
జయంతి గదిలో ఉండగా శేఖర్ వెళ్తాడు. తప్పంతా నాదే.. నన్ను క్షమించు.. ఇకపై అలా చేయను.. నీకు నచ్చినట్టుగా ఉండు.. కానీ నా భార్యగా నా జీవితంలోనే ఉండు అని రిక్వెస్ట్ చేస్తాడు. జయంతి ఎంతకీ మాట వినదు. దీంతో ఆమె కాళ్లు పట్టుకుంటాడు. వదులు అని జయంతి అంటే.. ఒప్పుకునే వరకు వదిలి పెట్టను అని శేఖర్ పట్టుబట్టుకుని కాళ్లు పట్టుకుని కూర్చుంటాడు. దీంతో జయంతి ఒప్పుకుంటుంది. చివరకు ఇద్దరూ ఒక్కటి అవుతారు. అలా చేయమని చక్రి సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటించి శేఖర్ తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు. థాంక్యూ బ్రదర్.. మీరు ఇచ్చిన సలహాతోనే ఇదంతా జరిగింది.. నీకు ఏ సాయమైనా నేను చేస్తా అని చక్రితో శేఖర్ అంటాడు. నాకు ఏ సాయం వద్దు.. మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు అని చక్రి అంటాడు. టచ్ చేశావ్ బ్రదర్.. నువ్వు మంచివాడివి కాబట్టే.. నీకు అంతా మంచే జరుగుతోంది.. మహాలక్ష్మీ లాంటి భార్య వచ్చింది.. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి వెళ్లిపోతాడు శేఖర్. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మై సన్ అని నారాయణ అంటాడు. ఇక అందరూ ఖుషీగా ఉంటే పెద్ది కోపంగా చూస్తాడు. మీరంతా కోరుకున్నట్టు, అనుకున్నట్టు, ప్లాన్ చేసినట్టుగానే నా ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా.. మీ అందరికీ సంతోషమేనా? ఇంకేంటి వీధిలో వారందరికీ చెప్పు.. తాయారు అత్త శాపం ఫలించిందని చెప్పండి.. ఆమె శాంతిస్తుంది.. మన పెదనాన్న సంతోషంగా దేవుడ్ని ప్రార్థిస్తాడు.. ఈ ఇంట్లో నా పెళ్లి కాదు.. ఆ తర్వాత మీకు ఎవ్వరికీ కాదు.. అందరం ఇలానే ఉండిపోదాం.. అని అంటాడు పెద్ది. రేయ్ పెద్దోడ.. ఎవరికి ఎవరితో పెళ్లి జరగాలి.. ఎవరు విడిపోవాలి అని ముందే రాసి ఉంటుంది.. మన చేతుల్లో ఉండదు రా అని నారాయణ అంటాడు. అవును ఇదంతా చేసింది నేనే.. ఈ గ్యాంగ్‌కి లీడర్ నేనే.. నేను కోరుకున్నాను.. ప్రయత్నించాను.. చివరకు సక్సెస్ అయ్యాను.. ఇందులో ఎవ్వరి తప్పు లేదు.. అంతా నేనే చేశాను.. అని చక్రి అంటాడు. ఎంత ధైర్యంగా చెబుతున్నావ్ రా అని పెద్ది అంటాడు. నిజాన్ని నిజాయితీగా చెప్పడానికి ధైర్యం ఉండాలి.. నాకుంది.. నేను చెప్తున్నాను.. అంతా నేనే చేశాను.. ఆ జయంతిని నువ్వు చేసుకోవడం మాకు నచ్చలేదు.. మీ ఇద్దరినీ విడగొట్టి.. ఆ ఇద్దరినీ కలిపాను అని చక్రి అంటాడు. నువ్వు తల్చుకుంటే ఏదైనా చేస్తావ్ రా అని పెద్ది అంటాడు. మరి నువ్వు మాత్రం ఏదైనా చేయొచ్చా? శైలు ఏదో అనేసిందని, నువ్వు