
Harish Rao | సీఎం రేవంత్ రంగనాయక సాగర్ దగ్గర హరీశ్ రావుకు ఫాం హౌస్ ఉందంటడు. ఓ బ్రహ్మాండమైన ఫాం హౌస్ కట్టుకున్నడని అన్నడు. కనీసం అక్కడ ఉచ్చ పోసేందుకు రూం కూడా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ తనపై తన కుటుంబంపై చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అది వ్యవసాయ భూమి. ఇది నా 2018 ఎలక్షన్ అఫిడవిట్, 2023 అఫిడవిట్. వీటిలో స్పష్టంగా నా వ్యవసాయ భూమి వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నయి. ఈ రోజు ఒక గుంట భూమి కూడా ఎక్కువ లేదు.. తక్కువ లేదు. ప్రజలకు స్పష్టంగా పబ్లిక్ డొమైన్లో పెట్టింది. 2018, 2023 నా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్ ప్రతీ సంవత్సరం నేను ఏం కొన్నా అనేది ఇన్‌కం టాక్స్ రిటర్న్స్‌లో కూడా స్పష్టంగా ఫైల్ చేశానన్నారు. ఈ భూమి మీద రెండేళ్ల నుంచి విజిలెన్స్, ఇంటెలిజెన్స్‌ను పెట్టి మా జిల్లా కలెక్టర్‌ను ఇప్పటికీ హైదరాబాద్‌కు 50 సార్లు పిలిచి ఉంటరు. కలెక్టర్లను, ఆర్డీవోలను, సర్వేయర్లను 50 సార్లు పిలిచి ఉంటరు హైదరాబాద్‌కు. విజిలెన్స్ ఎంక్వైరీలు, సీఐడీ ఎంక్వైరీలు పోలీసులు తిరుగుతనే ఉంటరు. నేను మా జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీవోకు, ఎమ్మార్వోకు ఒక చాలన్ కట్టి నా భూమి కొలిచి హద్దు బంద్‌లు పెట్టండని ఏడీ సర్వేకు చలాన్ కట్టిన. గవర్నమెంట్ కొలిచి నేను కొనుక్కున్న దాని కంటే నాకు ఒక గుంట తక్కువంది అని ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ సర్వే చేసి సంతకం పెట్టి నాకు ఇచ్చిన డాక్యుమెంట్ ఇదన్నారు. ఇక ఆ రోడ్డు వేసింది నా కోసం కాదు. నాకంత అవసరం కూడా లేదు. అక్కడ చంద్లాపూర్ గ్రామానికి సిరిసిల్ల రోడ్డుకొచ్చే నక్ష రోడ్డు ఆ రోజు ఆ రిజర్వాయర్‌లో మునిగిపోయింది. మునిగిపోతే జిల్లా పరిషత్ తీర్మానం చేసి జెడ్పీ చైర్మన్, అప్పటి సర్పంచ్ లెటర్ వారందరి కోరిక మేరకు మాకు సిరిసిల్లకు రోడ్డు లేకుండా అయితుంది. మా పాత రోడ్డు అందులో మునిగిపోయిందని చెప్తే..అది ఈయన మున్సిపల్ డిపార్ట్మెంట్ వేసిందని కూడా తప్పు చెప్పిండు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లే.. వాళ్ల చెరువులో రిజర్వాయర్ పోయింది కనుక ఆ రోడ్డు వేసింది ఇవ్వడం జరిగింది తప్ప అందులో ఎవరి కోసమో చేసింది లేదన్నారు. రేవంత్ రెడ్డి తనపై తన కుటుంబంపై చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా సమాధానం ఇచ్చిన హరీష్ రావు https://t.co/WVP8AexTMs pic.twitter.com/LkCtoja4Ck — Telugu Scribe (@TeluguScribe) September 16, 2026



