
© 2026 nimisham.in

బుచ్చిరెడ్డిపాలెం: కోవూరు మండలంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. కోవూరులో ఏర్పాటు చేసిన తెదేపా వ్యవస్థాపకులు, యుగపురుషుడు నందమూరి తారకరామారావు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. తొలుత నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, డాక్టర్ అర్జున్‌రెడ్డిలతోపాటు పెద్దసంఖ్యలో తరలివచ్చిన తెదేపా శ్రేణులు, నాయకులు మంత్రి లోకేశ్‌కు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక రుక్మిణి కల్యాణ మండపం నుంచి జాతీయ రహదారి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీతో కోవూరు వీధులన్నీ పసుపుమయంగా మారాయి. విగ్రహావిష్కరణ అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. మహానాయకుడు ఎన్టీఆర్ చూపిన మార్గంలోనే నడుస్తూ, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, దువ్వూరు కల్యాణ్ రెడ్డి, పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, చేనేత ఫెడరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కేవీ శేషయ్య, పాటూరు నీటి సంఘం ఉపాధ్యక్షుడు శింగారెడ్డి లక్ష్మీనరసారెడ్డి, ఛైర్‌ పర్సన్‌ మోర్ల సుప్రజ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.



