
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
CM Vijay thalapathy orders on ammonia gas leak tragedy: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని ప్రైవేట్ సీఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో ఘోర ప్రమాదం సంభవించింది. రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ విషాదంలో మరో 60 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై సీఎం విజయ్ దళపతి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
చాలా మంది అమ్మోనియా గ్యాస్ లీక్ వల్ల ఊపిరాడకుండా చనిపోయినట్లు గుర్తించారు. ఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు, వైద్య సిబ్బంది, స్థానిక అధికారులు ఘటన ప్రదేశంకు చేరుకున్నారు. అస్వస్థతకు గురైన వారిని హుటా హుటీన.. దగ్గరలోని వేల్స్, వెంకటేశ్వర ఆసుపత్రులకు తరలించారు. వీరిలో చాలా మంది సిట్యువేషన్ క్రిటికల్‌గా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొంత మందిని మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
అధికారులకు సీఎం విజయ్ దళపతి కీలక ఆదేశాలు..
తిరువళ్లురులోని రొయ్యల ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో ఏడుగురు దుర్మరణంపై సీఎం విజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఆస్పత్రులలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశించారు. తిరువళ్లూరు కలెక్టర్, స్థానికంగా ఉన్న మంత్రులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
ముఖ్యంగా ఈ ఘటనపై .. పారిశ్రామిక భద్రత ఆరోగ్య డైరెక్టర్, కాలుష్య నియంత్రణ బోర్డు సభ్య కార్యదర్శి, ప్రజారోగ్య అదనపు డైరెక్టర్‌తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. 24 గంటల్లోగా మధ్యంతర నివేదికను ఇవ్వాలని డెడ్ లైన్ విధించారు. అంతే కాకుండా.. మరో మూడు రోజుల్లోగా గ్యాస్ లీక్ ఘటనపై తుది నివేదికను సమర్పించాలని సీఎం విజయ్ దళపతి ఆదేశించారు. మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
Read more: Tamil nadu Ammonia Gas leak: తమిళనాడులోని రొయ్యల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం... అమ్మోనియా గ్యాస్ లీకై 7 గురు దుర్మరణం.. సీఎం విజయ్ తీవ్ర దిగ్బ్రాంతి..
కోల్డ్ స్టోరేజ్ యూనిట్‌లోని వాల్వ్ ఫెయిల్ కావడం వల్లే గ్యాస్ లీక్ అయినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రులు అధవ్ అర్జున, రాజ్ మోహన్‌లు, కలెక్టర్ ఆస్పత్రులకు వెళ్లి బాధితులకు అందిస్తున్న వైద్యంపై వివరాలు సేకరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.