
కమల్ బావ బాధ పడుతుంటే నేను చూడలేకపోతున్నానని పల్లవి చెబుతుంది. నువ్వింత గొప్పగా ఆలోచిస్తున్నావని అనుకోలేదు పల్లవి అంటుంది అవని. కమల్ని ఆ మూడ్‌లోనుంచి బయటకు తీసుకురావాలంటే అదే కరెక్ట్ అంటూ.. నీ ప్రయత్నం నువ్వు చేయమని చెబుతుంది. ఆపై అవని వెళ్లిపోగా.. మీనాక్షి మాత్రం పల్లవితో మాట్లాడుతుంది. "అమ్మా పల్లవి. నీ బాధను నువ్వే దిగమింగుకుని, నీ భర్త బాధ పడకుండా చేయాలని చూస్తున్నావ్. చాలా సంతోషంగా ఉందమ్మా. బాధలో ఉన్న నీకు ధైర్యం చెప్పాలని వస్తే.. నువ్వే మాకు ధైర్యం చెప్పే పరిస్థితిలో ఉన్నావు." అంటూ కూతురి చేయి తీసుకుని ముద్దాడుతుంది మీనాక్షి. ఆపై వెళ్లిపోగా.. మీనాక్షి కిస్ చేసిన చేతిని పల్లవి తుడుచుకుంటుంది. దీన్ని చూస్తేనే నాకు చిరాకు వస్తుందంటే.. మళ్లీ టచింగ్ ఒకటంటూ ఉసూరుమంటుంది. "నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుంకుంటుంది.. ఆ తింగరోడి కోసం కాదు. ఇంకెవరి కోసమో కాదు. నేను ఎదగాలి. అవనిని తొక్కాలి. అదే నా టార్గెట్. దానికన్నా ముందు అత్తయ్యకు మామయ్య చనిపోయారన్న నిజం తెలిసేలా చేయాలి. ఆవిడ కూడా చచ్చేట్లు చేయాలి. నా కాన్సన్ట్రేషన్ మొత్తం దానిమీదే ఫోకస్ చేస్తానని" అనుకుంటుంది పల్లవి. మరోవైపు అక్షయ్, కమల్, శ్రీకర్లు తండ్రి చితాభస్మం తీసుకుని ఓ నది వద్దకు వెళ్తారు. ముగ్గురూ కన్నీళ్లు పెట్టుకుంటూనే.. నీళ్లలోకి వస్తారు. అప్పుడే కమల్ మాట్లాడుతూ.. ఆరోజు నువ్వు పైనుంచి కింద పడిపోవడం వల్లే ఈరోజు నువ్వు మాకు లేకుండా పోయావని ఏడుస్తాడు. ఆరోజు నిన్ను చంపాలని అనుకుంది ఎవరో తెలిస్తే.. వాళ్లను చంపి ఆ అస్తికలు కూడా ఇలాగే నిమజ్జనం చేసేస్తాం నాన్నా అంటూ ప్రతినబూనుతాడు. అయితే అక్షయ్ స్పందించి.. రేయ్ కమల్.. చితాభస్మాన్ని ఇలా గంగలో కలిపేటప్పుడు ప్రశాంతమైన మనసుతో కలపాలని పంతులుగారు చెప్పారు కదా అంటాడు. శ్రీకర్ కూడా అవునురా కమల్ అనగా.. ముగ్గురూ కలిసి తండ్రి అస్తికలను నదిలో నిమజ్జంనం చేస్తారు. ఆపై అక్షయ్.. తండ్రికి దండం పెట్టుకుంటూ ఏవైనా తెలియక తప్పులు చేస్తే క్షమించమని కోరుకుంటాడు. మీ కోరికల్ని, ఆశయాల్ని మేము ఎప్పటికీ మర్చిపోము నాన్నా అని శ్రీకర్ అంటాడు. ఆ తర్వాత పార్వతి హాల్లో కూర్చుని దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి తన అత్తగారిని చూసి.. అత్తయ్యకు నిజం చెప్పేస్తే, విషం ఇచ్చి చంపాల్సిన అవసరం లేకుండా గుండాగి చస్తుందని మనసులో అనుకుంటుంది. కానీ అప్పుడే అవని చెంపపై కొట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తు