
దిల్లీ: తన కెరీర్‌ గురించి బయటి వాళ్లు ఎవరేమన్నా పట్టించుకోనని టీమ్‌ఇండియా బ్యాటర్‌ సంజు శాంసన్‌ అన్నాడు. ‘‘కొన్నిసార్లు వైఫై ఆన్‌ చేస్తా. మాజీ ఆటగాళ్ల వ్యాఖ్యలు చదువుతా. ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతారు. అది మామూలే. వాళ్లు నా గురించి సానుకూల వ్యాఖ్యలు చేయొచ్చు లేదా వ్యతిరేక వ్యాఖ్యలు చేయొచ్చు. నేను పరిణతి సాధించా. ఆ వ్యాఖ్యలు చూసి ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు’’ అని శాంసన్‌ అన్నాడు. ‘‘కొన్నిసార్లు బాధనిపిస్తుంది. నేను రోబోను కాదు. ఆ వ్యాఖ్యలు కచ్చితంగా నాపై ప్రభావం చూపిస్తాయి. కానీ నాకు నేను సర్దిచెప్పుకొంటా’’ అని చెప్పాడు. బయటివాళ్ల మాటలను పట్టించుకుంటే తాను సరిగా బ్యాటింగ్‌ చేయలేనని శాంసన్‌ అన్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌ బాగుందని, ప్రపంచకప్‌ తనకు ఎంతో ఉపయోగపడిందని అతడు చెప్పాడు. ఓపెనింగ్‌ స్థానానికి వైభవ్‌ నుంచి శాంసన్‌కు గట్టి పోటీ ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై శాంసన్‌ స్పందించాడు. ‘‘భారత జట్టును నడిపించడం అంత తేలిక కాదు. 15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్‌లో 700-800 పరుగులు చేశాడు. నేను అంతకుముందు ప్రపంచకప్‌లో బాగా ఆడాను. దాని తర్వాత వైభవ్‌ గొప్పగా ఆడాడు. ఏదో రకంగా అతడు జట్టులోకి రావాల్సిందే’’ అని చెప్పాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





