
ఏపీలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం దరఖాస్తు గడువును మరింత పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పించన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు పెంచినట్లు స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకే మరో రెండు రోజులు గడువు పెంచినట్లు కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 7 తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా.. ఈ నెల 16 వరకు సమయం ఇచ్చారు. అయితే ఇప్పుడు 18వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.