
అంత గొప్ప ఫ్యామిలీని మేము కూడా చూడాలనుకుంటున్నాం అని ఎస్సై అనగా.. మదన్ మేము ఏంటనేది ఎవరికో ఫోన్ చేసి నిరూపించుకోవాలనుకోవడం లేదని అంటాడు. దీంతో ఎస్సై ఎవరికో కాదు మీ వాళ్లకు చేయమంటున్నాం అంటాడు. చేయం అని మదన్ అనగా.. ఎందుకు చేస్తారు, మీరు తప్పు చేశారన్న నిజం బయటపడుతుంది కదా, మీరు చెప్తుందంతా అబద్ధం అని తెల్సిపోతుంది కదా అంటాడు. సర్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఫారెన్‌లో చదువుకున్నాను అంటాడు. ఫారెన్‌లో చదువుకుంటే తప్పు చేయరా అని ఎస్సై అనగా.. అది కాదు సార్ మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం, చిన్న సమస్య వల్ల మేము ఇంట్లోంచి బయటకు వచ్చేశాం అని వివరిస్తాడు. త్వరలోనే ఓ అద్దె ఇల్లు తీస్కుని సెటిల్ అవ్వాలనుకున్నాం, కానీ ఆలోపే మీరు ఇక్కడికి తీసుకొచ్చేశారని మదన్ అంటాడు. ఇంతగా చెప్తున్నా మీకు ఎందుకు అర్థం కావడం లేదని అనగా.. చూడమ్మా.. మీలాగా అరెస్ట్ అయిన వాళ్లందరూ ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటారు, మేము ఎన్ని కథలు నమ్మాలి, ఎవర్ని నమ్మాలని ఎస్సై అంటాడు. దీంతో వాళ్లతో మాకు సంబంధం ఏంటి సార్ అని మదన్ అనగా.. మీరు కూడా వాళ్లు దొరికిన చోటే దొరికారని చెప్తాడు. నిజంగానే మీరు ఏ తప్పూ చేయలేదని అనుకుంటే.. మీ వాళ్లకు ఫోన్ చేసి రమ్మనండి, లేదంటే మీమీద కేసు ఫైల్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేనని అంటాడు. ఏదైనా ఉంటే కోర్టులోనే తేల్చుకోవాల్సి ఉంటుందని చెప్తాడు. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన రేఖ.. అవసరం లేదని అంటుంది. అయితే అక్కడకు వచ్చిన రేఖ, భ్రమరం, భూషణ్, శేషులను చూసి స్వాతి, మదన్‌లు షాక్ అవుతారు. ఒక్కసారిగా లేచి నిలబడతారు. కానీ రేఖ మాత్రం వాళ్ల విషయాలు కోర్టులో తేల్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే క్లోజ్ చేసేయండని అంటుంది. దీంతో ఎస్సై మీరు అనగా.. నేను మదన్ వాళ్ల అమ్మను, వాడు నా కొడుకని చెప్పగా.. స్వాతి నా కూతురు అని భ్రమరం చెబుతుంది. ఐడీ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా అని అనగా.. ఐడీ కార్డ్స్ కావాలా, నా కూతురే అని పోలీకలు ఏమీ కనిపించట్లేదా అని భ్రమరం సీరియస్ అవుతుంది. అస్సలు కనిపించట్లేదని ఎస్సై అనగా.. భూషణ్ ముందుకెళ్లి ఐడీ కార్డులు చూపిస్తాడు. చూడండి ఇవి చాలా, ఇంకేమైనా ప్రూఫులు కావాలా అంటాడు. సరిపోయాయని ఎస్సై చెప్పగా.. అయినా ఒకర్ని అరెస్ట్ చేసేటప్పుడు వాళ్లు ఎవరు, ఏంటన్న బాగ్రౌండ్ తెల్సుకుని అరెస్ట్ చేయాలి కదా అని భ్రమరం అంటుంది. ఇష్టానుసారంగా అరెస్ట్ చేసి