
పశ్చిమబెంగాల్లోని నాదియా జిల్లాలో పోలీసుల సమక్షంలోనే భాజపా కార్యకర్తలు తనపై కోడిగుడ్లతో దాడిచేశారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు.
© 2026 nimisham.in

పశ్చిమబెంగాల్లోని నాదియా జిల్లాలో పోలీసుల సమక్షంలోనే భాజపా కార్యకర్తలు తనపై కోడిగుడ్లతో దాడిచేశారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు.
సమరయోధురాలిలా ఎదుర్కొన్నానన్న ఎంపీ కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని నాదియా జిల్లాలో పోలీసుల సమక్షంలోనే భాజపా కార్యకర్తలు తనపై కోడిగుడ్లతో దాడిచేశారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. బుధవారం తాను పాల్గొన్న కార్యక్రమం వద్దకు పదిమంది భాజపా కార్యకర్తలు వచ్చి గుడ్లు విసరడం మొదలుపెట్టారని తెలిపారు. తనపై ఇలాంటి దాడి జరగవచ్చని ఇటీవల సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తంచేసినప్పుడు ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ- ‘జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా! మైలార్డ్‌.. నేనొక సమావేశం కోసం నా నియోజకవర్గానికి వచ్చాను. పోలీసులకు సమాచారం ఇచ్చాను. వాళ్ల సాయంతో భాజపా కార్యకర్తలు నాపై గుడ్లు విసిరారు. మీరు చెప్పిన సలహాను పాటించాను. స్వాతంత్య్ర సమరయోధులు తూటాలను ఎలా ఎదుర్కొన్నారో నేను ఈ గుడ్లను అలా భరించాను. పోలీసుల సమక్షంలోనే నాపై ఇలా గుడ్లు విసరడం కోర్టు ధిక్కరణ చర్య’ అని ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆ వీడియోలో ఆమె ముఖంపై గుడ్డు పెంకులు కనిపించాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







