
Team India: జపాన్‌లోని ఐచి-నగోయా (Aichi-Nagoya) నగరంలో ఆసియా క్రీడలు (Asian Games 2026) సెప్టెంబర్ 19 తేదీన అధికారికంగా ప్రారంభం కానుండగా, మహిళల క్రికెట్ పోటీలు రెండు రోజుల ముందే అంటే సెప్టెంబర్ 17 ప్రారంభ తేదీగా మొదలుకానున్నాయి. మొత్తం ఎనిమిది జట్లు నాకౌట్ పద్ధతిలో పోటీపడే ఈ టోర్నీలో భారత క్రికెట్ జట్టు (Team India) తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం లభించింది. భారత మహిళల జట్టు సెప్టెంబర్ 18వ తేదీన ఆతిథ్య జపాన్ క్రికెట్ జట్టు (Japan Cricket Team) తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఉదయం 10.30 గంటల సమయానికి జరగనుండగా, ఈ సమరంలో నెగ్గిన జట్టు సెప్టెంబర్ 20న జరిగే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.