తెచ్చుకుని.. చెప్పాలని ట్రై చేసినందుకే చెంప పగులగొట్టింది, ఇక నేనే చెప్పానని తెలిస్తే అవని ప్రాణం తీస్తుందని అనుకుంటుంది. అత్తయ్యకు తెలిస్తే వెంటనే అవనికి నామీదే అనుమానం వస్తుందని భావించి.. తను చెప్పకుండానే అత్తయ్యకు నిజం తెలిసేలా చేయాలని అనుకుంటుంది. మరోవైపు పార్వతి వద్దకు భానుమతి వచ్చి.. ఏంటే అదోలా ఉన్నావని అడుగుతుంది. నా కొడుకు రాజేంద్రప్రసాద్ ఎప్పుడొస్తాడనే కదా నువ్వు ఆలోచిస్తున్నావని అడగ్గా.. అవునత్తయ్యా.. వస్తారనుకున్న ఆయన రాలేడని చెప్తుంది పార్వతి. ఆయన్ను చూడాలని చాలా ఆశగా ఉందని చెప్పగా.. దూరంగా ఉండి ఉంటున్న పల్లవి మనసులో " మీ ఆయన్ను చూడాలనుకుంటే నువ్వు కూడా చచ్చి పైకెళ్లాలి" అంటుంది. మరోవైపు భానుమతి.. "నేను కూడా చాలా ఎదురు చూశానే. అక్షయ్, అవనిలు ఇంకా ఏదో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్తున్నారు. వాడు ఎప్పుడు వస్తాడో తెలియడం లేదు" అంటుంది. అమ్మమ్మ మాటలు విన్న పల్లవి.. కాలి బూడిదవ్వడం, పిండప్రదానం చేయడం వంటి ఫైనల్ ట్రీట్మెంట్లు కూడా అయిపోయాయని అనుకుంటుంది. అప్పుడే లోపలికి వస్తూ.. అమ్మమ్మా, అమ్మమ్మా అంటుంది. ఏంటే.. ఏదో చెప్పాలని వచ్చావు, సైలెంటుగా నిలబడ్డావని అని భానుమతి అనగా.. మామయ్యను తీసుకురావడానికి టైం పడుతుంది కానీ, మీరు మామయ్యతో మాట్లాడడానికి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అంటుంది పల్లవి. మామయ్య మాట్లాడుతున్నారని మొన్న కమల్ బావ చెప్పాడు కదమ్మమ్మా అంటుంది. అక్కడితో ఆగుకుండా టెన్షన్ పడే బదులు ఫోన్ చేయడం మంచిది కదా అంటూ.. ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అని సూచిస్తుంది పల్లవి. దీంతో భానుమతి.. "నిజమేనే, నా మట్టి బుర్రకు ఆ ఆలోచనే రాలేదు పార్వతి, ఇప్పుడే రాజేంద్రతో మాట్లాడదాం, ఆశ్రమం నెంబర్ ఉంటే ఫోన్ చెయ్యవే" అంటుంది. మీ బాధ చూడలేకే ఫోన్ చేసి మాట్లాడండని చెప్తున్నాను అత్తయ్యా అంటుంది పల్లవి. ఏంటే అలా ఆలోచిస్తున్నావ్, త్వరగా ఫోన్ చెయ్యమని పార్వతికి సూచిస్తుంది భానుమతి. దీంతో నా దగ్గర కూడా నెంబర్ లేదే అని పార్వతి అనగా.. నీ దగ్గరుందా అని పల్లవిని అడుగుతుంది భానుమతి. ఈ ఆలోచన నాకిప్పుడే వచ్చింది, లేదంటే ముందే తీస్కుని మీకిచ్చేదాన్ని మనసులోనే అనుకుంటుంది పల్లవి. కానీ పైకి మాత్రం నా దగ్గర కూడా లేదు అమ్మమ్మా అంటుంది. దీంతో అక్షయ్ రాగానే నెంబర్ తీస్కుని మాట్లాడదాం, పదా బోన్ చేద్దాం కానీ అంటూ కోడల్ని వెంట తీసుకువెళ్తుంది. ఆపై పల్లవి.. అక్షయ్ బావగారు వచ్చాకా బాంబ్ పేలుతుంది, ఆ బాంబ్ పేలడంతో వీళ్ల గుండెలు ఆగిపోవడం కాయమని భావిస్తుంది. మరోవైపు ఎవరో ఒకావిడ అవని వాళ్ల ఇంటికి వస్తుంటుంది. గేటు వద్దకు వచ్చేసరికే అక్షయ్, కమల్, శ్రీకర్ల కారు వచ్చి ఆగుతుంది. దీంతో శ్రీకర్ కిందకు దిగి.. అక్కా మీరిక్కడ ఉన్నారేంటని అడుగుతాడు. దీంతో ఆమె.. మిమ్మల్ని కలవడానికే వచ్చాను బాబూ అంటుంది. ఎవర్రా తను అని అక్షయ్ అడగ్గా.. నా ఫ్రెండ్ సిస్టర్ అన్నయ్యా అని చెప్తాడు. మీరు నా కేసు వాదిస్తానన్నారు, నాకు న్యాయం జరిగేలా చేస్తానన్నారని అంటుంది. కానీ మీరు కోర్టుకే రావడం లేదని, నా ఇల్లు పోతుందేమో, నేను నా పిల్లలు వీధిన పడిపోతామేమోనని భయంగా ఉందని చెప్తుంది. దీంతో అక్షయ్.. బాధ పడకమ్మా అని ఆమెకు ధైర్యం చెబుతూనే.. రేయ్ శ్రీకర్ ఏంట్రా ఇది అని అడుగుతాడు. దీంతో శ్రీకర్.. ఈవిడ భర్త చనిపోవడంతో, తన ఇంటిని బంధువులు లాగేసుకున్నారని చెప్తాడు. ఈమెకు న్యాయం చేయడం కోసం నేను ఈ కేసు తీస్కున్నానని అంటాడు. కేసు అయితే హియరింగ్‌కి వస్తుంది కానీ, మనం ఇప్పుడున్న సిట్యువేషన్లో కోర్టుకు వెళ్లలేకపోతున్నాను అన్నయ్యా అని చెప్తాడు. దీంతో కమల్ కల్పించుకుని.. అన్నయ్యా కోర్టు వాయిదాలకు వెళ్లకపోతే జడ్జిగారు అవతలి పార్టీ వారికి ఫేవర్‌గా తీర్పు ఇస్తారేమో కదా అన్నయ్యా అంటాడు. మీరు వాయిదాలకు రాకపోతే.. నేను, నా పిల్లలు అన్యాయం అయిపోతాం బాబూ అంటుంది. దీంతో అక్కా ప్లీజ్ అంటూనే.. నీళ్లు నములుతాడు. దీంతో అక్షయ్ వచ్చి.. రేయ్ శ్రీకర్ మనం బాధలో ఉన్నామని, మనల్ని నమ్ముకున్న వాళ్ల బాధ పెట్టకూడదురా అంటాడు. కమల్ కూడా అవునన్నయ్యా అంటాడు. పాపం ఆవిడని చూస్తే.. చాలా కష్టాల్లో ఉన్నారని అనిపిస్తోందని, నువ్వే ఆమె సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించు అని చెబుతాడు. దీంతో శ్రీకర్ సరేనని.. రేపు నేను కోర్టుకు వస్తాను, మీరిప్పుడు వెళ్లండని వచ్చిన ఆవిడతో చెప్పి పంపిస్తాడు. ఆపై వారు ముగ్గురూ ఇంట్లోకి రాగా.. అవని వచ్చి ఏవండీ అస్తికలు కలిపేశారా అంటుంది. హా అని అక్షయ్ అనగానే.. శ్రీరామ్ వాళ్ల అమ్మగారిని అంటుంది. దీంతో కమల్.. వాళ్ల ఇంటి దగ్గర దింపేశాం వదినా అంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత చాలా ప్రశ్నలు అడిగిందని అంటాడు. మరేం చెప్పారని అప్పుడకే అక్కడకు వచ్చిన శ్రియ అడగ్గా.. కమల్ నిజం చెప్పాలనుకున్నాడని, అయితే నువ్విక్కడ ఎలా మేనేజ్ చేశావో, అక్కడ కమల్ చెప్పకుండా నేనలా మేనేజ్ చేశాను వదినా అంటాడు శ్రీకర్. మీరు ఆవిడని మేనేజ్ చేశారు కానీ.. ఇప్పుడు