
సిద్ధమైన 27 దేశాల ఐరోపా కూటమి బ్రసెల్స్‌: చిన్నారుల సోషల్‌ మీడియా వాడకంపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 27 ఐరోపా దేశాల కూటమి కూడా ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా వినియోగాన్ని నిషేధించడంతో పాటు టీనేజర్లకూ పరిమితులు విధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ పలు ప్రతిపాదనలు వెల్లడించారు. ‘‘సాంకేతికత శక్తి అపారమైందని, దానిని వెనక్కి తీసుకెళ్లడం అసాధ్యమని అనేకమంది భావిస్తున్నారని తెలుసు. దాంతో నేను ఏకీభవించను. వ్యసనానికి గురయ్యే ఫీచర్లు అవసరం లేదు. పిల్లలు మరింత తీవ్ర విషయాలకు ఆకర్షితులయ్యేందుకు.. అమ్మాయిల ఫొటోలను ఏఐ సాయంతో అసభ్య చిత్రాలను సృష్టించడం కోసం ఉపయోగించడాన్ని మనం అంగీకరించాల్సిన అవసరం లేదు’’ అని బ్రసెల్స్‌లో జరిగిన ఈయూ వార్షిక సమావేశంలో ఉర్సులా పేర్కొన్నారు. ఆమె ప్రతిపాదనల ప్రకారం.. 13-15 ఏళ్ల వయసు పిల్లల కోసం వారి సంరక్షకుల పర్యవేక్షణలో సోషల్‌ మీడియాలో మినీ ఖాతాలు తెరచుకోవచ్చు. వాటిలోని ఫీచర్లు, యాక్సెస్‌ చేసే సమయంపై మాత్రం పరిమితులు ఉంటాయి. 15-18 ఏళ్ల వయసు వారికీ ప్రత్యేకంగా సురక్షితమైన డిజైన్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు రూపొందించాల్సి ఉంటుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




