
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సమక్షంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ యోగాసనాలు వేశారు. వేంకటేశ్వర సుప్రభాతం, గోవిందనామ స్మరణతో సీఎం యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతీ యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ వార్త చదివారా: తెలంగాణలో ఉత్సాహంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం