
National Commission For Women Takes Tukkuguda Nurse Case As Sumoto 1554807
జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తుక్కుగూడ నర్సుకేసును సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు.
జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తుక్కుగూడ నర్సుకేసును సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు.
హైదరాబాద్, సెప్టెంబర్02: ఇటీవలే తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ నర్సు హత్య కేసును సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై ఏడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు గల కారణాల గురించి సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని జాతీయ మహిళా కమిషనర్ లేఖలో పేర్కొన్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, త్వరితగతిన కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆమె సూచించారు. నిందితుడి పూర్వ నేరచరిత్రపై ఆరా తీయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిందితుడిపై తక్షణమే కఠినచర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
శంషాబాద్లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట: మంత్రి అజహరుద్దీన్