ఇలా పెళ్లికి రెడీ అవుతావా? నువ్వు బాధ పడి.. మా అందరినీ బాధ పెడతావా? అని కేశవ అందుకుంటాడు. మన కుటుంబం ముక్కలు అవుతుందని నీకు ఎంత చెప్పినా వినలేదు.. చివరకు మాకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నావా? అని కేశవ అంటాడు. జాతకాలు బాగా లేవని నువ్వు బయటకు వెళ్లావ్.. నువ్వు లేకపోతే మేం ఉండలేం అని నీకు ఆ రోజే చెప్పాం కదా అని చక్రి అంటాడు. నాకు పెళ్లి కాక.. మీరు చేసుకోక.. ఇలానే ఉంటే సంతోషంగా ఉంటానా? అని పెద్ది నిలదీస్తాడు. రేయ్ ఈ జయంతి.. ఈ సంబంధం అన్నీ వేరు రా.. తన భర్తను కాళ్ల బేరానికి తీసుకు రావడానికి నిన్ను పావులా వాడుకుంది.. ఈ ఎంగేజ్మెంట్ని ఓ వేదికలా చేసుకుంది రా అని నారాయణ అంటాడు. ఈ పెళ్లి తప్పినందుకు సంతోషంగా ఉండు రా అని నారాయణ అంటాడు. నేను ఎప్పుడూ నా సంతోషం గురించి ఆలోచించలేదు. నా పెళ్లి కాకపోతే నా తమ్ముళ్లు కూడా ఇలానే ఉండిపోతారని బాధ పడుతున్నా అని పెద్ది అంటాడు. నువ్వు అలా అనుకుంటే నేను చచ్చినా పెళ్లి చేసుకోను అని అంటాడు కేశవ. చేసుకోకు ఇలానే ఉండు అని పెద్ది తిడతాడు. అందరం ఇలానే బ్రహ్మచారుల్లా ఉండిపోదాం అని కోపంగా వెళ్లిపోతాడు. కేశవ అన్న మాటల్ని తల్చుకుంటూ శైలు రూంలో గడియ పెట్టుకుని బాధ పడుతూ ఉంటుంది. ఏంట్రా ఏమై ఉంటుంది అని సురేష్, వరాలు మాట్లాడుకుంటారు. ఏదో పెద్ద గొడవే జరిగిందని అనిపిస్తోంది.. ఈ టైంని మనం వాడుకుందాం.. వాడి గురించి చెడుగా చెప్పి.. మన దారికి తెచ్చుకుని.. మనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేసి పంపించేద్దాం అని వరాలు, సురేష్ మాట్లాడుకుంటారు. ఇంతలో ఫోన్ కోసం రూం నుంచి బయటకు వస్తుంది శైలు. కేశవకి ఎంత ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో శైలుకి కోపం వస్తుంది. ఏమైందే నీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా.. నిన్ను తిట్టాడా? నిన్ను పక్కన పెట్టేశాడా? నువ్వే కదా వెంటపడి మరీ లవ్ చేశావ్.. నువ్వంటే వాడికి అలుసు.. చులకన.. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లయ్యాక నిన్ను ఎలా చూస్తాడో మరి.. అని వరాలు ఎక్కిస్తుంటాడు. దీన్ని వంటింటి కుందేలుగా మార్చేస్తాడు.. అని సురేష్ అంటాడు. ఇక ఇద్దరూ కలిసి శైలు బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తుంటారు. ఇంకోసారి ఆలోచించుకో.. వాడ్ని మర్చిపో అని చెప్తుంది శైలు. మీరు ముందు ఈ రూంలోంచి వెళ్లిపోండని శైలు అంటుంది. ఇంకో వైపు పెద్ది ఏమో భన్సీ ఇంటికి వెళ్లి ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.