
రెస్టారెంట్లో జరిగింది తల్చుకుని కోపంతో రగిలిపోతుంటుంది శ్రుతి. అప్పుడే రవి ఇంటికి వస్తాడు. నీతో మాట్లాడాలి అని శ్రుతి అంటుంది. సరే చెప్పు అని రవి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. నీకు ఏం జరిగిందో తెలీదా? దేని గురించి మాట్లాడతానో తెలీదా? నీ భార్యని ఎవరో ఏదో అంటే కూడా పట్టించుకోవా? అని శ్రుతి స్టార్ట్ చేస్తుంది. అది రెస్టారెంట్.. అక్కడ మనం పని చేస్తున్నాం.. గొడవల్ని అలా పెంచుకోకూడదు అని సైలెంట్‌గా ఉన్నా.. అయినా నువ్వు అలా చేయడం తప్పు అని శ్రుతిని అంటాడు రవి. నాది తప్పు అంటావా? అని శ్రుతి ఫైర్ అవుతుంది. నువ్వు అలా సూప్ పోయడం తప్పు.. నీ వల్ల రెస్టారెంట్‌కి బ్యాడ్ నేమ్ వచ్చింది.. బిజినెస్ పోయింది.. నీతూకి నష్టం వచ్చింది అని అంటాడు రవి. నా గురించి బాధ లేదు కానీ నీకు ఆ రెస్టారెంట్, ఆ నీతూ గురించి బాధ ఉందా? అని శ్రుతి ఫైర్ అవుతుంది. నువ్వు కూడా అక్కడ పని చేయొద్దు, నేను నీకు రెస్టారెంట్ పెట్టిస్తా అని శ్రుతి అంటుంది. అంటే నేను దేనికీ పనికి రాను అని అంటున్నావా? అని రవి అంటాడు. ఆ టైంకి నీతూ ఫోన్ చేస్తుంది. ఈ టైంలో ఇది ఎందుకు ఫోన్ చేస్తోందని శ్రుతి ఫైర్ అవుతుంది. పక్కనే శ్రుతి ఉందా? లౌడ్ స్పీకర్లో పెట్టు రవి.. అని అంటుంది నీతూ. సారీ శ్రుతి.. అక్కడ నిన్ను అర్థం చేసుకోలేకపోయా.. కానీ ఇంటికి వచ్చాక ఆలోచిస్తే.. ఓ అమ్మాయిగా నీకు అక్కడ నేను సపోర్ట్ చేయాల్సింది.. తప్పు నాదే అని అంటుంది నీతూ. ఆ సారీతో, ఆ మాటలతో శ్రుతి కూల్ అవుతుంది. జెన్యూన్‌గా చెప్తున్నావా? నాలాంటి ఎంప్లాయ్‌ని పోగొట్టుకోవడం ఇష్టం లేక చెబుతున్నావా? అని శ్రుతి అంటే.. నీతూ నవ్వేస్తుంది. లేదు జెన్యూన్‌గానే సారీ చెప్తున్నా అని నీతూ అంటుంది. దీంతో సరే అని ఫోన్ పెట్టేస్తుంది శ్రుతి. చూశావా? నీ ఓనర్‌కి అర్థమైంది.. ఆమె ఫోన్ చేసి సారీ చెప్తోంది.. నువ్వు మాత్రం చెప్పలేదు అని శ్రుతి అంటుంది. నేను కూడా సారీ అని రవి అంటాడు. ఆమె చెప్పిందని అంటున్నావా? అని శ్రుతి అంటే.. ఆమె చెప్పకపోయినా చెప్పేవాడ్ని అని రవి అంటాడు. ఇంకోసారి ఇలా జరిగితే అని శ్రుతి అంటే.. వాళ్ల మొహం పచ్చడి చేస్తా అని రవి అంటాడు. అసలు మన రెస్టారెంట్లో ఓ బెల్ పెడదాం.. ఇలాంటి ఇష్యూ వస్తే అమ్మాయిలకు అలారం లా ఉంటుందని శ్రుతి చెప్తుంది. ఐడియా బాగుందని రవి అంటాడు. బాలు ఇంకా రాలేదా అమ్మా అని సత్యం అడుగుతాడు. ఎక్కడ తాగి పడిపోయాడో అని ప్రభావతి అంటుంది. అలాంటిదేం ఉండదు.. వాడు వస్తాడు అని సత్యం అంటాడు.. అంతలోనే బాలు వస్తాడు. బాలుని చూసి మీనా సంతోషి అంతలోపే కోపంగా