర్ల సంఖ్యే ఎక్కువ. ప్రతీ యేట ఇక్కడ ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో సుమారు 79 వేల ఓటర్లు పెరిగారు. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలస వచ్చిన వారే అధికంగా ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రకారం ఒకరికి ఒకే ఓటు అని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో మెజారిటీ ఓటర్లు పుట్టిన ఊర్లో ఓటు ఉంచుకునేందుకు మొగ్గు చూపించారు. దీంతో ఓటు శాతం గణనీయంగా తగ్గింది. ఏకంగా 1.48 లక్షల మంది తమ ఓటును నియోజకవర్గం నుంచి వేరే చోటకు పెట్టుకున్నట్టు షిఫ్టింగ్ జాబితా ప్రకారం తెలుస్తోంది. అంతేగాకుండా ఇక్కడ హాస్టళ్లు కూడా ఎక్కువ ఉండడంతో చాలామంది స్థానిక చిరునామా కోసం ఓటరు కార్డులు చేయించుకున్నారు. ఇవి కూడా ఇప్పుడు తరలి పోయాయని లెక్కలు చెబుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,219. ఇక్కడ పురుషుల కంటే మహిళలే 1,816 మంది ఎక్కువగా ఉన్నారు. పురుషులు 1,12,697 మంది ఉండగా, మహిళలు 1,14,513 మంది

ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రై కార్పొరేషన్లలోని ప్లానింగ్ విభాగం లీలలు హైదరాబాద్ సిటీ: ట్రై కార్పొరేషన్లలోని కొందరు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల నుంచి ఓసీల జారీ వరకు.. ఫైల్‌కు ఇంత అని, అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం బట్టి రేట్లు నిర్ణయించి మరీ లంచాలు తీసుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకుంటే నోటీసులు, కూల్చివేతలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) పరిధిలో ఈ తతంగం ఎక్కువగా జరుగుతుండగా.. తామేమి తక్కువ కాదన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) యంత్రాంగం కూడా వారితో పోటీ పడుతోంది. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల దోపిడికి అడ్డూ అదుపు ఉండడం లేదు. మాదాపూర్‌లో నోటరీ స్థలాల్లో నాలుగైదు అంతస్తుల భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రాంతాల వారీగా అవుట్ సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించి.. నిర్మాణదారుల నుంచి కొందరు అధికారులు వసూళ్లు చేస్తుండడం గమనార్హం. కూకట్పల్లి జోన్ పరిధిలోనూ పలువురు పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. అంతా మేం చూసుకుంటాం.. అదనపు అంతస్తులు నిర్మించుకోండని భవన యజమానులకు భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. గ్రౌండ్ ప్లస్ రెండంతస్తుల భవనానికి అనుమతి తీసుకున్న ఓ వ్యక్తి అదనంగా మరో రెండంతస్తులు నిర్మించారు. స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోగా.. త్వరగా బయటి వైపు పనులు పూర్తి చేసి రంగులు వేయాలని సూచించినట్టు సమాచారం. చైన్‌మెన్ నుంచి టీపీఎస్, ఏసీపీ, సిటీ ప్లానర్ల వరకు అవినీతిలో భాగస్వాములుగా ఉంటున్నారు. ప్రతీ ఫైల్‌కు ముడుపులు ముట్టాల్సిందే అని కింది స్థాయి సిబ్బంది వద్ద పైఅధికారులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం

2022-26 మధ్య 1,04,046 మంది విద్యార్థులకు అవకాశం కలిగింది శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అమరావతి: ప్రజాప్రభుత్వ పాలనలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం(ఆర్టీఈ) కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో సభ్యులు కావలి గ్రీష్మ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పేరాబత్తుల రాజశేఖర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2022-23 నుంచి 2026-27 వరకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1,04,046 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. 12(1)(సి) సెక్షన్ కింద ప్రవేశాలు పారదర్శక ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా చేపట్టాం. 12(1)(సి) సెక్షన్ ను సమర్థంగా అమలుచేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాహక్కు చట్టం కింద విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. 2022-23 ఏడాదిలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో కేవలం 2,203 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదే 2024-25లో సుమారు 29వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందగా.. 2026-27 ఏడాదిలో 28,742 మంది విద్యార్థులకు విద్యాహక్కు చట్టం కింద అడ్మిషన్లు లభించాయి. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాహక్కు చట్టంపై సమాజంలో అవగాహన పెరిగిందని, దీనిపై పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు