
తెలంగాణ శాసనసభలో 22-ఏ (22A) అంశంపై జరిగిన చర్చలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపర్ చేశారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఈదుల నాగులపల్లిలోని 150 ఎకరాల ప్రభుత్వ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో సహా పలువురికి అంటగట్టారని, జూ.ఎన్టీఆర్ కూడా ధరణి బాధితుడేనని పేర్కొన్నారు. ఈ భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.