మీడియాకెక్కిస్తే ఏమనుకోవాలని నిలదీస్తుంది. దీంతో ఎస్సై.. మేమేమీ కావాలని అరెస్ట్ చేయలేదు మేడమ్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశామని అంటాడు. దీంతో భూషణ్ మరింత సీరియస్ అవుతూ.. ఏం ఇన్ఫర్మేషన్, ఆ.. ఏ ఇన్ఫర్మేషన్ అని అడుగుతాడు. వాళ్ల మీద ఎవరైనా కంప్లైంట్ చేశారా, ఇంకేదైనా ట్రైన్ చేసి చెప్పారా.. చెప్పండి అంటూ నిలదీస్తాడు. ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్లని అని అడుగుతారు. దీంతో ఎస్సై లేచి.. లాస్ట్ టైమ్ కూడా ఆ హోటళ్లో సెర్చ్ చేసినప్పుడు చాలా మంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ పట్టుబడ్డారు, ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతున్నాయని తెలిసిందంటాడు. అందుకే అక్కడ తనిఖీలు చేశామని.. ఈక్రమంలోనే వీళ్లు కూడా పట్టుబడ్డారని చెప్పాడు. అయినా మీరు ప్రశ్నలు అడగాల్సింది నన్ను కాదు వాళ్లని అని చెబుతాడు. వాళ్లు ఆ టైంలో అక్కడ ఎందుకున్నారో అడగండని అంటాడు. ఆపై ఇక్కడ సంతకం చేసి వాళ్లను తీసుకెళ్లమని చెబుతాడు. కానీ మదన్ మాత్రం.. వాళ్ల సంతకం ఎందుకు సార్ అని అనగా.. అలా అంటావేంటయ్యా, పేరెంట్స్ కదా, వాళ్ల పూచీకత్తు మీదే మిమ్మల్ని విడుదల చేస్తామని చెబుతాడు. దీతో మదన్ అవవరం లేదు సార్, వాళ్లకు మాకు ఏ సంబంధమూ లేదని అంటాడు. అసలు వాళ్లు ఎవరో కూడా నాకు తెలీదంటాడు. దీంతో భ్రమరం.. రేయ్ మదన్, ఏం మాట్లాడుతున్నావురా, విషయం ఇంతదూరం వచ్చాక కూడా నీకు ఇంకా పొగరు తగ్గలేదా అంటుంది. దీంతో మదన్.. మైండ్ యువర్ వర్డ్స్ అనగా.. రేయ్ ఇంగ్లీషులో మాట్లాడితే ఇస్తరాకులా మడత పెట్టేస్తానంటుంది. నా కూతురుని బయటకు తీసుకొచ్చి ఒక్కరోజు కూడా గడవలేదు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావు, ఇంకా ఎందుకంత పొగరు చూపిస్తున్నావు అని నిలదీస్తుంది. దీంతో స్వాతి.. అమ్మా, బావ గురించి మీరలా మాట్లాడితే ఊరుకోను చెబుతున్నాను, బావకుంది పొగరు కాదు, ఆత్మాభిమానం అని వివరిస్తుంది. సేమ్యా పరమాన్నం ఏమీ కాదు అని భ్రమరం అనగా.. బావకు మీ దగ్గర సాయం తీసుకోవాలని లేకపోతే నాక్కూడా ఇష్టం లేదని, మీరు వచ్చిన దారినే వెళ్లొచ్చని అంటుంది స్వాతి. దీంతో ఏంటే, ఏంటే, ఏం మాట్లాడుతున్నావని సీరియస్ కాగా.. శేషు కుమార్తెతో మాట్లాడుతాడు. మనకు ఏవైనా సమస్యలు ఉంటే ఇంటికెళ్లాక మాట్లాడుకోవచ్చు, కానీ పోలీస్ స్టేషన్లో ఇలా ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదని స్వాతికి చెబుతాడు. కానీ స్వాతి మాత్రం.. నాన్నా నేనిప్పుడు ఏం చేయాలన్నా బావ చెప్తేనే చేస్తాను, బావా వెళ్లమంటే వస్తాను, బావను