
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Brs ktr fires on cm revanth reddy govt and bjp: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పీక్స్ కు చేరాయి.ఎక్కడ చాన్స్ దొరికిన కూడా నేతలు పదునైన వాగ్బాణాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజేంద్ర నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణుల సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగొలు హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫస్టాఫ్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ అని, అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయ్యిందని సెటైర్లు వేశారు.
ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్లకి నష్టం వస్తుంది.. కానీ ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తుందన్నారు. మహిళల్ని కోటీశ్వరుల్ని చేయ్యడం కాదని, ముందుగా వారికి ఇచ్చిన హమీలు నెరవేర్చాలని కోరారు. అత్తకు రూ. 4 వేలు, కోడలికి రూ. 2,500 ఇస్తామన్న హమీల్ని నెరవేర్చాలన్నారు. అంతే కాకుండా..మూసీ ప్రాజెక్టు కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ భూములను కట్టబెట్టిందని గుర్తు చేశారు. పేదవాళ్ల ఇండ్లు కూల్చడం బీజేపీకి ఇష్టం లేకపోతే రక్షణ శాఖ భూములు ఎందుకు ఇచ్చారని బీజేపీపై మండిపడ్డారు. బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేద్దామని నిర్ణయించుకున్నారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు.
శంషాబాద్ లో ఒక వ్యక్తి తన భూముల్ని కాంగ్రెస్ అక్రమంగా స్వాధీనం చేసుకుని డబ్బులు ఇవ్వాలని కోరుతుందని తన గొడును చెప్పుకున్నాడన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ప్రజలకు ద్రోహం చేశాడన్నారు. ఎమ్మెల్యే పోయిన పార్టీ కి ఎలాంటి ధోకా లేదని గుర్తు చేశారు. రాజేంద్ర నగర్ లో పార్టీ బాధ్యతలు కార్తీక్ రెడ్డి భుజాల మీద ఉందన్నారు.
ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ చేతిలో దగా పడిందని, ప్రతి ఒక్కరు మోసపోయారన్నారు. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలే అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కోటి ఎకరాల భూములు అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ నేత లు దోచుకుంటున్నారని కేటీఆర్ విమర్శలు చేశారు. మంత్రులంతా దండుపాళ్యం బ్యాచ్ లా మారారన్నారు. రెవెన్యూ మంత్రి కొడుకే.. రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో నిజాయితీగా పనిచేసే వారికి అధికారులకు బెదిరింపులు ఎదురౌతున్నాయన్నారు. హైదరాబాద్ లో గతం లో లా అండ్ ఆర్డర్ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందని ప్రజలు గమనించాలన్నారు. గతంలో హీరో రజనీకాంత్ హైద్రాబాద్ అభివృద్ధిని మెచ్చుకున్నారని గుర్తు చేశారు.
కేసీఆర్ పాలనలో జీవో నెంబర్ 50 మీద పేదలకు పట్టాలు ఇచ్చినామని, కానీ కాంగ్రెస్ పాలన ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా ప్రజల పాలిట భూతం లా పని చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయి.. 6 గ్యారంటీ లు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గలో ఒక్క ఇల్లు అయిన కట్టారా..?.. అంటూ ఏకీపారేశారు. హైడ్రా పేరిట హైద్రాబాద్ లో వేల ఇళ్లు కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల్లో అన్ని గ్యారెంటీ లు అమలు చేస్తామన్నాని చెప్పి, రెండున్నర ఏళ్లు గడిచింది ఇప్పుడు ఏమైందన్నారు.
కేసీఆర్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయని, వెయ్యి గురుకుల పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ దన్నారు. 204 మైనార్టీ గురుకులాలు,24 గంటల కరెంట్ ఇచ్చారు. 70 లక్షల మంది రైతులకు 73 వేల కోట్లు రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ దని ప్రశంసలు కురిపించారు. 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో చేసింద శూన్యమన్నారు.
Read more: Meenakshi Natarajan: అదంతా పచ్చి అబద్దం.!.. నామినేషన్ వివాదంపై మీనాక్షీ నటరాజన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?..
ధాన్యం కొనడానికి సంచులు లేవని, కాంగ్రెస్ పాలనలో రైతు బంధు బంద్ అయ్యిందని.. రాహుల్ బంధు మాత్రం బాగా నడుస్తోందన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డికి పట్టిన గతి రేవంత్ రెడ్డికి పడుతుందన్నారు. నిరుద్యోగుల కు మోసం చేసిండు.. నిరుద్యోగ భృతి ఏమైందని అన్నారు. SIR పై ఎవరు ఆందోళన చెందొవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.