
ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో పలు వివాదాలకు కారణమైన వైరల్‌ ఫొటోపై బాలీవుడ్‌ నటి మందాకిని (Mandakini) వివరణ ఇచ్చారు. కొన్నేళ్ల క్రితం అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పక్కన ఆమె కూర్చున్న ఒక ఫొటో బయటకు రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై తాజాగా నటి స్పందించారు. ఒక షో కోసం దుబాయ్ వెళ్లానని, అక్కడ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆ ఫోటో తీశారని తెలిపారు. అయితే తాను కావాలని దావూద్‌ను కలవలేదని, తన ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోయిందని చెప్పారు. ఆ ఫొటో కారణంగా తన కెరీర్‌ తీవ్రంగా దెబ్బతిందని మందాకిని పేర్కొన్నారు. ‘‘నేను ఓ షో కోసం దుబాయ్‌కు వెళ్లాను. అక్కడ అనుకోకుండా క్రికెట్‌ స్టేడియంకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో దావూద్‌తో మాట్లాడాను. అంతేగానీ, ఆయన నన్ను దుబాయ్‌కి ఆహ్వానించలేదు. ఒక నటిగా మనం ఎవరితో మాట్లాడాలన్నది మన చేతుల్లో ఉండదు. ఎవరెవరో వచ్చి పలకరిస్తుంటారు. ఇది కూడా అలా జరిగిందే. కానీ, ఆ ఒక్క ఫొటో అంత వివాదం అవుతుందని అనుకోలేదు. అప్పట్లో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియలేదు. ఈ వ్యవహారంపై అప్పుడే వివరణ ఇచ్చినప్పటికీ, వివాదం మాత్రం అలాగే కొనసాగింది. 1980 కాలంలో బాలీవుడ్ సినిమాలకు అండర్‌ వరల్డ్ నుంచి నిధులు అందుతున్నాయనే విషయంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. సినిమాలు, వార్తల ద్వారానే దాని గురించి తెలుసుకున్నా’’ అని మందాకిని ఓ మీడియా ఇంటర్వ్యూలో వివరించారు. నటి మందాకిని 1985లో రాజ్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ చిత్రంతో కథానాయికగా సినీరంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇక, తెలుగు ప్రేక్షకులకూ ఆమె సుపరిచతమే. సింహాసనం, భార్గవ రాముడు చిత్రాల్లో మెప్పించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. గౌతమ్‌ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక (Rashmika) ప్రధానపాత్రలో సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) జీవిత కథ తెరకెక్కనుంది.





