
సు దర్శన్‌ వంగల, సాత్విక జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘పాటకు ప్రాణం’. హేమల్‌ తుమ్మపూడి దర్శకత్వం వహిస్తూ... శ్రీరామ్‌ తుమ్మపూడితో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు సురేందర్‌ రెడ్డి, కథానాయకుడు నిఖిల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘అరుదైన కథతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో నేను అరుణ్‌ అనే యువకుడిగా నటిస్తున్నా’’ అన్నారు. ఈ నెల 24 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత హేమల్‌ తుమ్మపూడి తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