కాదని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని అంటుంది. దీంతో శేషు.. మదన్‌తో మాట్లాడతాడు. "అల్లుడు నా మాట విను, నీకు మీ అమ్మ మీద కోపం ఉందని తెల్సు, కానీ అలాంటి కోపాలన్నీ పాలపొంగులాంటివి. మనసు చల్లారితే అన్నీ పోతాయి. వాటి గురించి మనుషుల్ని దూరం చేసుకోకూడదు. రండి వెళ్దాం" అంటాడు శేషు. కానీ మదన్ మాత్రం.. సారీ మామయ్యా మేము రాలేమంటాడు. దీంతో రేఖ.. చెప్తే అర్థం చేసుకో, మీరిక్కడే ఉన్నారంటే చాలా ప్రాబ్లమ్ అవుతుందని అంటుంది. దీంతో అయితే అవ్వనివ్వండి, మా ప్రాబ్లమ్ మేమే పరిష్కరించుకుంటాం, మేము ఏ తప్పు చేయలేదు, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అంటాడు. దీంతో భూషణ్ మాట్లాడుతూ.. మీరు తప్పు చేశారని మేమెవరం అనడం లేదు, తప్పు చేయలేదు కాబట్టే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని అంటాడు. అయితే మదన్ మాత్రం.. మీతో కలిసి మేము రామని అంటాడు. మీరు పూచీకత్తుగా ఉంటే అస్సలే రామని చెప్తాడు. ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు, అర్థం చేసుకో నాన్నా అని శేషు అంటాడు. అర్థం చేసుకున్నాను కాబట్టే మిమ్మల్ని వెళ్లిపోమంటున్నానని మదన్ చెప్తాడు. ఇందులో ఎలా ఇరుక్కున్నామో అలాగే బయటపడతామని వివరిస్తాడు. నాకు తెల్సు మీరు వెళ్లండని పేర్కొంటాడు. దీంతో ఎస్సై మాట్లాడుతూ.. వాళ్లకు మీ అవసరం లేనప్పుడు మీ టైం ఎందుకు వేస్ట్, వెళ్లిపోండని చెప్తాడు. ఈ మదన్ ఇంత మూర్ఖంగా ఉంటాడని నేనస్సలే అనుకోలేదు, చెప్తే విననప్పుడు చెడితే చూడాలన్నారని ఓ సామెత కూడా వదులుతుంది భ్రమరాంభ. మీకు కర్మ అనుభవించాలని ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారని అంటుంది. అంతటితో ఆగకుండా రేఖ పదా.. వీళ్లు కోర్టు చుట్టూ తిరిగి, రెండ్రోజులు జైల్లో చిప్పకూడు తింటే బుద్ధి వస్తుందని వెనక్కి తిరగ్గానే.. రాజు, ఇందులు కనిపిస్తారు. ముఖ్యంగా రాజు వెంటనే కల్పించుకుని మాట్లాడుతూ.. మదన్, స్వాతిలు జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతాడు. వాళ్లకు అంత కర్మ పట్టలేదని, మేముండగా వాళ్లకు అలాంటి పరిస్థితి రానివ్వమని అంటాడు. మరోవైపు ఇందు స్వాతిని చూసి తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. దీంతో స్వాతి ఇందుపై పడి ఏడుస్తుంది. అసలు ఇంత దూరం వచ్చేవరకు ఎందుకు ఊరుకున్నారు, నాకు ఫోన్ చేసుంటే అయిపోయేది కదా అని ఇందు అంటుంది. నేను ఏవైనా అవసరం ఉంటే చెప్పమని ఫోన్ చేసి చెప్పాను కదా అని నిలదీస్తుంది. అయినా అలాంటి హోటల్స్‌లో ఉండాల్సిన కర్మ మీకేంటని అంటూనే... మదన్ ఏంటిది అని అంటుంది. "అక్కా.. బావదేం తప్పులేదక్కా.. బావ మంచి