చూస్తుంది. అమ్మ నాకు కాఫీ పెట్టి ఇవ్వు అని అడుగుతాడు బాలు. నీ భార్య ఉంది కదరా అని ప్రభావతి అంటే.. నువ్వే పెట్టివ్వు అని అంటాడు బాలు. నువ్వు పెట్టు అమ్మా అని సత్యం అంటే.. పెడదామనే అనుకున్నా.. కానీ అమ్మ చేతి కాఫీ తాగాలని అనుకుంటున్నాడు కదా అని కౌంటర్ వేస్తుంది మీనా. మాట వినని వాళ్లకి, పౌరుషంగా మందు తాగే వాళ్లకి నేను కాఫీ పెట్టను అని మీనా, నీ చేతి కాఫీ కంటే మా అమ్మ చేతి కషాయమే మేలు అని బాలు అంటాడు. నా చేతి కాఫీ కషాయం లా ఉంటుందా?.. నేను ఆ రోజుల్లో ఎంత బాగా చేసేదాన్ని అండి అని సత్యంని ప్రభావతి అడుగుతుంది. నువ్వు ఏనాడైనా కాఫీ ఎలా ఉందని అడిగావా? చేతిలో పెట్టి.. బాగుందని నువ్వే చెప్పేదానివి.. నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని.. నేను బాధ పడుతూ తాగేవాడ్ని అని సత్యం కౌంటర్లు వేస్తాడు. నువ్వు రెడీ అయి రా.. ఎవరు కాఫీ పెడితే నీకేంట్రా అని బాలుని తిట్టి పంపిస్తాడు సత్యం. ఇంకో వైపు రోహిణి ఏమో ప్రభావతి మాటల్ని తల్చుకుని బాధ పడుతుంది. అంతలో మనోజ్ నిద్ర లేస్తాడు. దగ్గుతూ ఉంటాడు. మా అమ్మ ఎక్కడ.. నువ్వు నాతో మాట్లాడకు అని అంటాడు మనోజ్. మీ అమ్మ బద్దకానికి అడ్రస్.. అనే బుక్ రాస్తోందని రోహిణి కౌంటర్లు వేస్తుంది. నీకు ఏం కావాలో చెప్పు.. నేను చేసి తీసుకుని వస్తా అని రోహిణి అంటుంది. ఇక కిచెన్‌లోకి వెళ్లి మనోజ్ కోసం రాగి జావ చేస్తూ ఉంటుంది. ఎటు వెళ్తున్నారండి అని సత్యంని ప్రభావతి అడుగుతుంది. సత్యవతి దగ్గరకు అని సత్యం కౌంటర్లు వేస్తాడు. ఏంటండి అని ప్రభావతి అంటే.. రంగా దగ్గరకు అని సత్యం అంటాడు. ఇక ఇంతలో మీనాని పిలిచి.. కాఫీ అని అంటుంది ప్రభావతి. కాసేపు ఆగండి అత్తయ్య అని మీనా అంటుంది. ఎందుకు వర్జ్యం ఉందా? అని ప్రభావతి అంటే.. లేదు రోహిణి వంటగదిలో ఉంది.. ఆమె తన భర్తకు జ్వరం వచ్చిందని రాగి జావ చేస్తోంది అని మీనా చెప్తుంది. దీంతో కోపంతో ఊగిపోతుంది ప్రభావతి. ఏం చేస్తున్నావే అని ప్రభావతి అడుగుతుంది. రాగి జావ అత్తయ్య అని రోహిణి చెబుతుంది. ఏమేం కలిపావే.. ఏం మందు పెట్టావే.. నా కొడుకుని నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావా? అని అడుగుతుంది ప్రభావతి. రాగి పిండి, ఉప్పు వేశానంతే అత్తయ్య అని రోహిణి అంటుంది. ఎప్పుడూ ఇటు వైపు కూడా రావు.. ఇప్పుడేంటి ఇంత ఓవర్ చేస్తున్నావ్.. నా కొడుకుని నీ వైపు లాక్కోవాలని చూస్తున్నావా? అని వంట గది నుంచి రోహిణిని లాక్కొస్తుంది ప్రభావతి. మీనా అడ్డుకోబోతోంటే.. ప్రభావతి తిడుతుంది. అంతటితో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది.





