
ఇంటర్నెట్‌ డెస్క్: ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది ( Air India ). వేగవంతమైన సేవలు అందించేందుకు ఏఐ టూల్స్‌ వినియోగిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై రిఫండ్‌, టికెట్‌పై పేర్ల సవరణ వంటి సేవలు చకచకా జరగనున్నాయి. ఇందుకు సేల్స్‌ఫోర్స్‌ కంపెనీకి చెందిన ఏఐ ఏజెంట్‌ఫోర్స్‌ ప్లాట్‌ఫాంను నియమించుకుంది. దీంతో ఇంతకముందులా రిఫండ్‌ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన ప్రయాస తప్పనుంది. ఎయిరిండియా తీసుకున్న తాజా నిర్ణయంతో అంతర్గత రిఫండ్‌ ప్రక్రియ 14 రోజుల నుంచి 4 గంటలకు తగ్గనుంది. ఇది అంతర్గత ప్రక్రియ మాత్రమే. ఇది పూర్తయ్యాక పేమెంట్ గేట్‌వే లేదా కస్టమర్ బ్యాంక్ ఆ మొత్తాన్ని ఖాతా/క్రెడిట్ కార్డులో జమ చేయడానికి మరికొంత సమయం పడుతుంది. అలాగే, టికెట్‌పై తప్పుగా నమోదైన ప్రయాణికుడి పేరును సవరించేందుకు గతంలో మూడు రోజులు పట్టేది. ఇప్పుడు 30 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రయాణికులు ఒకే ఈ-మెయిల్‌లో పలు రకాల సమస్యలను ప్రస్తావించినా.. ఏఐ సిస్టమ్‌ వాటన్నింటినీ గుర్తించి ఒకే ఈ-మెయిల్‌లో సమాధానాన్ని పంపించనుంది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అధ్యక్షతన ముంబయిలో జరిగిన బోర్డు సమావేశంలో కొత్త ఎండీ, సీఈఓ వేతనంతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుత సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ మాజీ చీఫ్ టెవోల్డే గెబ్రెమరియం బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న దిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఇమిగ్రేషన్ తనిఖీలు లేకుండా ముగ్గురు ఇటాలియన్ పౌరులు దేశాన్ని వీడడాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎయిరిండియా ఉన్నతాధికారులను ఆదేశించింది. కర్తవ్య భవన్‌లో సమావేశానికి హాజరు కావాలని తెలిపింది. పౌర విమానయాన శాఖ ఇప్పటికే ఆ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





