
‘నా తమ్ముడు మేఘాంశ్‌ని నేను ఎలా చూడాలనుకున్నానో అలాంటి పాత్రలోనే కనిపించాడు. ‘ఆస్మాన్‌’ టీజర్‌ నాకు చాలా నచ్చింది’’ అన్నారు హీరో మంచు మనోజ్‌. ఆయన, శివాత్మిక రాజశేఖర్‌ ముఖ్య అతిథులుగా బుధవారం హైదరాబాద్‌లో ‘ఆస్మాన్‌’ టీజర్‌ ఆవిష్కరణ వేడుక జరిగింది. దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్‌ శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రాయంచ కథానాయిక. రామ్‌ నందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్‌ కొండారు, శ్రీకాంత్‌ మన్నెం నిర్మాతలు. మేఘాంశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్‌ని విడుదల చేశారు. ‘‘మీరు ఇప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నారు. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి. దానికి మార్గం నేనే. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు. అదే నిజం...’’ అనే మాటలతో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, అరబిక్‌ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రవివర్మ, కమల్, కేశవ్‌ దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్‌ తదితరులు నటిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



