
Team India: బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో జమ్ము కశ్మీర్‌కు చెందిన యువ పేస్ బౌలర్ ఆకిబ్ నబీ డార్కు చోటు దక్కింది. బారాముల్లా ఎక్స్‌ప్రెస్ అని పిలువబడే 29 ఏళ్ల ఆకిబ్ నబీ.. ప్రస్తుత సెలక్షన్ కమిటీ ప్రకటించిన జట్టులో జమ్ము కశ్మీర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో అతను కనబరిచిన నిలకడైన అద్భుత ప్రదర్శనకు ఈ జాతీయ జట్టు పిలుపు తగిన బహుమతిగా చెప్పవచ్చు.