జరగబోయేది ఆపడం మీ వల్ల కాదని పల్లవి మనసులో అనుకుంటుంది. అప్పుడే భానుమతి, పార్వతి వాళ్లున్న చోటుకు వస్తారు. వెంటనే భానుమతి.. రేయ్ అక్షయ్.. నేను మీ అమ్మ నీకోసం వేచి చూస్తున్నాం రా అంటుంది. ఎందుకు నానమ్మ అని అక్షయ్ అనగా.. మీరు మీ నాన్నను తీసుకుని వస్తామని వెళ్లి, ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుందని వచ్చేశారని అంటుంది. ఆయనతో మాట్లాడాలని మీ అమ్మ అంటుందిరా అని చెప్తుంది. నాక్కూడా రాజేంద్రతో మాట్లాడాలని ఉందిరా.. ఒకసారి ఫోన్ కలిపి మా ఇద్దరితో మాట్లాడించరా అని అడుగుతుంది. ఒకసారి డాక్టర్‌కు ఫోన్ చేసి మీ నాన్నకు ఇవ్వమని చెప్పరా అంటుంది. దీంతో ఏం చేయాలో తెలియని అక్షయ్.. ఇప్పుడే కదా నానమ్మ బయట నుంచి వచ్చాం.. కాసేపు ఆగాక చేస్తాం అంటాడు. కొంచెం అలసటగా ఉందంటాడు. దీంతో భానుమతి.. అలసట రావడానికి అదేం బరువులు మోసే పని కాదు కదరా.. ఒకసారి చేసివ్వు అక్షయ్ అంటుంది. మీ నాన్నతో మాట్లాడితే తప్పు నా మనసు స్థిరపడేలా లేదురా అంటుంది పార్వతి. దీంతో అంతా టెన్షన్ పడిపోతుండగా.. పల్లవి మాత్రం మనసులోనే.. ఈ సిట్యువేషన్‌ను హ్యాండిల్ చేయడం మీ వల్ల అయ్యే పని కాదులే అనుకుంటుంది. అత్తయ్యగారు మాట్లాడతానంటున్నారు కదా ఫోన్ చేయండని అవని అంటుంది. నేను మాట్లాడతాను ఇవ్వండంటూ అక్షయ్‌ను ఫోన్ అడుగుతుంది. ఆపై ఏదో నెంబర్‌కు ఫోన్ చేసి "హలో డాక్టర్ గారు.. మా అత్తయ్యగారు, అమ్మమ్మగారు మా మామయ్యతో మాట్లాడతానంటున్నారు. ఒకసారి మా మామయ్యగారికి ఫోన్ ఇస్తారా" అంటుంది. ఆ అవునా అండి, సరే ఓకేనండి అంటూ.. డాక్టర్ గారు ఎవరో పేషెంట్ దగ్గర ఉన్నారంట, ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే మామయ్యగారితో మాట్లాడిస్తారని అంటుంది. సరేనమ్మా అని పార్వతి అనగా.. శ్రీకర్.. వదినా నీతో కొంచెం మాట్లాడాలి. ఇలా వస్తావా అంటూ అవనిని బయటకు తీసుకెళ్తాడు. ఆపై అక్షయ్. కమల్ కూడా వారితోనే వెళ్లిపోతారు. అయితే అక్కడే ఉన్న పల్లవి మాత్రం.. అవని మామయ్యతో మాట్లాడినస్తానని అంటుది, ఏమీ అర్థం కావడం లేదే అనుకుంటుంది. మరోవైపు కమల్.. వదినా అమ్మ, నానమ్మలకు నాన్నతో ఫోన్ మాట్లాడిస్తానని చెప్పావు, లేని నాన్నతో ఎలా మాట్లాడిస్తావని అడుగుతారు. నువ్వు ఎవరితో మాట్లాడించినా అది నాన్న గొంతు కాదని తెలిసిపోతుంది కదా వదినా అంటాడు కమల్. అమ్మకి, నానమ్మకి నిజం తెలిసిపోతుంది కదా వదినా అని శ్రీకర్ అంటాడు. కానీ అవని మాత్రం.. అమ్మమ్మగారికి, అత్తయ్యగారికి ఎలాంటి అనుమానం రాకుండా నేను ఏదోలా మేనేజ్ చేస్తాను.





