
ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ అగ్రకథానాయకుడు, తమిళనాడు సీఎం విజయ్‌ కుమారుడు జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘సిగ్మా’ (Sigma). సందీప్ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా రూపొందిన ఈ మూవీ అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్‌ కిషన్‌ మాట్లాడారు. సిగ్మా మూవీలో తన పాత్రకు జాసన్‌ సంజయ్ డబ్బింగ్ చెప్పినట్లు వెల్లడించారు. ‘‘ నేను సాధారణంగా ఒకేసారి రెండు, మూడు చిత్రాలు చేయను. ఒకటి పూర్తయ్యాకే మరొకటి చేస్తాను. ‘సిగ్మా’ షూటింగ్ పూర్తి కాగానే మరో మూవీకి సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయాను. దానివల్ల డబ్బింగ్ సమయానికి అందుబాటులో లేను. దీంతో ఫస్ట్ డ్రాఫ్ట్‌లో నా క్యారెక్టర్‌కు జాసన్ సంజయ్ డబ్బింగ్ చెప్పారు. కెమెరా ముందు నేను మాట్లాడే విధానం, నా వాయిస్ మాడ్యులేషన్ కాస్త భిన్నంగా ఉంటుంది. సంజయ్ నా గొంతును అద్భుతంగా దించేశారు. సినిమా విడుదలైన తర్వాత సంజయ్ డబ్బింగ్ చెప్పిన ఆ వెర్షన్‌ను కూడా ప్రేక్షకులతో పంచుకుందామని నేను ఆయనకి చెప్పా’’ అని సందీప్ కిషన్ తెలిపారు. ఇక, ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించగా.. రాజు సుందరం, సంపత్‌ రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతమందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. సిద్ధార్థ్ మల్హోత్రా, (Sidharth Malhotra) తమన్నా కీలక పాత్రల్లో నటించిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ‘ది వాన్’. ఇంటర్నెట్‌ డెస్క్: ఇండస్ట్రీలో క్యూట్‌ కపుల్‌ అనగానే గుర్తొచ్చేది సూర్య (Suriya)- జ్యోతిక జోడీనే. వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల ఘనంగా వేడుక చేసుకున్నారు. ఆ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆస్మాన్’.




