
ప్రతిభావంతులైన ఎందరో విద్యార్థులకు ఉన్నత చదువుల విషయంలో ఆర్థిక సమస్యలే అవరోధమవుతున్నాయి. ఇలాంటి వారంతా నిశ్చింతగా విద్య కొనసాగించడానికి ఇప్పుడెన్నో స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. ఉపకార వేతనాలతో విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తూ.. దేశంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకూ వివిధ స్కాలర్‌షిప్పులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ ఆ ర్థికంగా వెనకబడిన ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ అండగా నిలుస్తోంది. ‘ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ 2026-27’ పేరిట ఇంటర్‌ నుంచి ప్రొఫెషనల్‌ డిగ్రీ చదివే విద్యార్థుల కోసం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తోంది. తరగతి లేదా కోర్సుతో పాటు విద్యార్థి ఆర్థిక స్థితిగతులు, అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా రెండు రకాల స్కాలర్‌షిప్పులను ఇస్తున్నారు. అవేంటంటే.. జనరల్‌ స్కాలర్‌షిప్పు: ఇది ఇంటర్‌ లేదా డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఉద్దేశించినది. అంటే.. ఇంజినీరింగ్, మెడిసిన్, ఏదైనా ఇతర గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, ఒకేషనల్, డిప్లొమా కోర్సులకు ఆర్థిక సాయం చేయనున్నారు. డివిజన్‌కు 80 మంది చొప్పున ఎంపిక చేస్తారు. స్పెషల్‌ స్కాలర్‌షిప్పు: ఇది పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల పైచదువులకు ఉద్దేశించినది. డివిజన్‌కు 40 మంది చొప్పున ఎంపిక చేస్తారు. కోర్సు: ఇంటర్‌ లేదా డిప్లొమా ఏటా స్కాలర్‌షిప్పు: రూ.15,000 ఈ స్కాలర్‌షిప్పు కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటే అవసరమైన ధ్రువపత్రాలూ అప్‌లోడ్‌ చేయాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 30. వెబ్‌సైట్‌: https://licindia.in/golden-jubilee-foundation ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు ఇం జినీరింగ్‌ చదివే విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రైవేట్‌ రంగంలోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు ముందుకొచ్చింది. సంస్థ సీఎస్‌ఆర్‌లో భాగంగా స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ని ఇటీవల ప్రకటించింది. 2026-30 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కాలేజీల్లో బీఈ లేదా బీటెక్‌ మొదటి ఏడాదిలో చేరిన విద్యార్థులకు ఏటా గరిష్ఠంగా రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించనుంది. మొత్తం 230 మందికి కోర్సు వ్యవధి నాలుగేళ్ల పాటు ఈ ఉపకార వేతనాన్ని ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండాలి. అర్హులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే సాయం మొత్తాన్ని జమ చేయనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 20. వెబ్‌సైట్‌: https://www.idfcfirst.bank.in/csr-activities/educational-initiatives/engineering-scholarship-program#fc4 టాటా క్యాపిటల్‌ లిమిటెడ్‌





