
© 2026 nimisham.in

KTR | గోడల మీద పెయింట్ వేసుకునే నీ సంగతి నాకు తెలియదా..కొండారెడ్డిపల్లి పోయి అడిగితే మీ బతుకు మొత్తం బయటపడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై(Revanth) ఫైర్ అయ్యారు. కేసీఆర్కు 1000 ఫాం హౌస్ వద్ద ఎకరాలు ఉందని ఒకసారి, నేడు 67 ఎకరాలని మరోసారి సీఎం చెప్పిన అబద్ధాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో 150 బెడ్ రూంలు ఉన్నాయని.. బంగారు బాత్రూంలు ఉన్నాయని చేసిన చిల్లర వ్యాఖ్యల్లో ఎంత నిజం ఉందో.. నిన్న రేవంత్ చేసిన ఆరోపణల్లో కూడా అంతే నిజం ఉందన్నారు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయని మభ్యపెట్టే దాంట్లో ఎంత నిజం ఉందో, రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటల్లో కూడా అంతే నిజముందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇళ్లు రెండు ఎకరాల్లో ఉండేది కేసీఆర్ పుట్టినప్పుడే ఆయన ఇళ్లు రెండు ఎకరాల్లో ఉండేది. కేసీఆర్ తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేది. చింతమడకలో ఉన్న రెండెకరాల ఇంటిని కూడా ప్రభుత్వ పాఠశాలకు కేసీఆర్ రాసిచ్చారని గుర్తు చేశారు. గోడల మీద పెయింట్ వేసుకునే నీకు జూబ్లీహిల్స్లో ప్యాలెస్ ఉండొచ్చు కానీ.. కేసీఆర్కు వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండొద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్కు మొదటినుండే వందల ఎకరాలు ఉన్నాయి. కేసీఆర్ దొర అంటావా, లేక ఈ మధ్య సంపాదించు కున్నాడు అంటావా? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు రేవంత్ రెడ్డి అని సూచించారు. నేను అమెరికాలో ఆరున్నర సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించుకున్నాను. నువ్వు ఏమీ చేసి సంపాదించావు రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి 7 ఏండ్లు డిగ్రీ చదివిండు అని ఎద్దేవా చేశారు. కొండల్ రావు అని కూకట్పల్లిలో ఒక పెద్దాయన ఉంటే ఆయన ఆస్తులు కూడా మా దాంట్లో రేవంత్ రెడ్డి వేసేశాడు. ఆయనకి మాకు చుట్టరికం కూడా లేదు.. కేవలం వెలమ కులం అంతే. కేసీఆర్ అక్కాచెల్లెలు, అన్నతమ్ముళ్ల సంతానం 300 మంది ఉంటారు. వాళ్ల ఆస్తులు కూడా మా ఖాతాలో కలిపెయ్.సంతోష్ రావుకి మాకు చుట్టరికం ఉంటే ఆయన ఆస్తులు కూడా కేసీఆర్ ఖాతాలో వేస్తావా? నీ అన్నతమ్ముళ్ల వాళ్ల పిల్లల ఆస్తులు నీ ఖాతాలో వేస్తే ఎలా ఉంటుంది? అని నిలదీశారు. నవీన్ రావుకి, కొండల్ రావుకి మాకు ఏం సంబంధం? నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. గోడల మీద పెయింట్ వేసుకునే నీ సంగతి నాకు తెలియదా కొండారెడ్డిపల్లి పోయి అడిగితే మీ బతుకు మొత్తం బయటపడుతుంది గోడల మీద పెయింట్ వేసుకునే నీకు జూబ్లీహిల్స్లో ప్యాలెస్ ఉండొచ్చు కానీ.. కేసీఆర్ గారికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండొద్దా – కేటీఆర్ https://t.co/JFRf0BLpgL pic.twitter.com/0bqunEhBeZ — Telugu Scribe (@TeluguScribe) September 17, 2026 నేను అమెరికాలో ఆరున్నర సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించుకున్నాను నువ్వు ఏమీ చేసి సంపాదించావు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి 7 ఏండ్లు డిగ్రీ చదివిండు – కేటీఆర్ https://t.co/zEAsczYIT8 pic.twitter.com/dvDTriNCPN — Telugu Scribe (@TeluguScribe) September 17, 2026 కొండల్ రావు అని కూకట్పల్లిలో ఒక పెద్దాయన ఉంటే ఆయన ఆస్తులు కూడా మా దాంట్లో రేవంత్ రెడ్డి వేసేశాడు
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