హోటళ్లోనే ఉందామన్నాడు. కానీ నేనే డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడం దేనికని, ఏదైనా చిన్న హోటల్‌కు వెళ్దామని చెప్పాను." అంటుంది స్వాతి. మరోవైపు రాజు .. "చూడు మదన్ మనం మగవాళ్లం. ఎలా అయినా ఉండొచ్చు. ఎక్కడైనా తిరగొచ్చు. కానీ ఆడవాళ్లు అలా కాదు. మనల్ని నమ్మి ఒక అమ్మాయి వచ్చిందంటే తనని చాలా జాగ్రత్తగా చూస్కోవాలి" అని చెప్తాడు. అరే ఎలాంటి ప్రాబ్లమ్ తీస్కురావొద్దని, ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్ అస్సలే తీసుకురావొద్దని అంటాడు. దీంతో మదన్ రాజుకు సారీ చెబుతాడు. ఇలాంటి సమస్య వస్తుందని తాను అనుకోలేదని వివరిస్తాడు. ఏయ్ మదన్, స్వాతి.. మేము మీ కన్నవాళ్లం రా.. మాకన్నా మీకు వాళ్లే ఎక్కువైపోయారా అని భ్రమరం అడుగుతుంది. వాళ్లతో మాట్లాడినట్లుగా కూడా మాతో మాట్లాడడం లేదు కదా అంటుంది. దీంతో శేషు ఫైర్ అవుతాడు. వాళ్లు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడనివ్వు అంటాడు. దీంతో భ్రమరం నోరు మూస్తుంది. అప్పుడే రాజు.. మదన్ మీకు తెలిసో, తెలియకనో ఓ తప్పు జరిగిపోయింది. మీడియాలో వచ్చేసింది. నువ్వుగానీ స్వాతి గానీ నలుగురిలో నవ్వులపాకు కాకూడదంటే.. మీరు ఏ నిందతో అయితే ఇక్కడ అడుగు పెట్టారో అది పోగొట్టుకొనే బయటకు రావాలని సూచిస్తాడు. రాజు.. నా వల్ల స్వాతికి ఏ చెడ్డ పేరూ రాకూడదు, తను బాధ పడుతుంటే నేను చూస్తూ ఉండలేను, తట్టుకోలేను కూడా అంటాడు మదన్. అలాగే ఏం చేయాలో చెప్పమని రాజును అడుగుతాడు. స్వాతి కోసం నువ్వు ఏం చెప్తే అది చేస్తానంటాడు. దీంతో రాజు.. అయితే మీరు పోలీస్ స్టేషన్ నుంచి భార్యాభర్తలుగా బయటకు రావాలంటాడు. దీంతో అంతా షాక్ అవుతారు. అంటే ఇప్పుడు వీళ్లద్దరికీ అంటే పోలీస్ స్టేషన్లో పెళ్లి చేస్తావా అని రేఖ అడుగుతుంది. అవునని రాజు చెప్పగా.. ఏయ్ పోలీస్ స్టేషన్లో చేయడం ఏంటని భూషణ్ ప్రశ్నిస్తాడు. చేస్తే తప్పేంటని రాజు అనగా.. నా కొడుకును నాకు దూరం చేసిందే కాకుండా.. ఇప్పుడు ఇలా పెళ్లి చేద్దామనుకుంటున్నావా, ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటావా అంటూ రేఖ సీరియస్ అవుతుంది. "పిన్నీ.. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు అర్థం అవుతుందా. నేను వీళ్లను నలుగురిలో తలెత్తుకుని తిరిగేలా చేద్దామనుకుంటున్నాను" అంటాడు రాజు. దానికోసం పెళ్లే చేయాలా అని రేఖ ప్రశ్నించగా.. అవును పెల్లే చేయాలని రాజు వివరిస్తాడు. వీళ్లద్దరికీ ఇప్పుడిక్కడ పెళ్లి జరిగితే, వీళ్లది ఏ తప్పూ లేదని సమాజం నమ్ముతుండి, నలుగురూ గౌరవిస్తారని అంటాడు. భ్రమరం కల్గజేసుకుని.. నాకర్థం అయింది.. న





